విప్లవాత్మక ఫీచర్లతో Firefox 61

|

వెబ్ బ్రౌజింగ్ విభాగంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న మొజిల్లా ఫైర్‌ఫాక్స్ గూగల్ క్రోమ్‌కు ధీటుగా సరికొత్త వెర్షన్‌ను మార్కెట్లో రిలీజ్ చేసింది. Firefox 61 పేరుతో ఈ బ్రౌజర్ వెర్షన్ అందుబాటులో ఉంటుంది. పలు విప్లవాత్మక ఫీచర్లను ఈ బ్రౌజర్‌లో జోడించినట్లు మొజిల్లా చెబుతోంది. డెస్క్‌టాప్ కంప్యూటింగ్‌లో విండోస్, లైనక్స్ ఇంకా మ్యాక్ ఓఎస్‌లకు ధీటుగా ఎగబాకిన మొజిల్లా తన కొత్త ఫైర్‌ఫాక్స్ 61 వెర్షన్‌లో భాగంగా పలు కొత్త ఎక్స్‌టెన్షన్‌లకు ప్రాణం పోసింది. వీటి ద్వారా ఓపెన్ చేసి ఉన్న టాబ్స్ అలానే సైట్ లను విజువల్ గా కంట్రోల్ చేసుకునే వెసలుబాటు ఉంటుంది. ఇదే సమయంలో ట్యాబ్స్ మధ్య స్విచ్చింగా అనేది కూడా శరవేగంగా జరిగిపోతుంది.

 
విప్లవాత్మక ఫీచర్లతో Firefox 61

సెర్చ్ బార్‌ మరింత ఎఫెక్టివ్‌గా..
యూజర్ తాను చూడాలనుకుంటోన్న ట్యాబ్ పై స్వైప్ చేసిన వెంటనే అవసరం లేని ట్యాబ్స్ మాయమైపోయి వాటి స్థానంలోకి కొత్త టాబ్స్ వచ్చి చేరతాయి. ఫైర్‌ఫాక్స్ 61 వెర్షన్‌లో భాగంగా సెర్చ్ బార్‌ను కూడా మరింత ఎఫెక్టివ్‌గా అప్‌డేట్ చేసినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో హోమ్ స్ర్కీన్‌ను కూడా మరింత విప్లవాత్మకంగా తీర్చిదిద్దినట్లు మొజిల్లా చెబుతోంది.

మీరు తెలుగు మాట్లాడితే అదే టైప్ చేస్తుంది,ఈ యాప్ గురించి తెలుసా !మీరు తెలుగు మాట్లాడితే అదే టైప్ చేస్తుంది,ఈ యాప్ గురించి తెలుసా !

ఆండ్రాయిడ్ వెర్షన్‌లోనూ మార్పు చేర్పులు..
ఆండ్రాయిడ్ మొబైల్ వెర్షన్ కోసం అభివృద్ధి చేసిన ఫైర్‌ఫాక్స్ 61 బ్రౌజర్ గురించి మొజిల్లా పలు ఆసక్తికర వివరాలను రివీల్ చేసింది. మొబైల్ వెర్షన్‌లో నిక్షిప్తం చేసిన క్వాంటమ్ సీఎస్ఎస్ ఇంజిన్ వెబ్ పేజీలను వేగవంతంగా లోడ్ చేస్తూ బ్రౌజర్ పనితీరునే కొత్త లెవల్‌కు తీసుకువెళుతుందట.

ప్రస్తుతానికి టెస్టింగ్ దశలో..
ప్రస్తుతానికి మొబైల్ బ్రౌజర్ తాలూకా ఇంప్రూవ్‌మెంట్స్ అన్ని టెస్టింగ్ ఫేజులో ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే వీటిని అందరికి అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశముంది. తాజా పరిణమాలను బట్టి చూస్తుంటే తన బ్రౌజర్‌లో నిత్యం కొత్త ఫీచర్లను యాడ్ చేస్తుండటం ద్వారా బ్రౌజర్ మార్కెట్లో తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకోవాలిని మొజిల్లా సంకల్పించినట్లు స్పష్టమవుతోంది.

Best Mobiles in India

English summary
According to the latest reports, recently Mozilla released the new version of its browser, Firefox 61 with game-changing new features.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X