Home
News

ఎంటీఎస్ ఇండియా నుంచి డ్యూయల్ నెట్‌వర్క్ ఫోన్స్ అక్టోబర్‌లో!

By Super
MTS India to launch dual technology phones from October


ఎంటీఎస్ బ్రాండ్ కింద టెలికం సేవలందిస్తున్న సిస్టిమా శ్యామ్ టెలీ సర్వీసెస్ అక్టోబర్ నుంచి డ్యూయల్ నెట్‌వర్క్ ఫోన్‌లను విక్రయించనుంది. ఈ మధ్య ముగింపు ఫోన్‌లు సీడీఎమ్ఏ అదేవిధంగా జీఎస్ఎమ్ నెట్‌వర్క్‌లను సపోర్ట్ చేస్తాయి. వివిధ శ్రేణుల్లో లభ్యమయ్యే ఈ ఫోన్‌ల ధరలు రూ.6,000 నుంచి రూ.12,000 ధరల మధ్య ఉంటాయని ఎస్ఎస్‌టీఎల్ చీఫ్ మార్కెటింగ్ సేల్స్ అధికారి లిన్నీ ముసాటవ్ సీడీజీ అంతర్జాతీయ రోమింగ్ టీమ్ మీట్‌లో తెలిపారు.

ఎంటీఎస్ నుంచి మూడు సరికొత్త ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు!

ఎంటీఎస్ పేరుతో సీడీఎమ్ఏ సేవలందిస్తున్న సిస్టమా శ్యామ్ టెలీ సర్వీసెస్(ఎస్ఎస్‌టీఎల్) మూడు ఆండ్రాయిడ్ ఆధారత స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఎంటాగ్ 281, ఎంటాగ్ 352,ఎంటాగ్ 351 మోడళ్లలో విడుదలైన ఈ స్మార్ట్‌ఫోన్‌లను ప్రత్యేకమైన లైవ్‌టీవీ అప్లికేషన్‌ను ఒదిగి ఉన్నాయి. ఈ ప్రత్యేకతతో 100 లైవ్‌టీవీ చానళ్లను వీక్షించవచ్చు. ఈ మూడింటితో కలిపి స్మార్ట్‌ఫోన్ విభాగంలో 8 రకాల స్మార్ట్‌ఫోన్‌లను ఎంటీఎస్ ఇప్పటి వరకు ప్రవేశపెట్టింది. ఈ ఫోన్‌ల కొనుగోలు పై అందించే హైస్పీడ్ డేటా పథకాలతో పాటు మూడు నెలల పాటు ఎంటీఎస్ లోకల్ నెంబర్ల మధ్య అపరిమిత కాల్స్ నిర్వహించుకోవచ్చు.

ఎంటీఎస్ ఎంటాగ్ 351(MTS MTag 351):

3.5 అంగుళాల టచ్‌స్ర్కీన్, ఆండ్రాయిడ్ 2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం, ఆడ్వాన్సుడ్ 800మెగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ఎస్1 ప్రాసెసర్, శక్తివంతమైన 1300ఎమ్ఏహెచ్ బ్యాటరీ,

3 మెగా పిక్సల్ రేర్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ కెమెరా, మొబైల్ హాట్‌స్పాట్, 2జీబి మెమెరీ కార్డ్, 32జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమెరీ, ధర రూ.7,499.

ఎంటీఎస్ ఎంటాగ్ 352 (MTS MTag 352):

3.5 అంగుళాల టచ్‌స్ర్కీన్, ఆండ్రాయిడ్ 2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం, ఆడ్వాన్సుడ్ 800మెగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగెన్ ఎస్1 ప్రాసెసర్, శక్తివంతమైన 1400ఎమ్ఏహెచ్ బ్యాటరీ, 3 మెగా పిక్సల్ కెమెరా, మొబైల్ హాట్‌స్పాట్, 2జీబి మెమరీ కార్డ్, 32జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమెరీ, ధర రూ.6,499.

ఎంటీఎస్ ఎంటాగ్ 281(MTS MTag 281):

2.8 అంగుళాల టచ్‌స్ర్కీన్, ఆండ్రాయిడ్ 2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం, ఆడ్వాన్సుడ్ 800మెగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ఎస్1 ప్రాసెసర్, శక్తివంతమైన 1200ఎమ్ఏహెచ్ బ్యాటరీ,

3 మెగా పిక్సల్ కెమెరా, మొబైల్ హాట్‌స్పాట్, ధర రూ.5,499.

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X