మొబైల్స్ కోసం కొత్త ఆపరేటింగ్ సిస్టమ్: మొజిల్లా

Posted By: Staff

మొబైల్స్ కోసం కొత్త ఆపరేటింగ్ సిస్టమ్: మొజిల్లా

శాన్ ప్రాన్సికో: ఫైర్ ఫాక్స్ తయారీదారు మొజిల్లా కంపెనీ మొబైల్స్, టాబ్లెట్స్ కోసం ప్రత్యేకంగా వెబ్ బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్‌ని మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్నట్లు తెలిపింది. వివరాల్లోకి వెళితే మొజిల్లా రీసెర్చర్ ఆండ్రీస్ గాల్ చెప్పిన ప్రకారం ఈ ప్రాజెక్టు పేరుని బూట్ టు గీకూ(B2G)గా నిర్ణయించడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ పూర్తిగా ఓపెన్ వెబ్ కోసం తయారు చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కొత్త ప్రాజెక్టుని తయారు చేయడం వెనుకున్న ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే డవలపర్స్ ఎవరైతే ఉన్నారో వారంతా HTML 5కి సంబంధించిన వెబ్ అప్లికేషన్స్‌ని రూపోందించడం జరుగుతుంది. సరిగ్గా అలాంటి వెబ్ అప్లికేషన్సనే మొజిల్లా మొబైల్స్, టాబ్లెట్స్ కోసం రూపోందిస్తుంది.

ఈ సందర్బంలో మొజిల్లా ప్రతినిధి మాట్లాడుతూ మేము ఈ పనిని పూర్తిగా ఓపెన్ సోర్స్ మాదిరి తయారు చేస్తున్నాం. ఈ సోర్స్‌ని రియల్ టైమ్‌లో ఉపయోగించుకునే విధంగా రూపోందించడం జరుగుతుందని తెలియజేశారు. మేము రూపోందిస్తున్నటువంటి ఈ వెబ్ అప్లికేషన్స్‌ని కేవలం మొజిల్లా ఫైర్ ఫాక్స్‌లో రన్ చేయడమే కాకుండా వెబ్‌లో కూడా రన్ చేయడం జరుగుతుందని వెల్లిడించారు.

Areas of Development:

* New web APIs: build prototype APIs for exposing device and OS capabilities to content (Telephony, SMS, Camera, USB, Bluetooth, NFC, etc.)
* Privilege Model: making sure that these new capabilities are safely exposed to pages and applications
* Booting: prototype a low-level substrate for an Android-compatible device;
* Applications: choose and port or build apps to prove out and prioritize the power of the system.

మొజిల్లా కొత్తగా రూపోందిస్తున్నటువంటి ఈ ప్రాజెక్టు వల్ల డవలపర్స్ సింగిల్ కోడ్‌తో అన్ని రకాల మొబైల్స్ ఫోన్స్‌లలో ఈ అప్లికేషన్స్‌ని రన్ చేసుకోవచ్చు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot