ఆండ్రాయిడ్ అంటే ఏమిటి..ఎమ్‌టీఎస్‌ తొలి ఆండ్రాయిడ్ ఫోన్ విడుదల

Posted By: Super

ఆండ్రాయిడ్ అంటే ఏమిటి..ఎమ్‌టీఎస్‌ తొలి ఆండ్రాయిడ్ ఫోన్ విడుదల

ఆండ్రాయిడ్ అంటే ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ గూగుల్ రూపొందించిన మొబైల్ నిర్వాహక వ్యవస్థ. దీనిని ప్రముఖ సెల్‌ఫోన్ తయారీదారులు తమ ఫోన్‌లలో ఉపయోగిస్తున్నారు. దీనిని స్వేచ్చాయిత సాఫ్ట్‌వేర్ అయిన లైనెక్స్ ఆధారంగా రూపొందించారు. ఇది మొభైల్‌లలో వినియోగించడానికి అనువుగా లైనక్స్‌లో ఉన్న కొన్ని ఉపయోగకర అంశాలను మాత్రమే పొందుపరిచడం జరిగింది.

ఎమ్‌టీఎస్‌ బ్రాండ్‌ సొంత దారు సిస్టెమా శ్యాం టెలీ సర్వీసెస్‌ కోటి వినియోగదార్ల మైలురాయిని దాటినట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా 'ఎమ్‌టీఎస్‌ పల్స్‌' పేరిట కంపెనీ తన తొలి స్మార్ట్‌ఫోన్‌ను మంగళవారం న్యూఢిల్లీలో విడుదల చేసింది. రూ.18,000 విలువ చేసే ఈ ఫోన్‌ను వినియోగదార్లు ఉచితంగా పొందవచ్చు. అయితే 12 నెలల పాటు ప్రతీ నెలా రూ.1500 అద్దె కట్టాల్సి ఉంటుంది. అదనంగా ప్రతీ నెలా వినియోగదారు 1500 నిమిషాలు టాక్‌టైమ్‌, 1500 ఎస్‌ఎమ్‌ఎస్‌లు, 1500 ఎమ్‌బీ డాటాను ఉచితంగా పొందొచ్చు. కొత్త ఫోన్‌ నమూనాతో కంపెనీ ప్రెసిడెంట్‌, సీఈఓ సెవోలాడ్‌ రోజనోవ్‌, చీఫ్‌ మార్కెటింగ్‌ ఆఫీసరు లియోనిడ్‌ ముసాతోవ్‌లను చిత్రంలో చూడొచ్చు.

ఇకపోతే గతంలో లెనోవో కంపెనీ కూడా ఈ ఆండ్రాయిడ్ ఫోన్ లాప్ ట్యాప్‌ని విడుదల చేయడం జరిగింది. లెనోవో లీ ప్యాడ్ 10.1 అంగుళాల టచ్‌స్క్రీన్, 3జి, వీడియో చాటింగ్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలు. లీప్యాడ్‌లో 1.3 గిగా హెర్ట్జ్ స్నాప్ డ్రాగాన్ ప్రాసెసర్, యు1 బేస్‌లో ఇంటెల్ 1.2 గిగాహెర్ట్జ్ కోర్ ఐ 5-50 యుఎమ్ ప్రాసెసర్ (ఐ7 ఆప్షనల్) ఉంటాయి. 8 గంటల బ్యాటరీ బ్యాక్‌అప్. ఆండ్రాయిడ్ 2.2 ఆపరేటింగ్ సిస్టం ఇందులో ప్రత్యేకం. ఈమెయిల్, న్యూస్, ఇతర రియల్ టైమ్ కంటెంట్ వగైరాలను వేగంగా యాక్సెస్ చేసుకోవడాకి సులభమైన ఇంటర్‌ఫేస్ దీనికి ప్రత్యేక ఆకర్షణ.. యు1 ఐడియా ప్యాడ్ అనేది విండోస్ ఆధారంగా పనిచేసే లాప్‌టాప్. దీని టచ్ క్రన్‌ను అవసరం లేనప్పుడు విడిగా ఉంచుకొంటే యాండ్రాయిడ్ ఆధారంగా పనిచేసే టాబ్లెట్‌గా మారిపోతుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot