ఎంటీఎస్ బ్లేజ్ పవర్ వై-పై

Posted By:

ఎంటీఎస్ బ్రాండ్ క్రింద టెలికామ్ సేవలను అందిస్తోన్న అంతర్జాతీయ కంపెనీ సిస్టిమా శ్యామ్ టెలీసర్వీసెస్ లిమిటెడ్ (ఎస్ఎస్‌టీఎల్) ‘' (MTS MBlaze Power Wi-Fi) పేరుతో సరికొత్త ఉత్పత్తిని మార్కెట్లో విడుదల చేసింది. ఈ పోర్టబుల్ డివైస్‌ను ఇంటర్నెట్ వై-ఫై అలానే మొబైల్ ఫోన్‌లను చార్జ్ చేసుకునేందుకు పవర్ బ్యాంక్ గానూ ఉపయోగించుకోవచ్చు.

 ఎంటీఎస్ బ్లేజ్ పవర్ వై-పై

ఈ బహుళ ఉపయోగకర పరికం ఏకకాలంలో 6 డివైస్ లకు హైస్పీడ్ ఇంటర్నెట్‌ను అందించటంతో పాటు 5200 ఎమ్ఏహెచ్ సామర్ధ్యం గల శక్తివంతమైన బ్యాటరీని కలిగి స్మార్ట్‌ఫోన్‌లను మూడు సార్లు పూర్తిగా చార్జ్ చేయగలదు.

ఎంటీఎస్ బ్లేజ్ పవర్ వై-ఫై ప్రీపెయిడ్ అలానే పోస్ట్ పెయిడ్ ఖాతాదారుల కోసం అందుబాటులో ఉంది. ఎంటీఎస్ బ్రండెడ్ రిటైల్ స్టోర్లు అలానే ప్రముఖ ఆన్‌లైన్ స్టోర్‌ల వద్ద ఈ పవర్ వై-ఫై లభ్యమవుతోంది. ప్రీపెయిడ్ వినియోగదారులు 10 జీబి బండిల్డ్ డేటా అలానే 5జీబి యూట్యూబ్ డేటాతో ఈ పవర్ వై-ఫై ధర రూ.3,499కి పొందవచ్చు. పోస్ట్ పెయిడ్ వినియోగదారులు ఈ పవర్ వై-ఫైను రూ.2,999కి సొంతం చేసుకోవచ్చు. ఆఫర్లు వర్తిస్తాయి.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot