అమెరికాకైనా 30 పైసలే!

Posted By: Super

 అమెరికాకైనా 30 పైసలే!

న్యూడిల్లీ: లోకల్.. ఎస్‌టీడీ.. ఐఎస్‌డీ.. ఇలా ఏ కాల్‌కైనా నిమిషానికి 30 పైసలే. ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఎటువంటి కాల్‌కైనా నిమిషానికి కేవలం 30 పైసలు మాత్రమే చార్జ్ చేస్తామని సీడీఎమ్ఏ సర్వీస్ ప్రొవైడర్ ఎంటీఎస్ బుధవారం ప్రకటించింది. ప్రస్తుత ఎంటీఎస్ వినియోదారులకే కాకుండా, కొత్త కస్లమర్‌లకు సైతం ఈ ఆఫర్ వర్తిస్తుంది. యూజర్లు రూ.50,100 విలువైన రిచార్జులతో ఈ సేవను పొందవచ్చని ఎంటీఎస్ ఇండియా చీఫ్ మార్కెటింగ్ విక్రయాల విభాగం అధికారి లియోనిడ్ ముసాతోవ్ తెలిపారు. అమెరికా, కెనడా ప్రాంతాలకు మాత్రం నెలకు 100నిమిషాల వరకు నిమిషానికి 30 పైసలు చార్జ్ చేస్తామని, అనంతరం సాధారణ టారిఫ్ వర్తిస్తుందని ఆయన వెల్లడించారు. 30 పైసలకే ఎస్‌ఎంఎస్, డేటా వినియోగం వంటి అంశాలు ఈ ఆఫర్‌‌లో వర్తిస్తాయి.

యూనినార్ అన్‌లిమిటెడ్ ఇంటర్నెట్ ప్యాకేజ్!

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ సర్కిల్‌లోని వినియోగదారుల కోసం ప్రముఖ టెలికాం ఆపరేటర్ యూనినార్ సరికొత్త ఇంటర్నెట్ ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. రూ.47తో రోజువారీ పరిమితి లేని ఇంటర్నెట్ జీపీఆర్‌ఎస్ ప్యాకేజీ ‘ఎస్‌టీవీ 47’ను ప్రారంభించింది. దీంతో 30 రోజుల పాటు 1జీబీ ఇంటర్నెట్ బ్రౌజింగ్‌ను వినియోగించుకోవచ్చు. రోజుకింత అనే పరిమితి లేకుండా తక్కువ ఖర్చులో హైస్పీడ్ ఇంటర్నెట్‌ను అందించే ఎస్‌టీవీ 47 ప్యాక్… ఏపీ సర్కిల్‌లోనే మొదటిదని యూనినార్ బిజినెస్ హెడ్(ఏపీ సర్కిల్) సతీష్ కుమార్ కన్నన్ పేర్కొన్నారు.

దగ్గర్లోని యూనినార్ రిటైలర్‌ను సంప్రదించడం ద్వారా గానీ, ‘స్టార్222స్టార్7స్టార్47యాష్’కు డయల్ చేసి కూడా ఈ ప్యాకేజీని యాక్టివేట్ చేసుకోవచ్చని తెలిపారు. జీపీఆర్‌ఎస్ సెట్టింగ్స్ కోసం ‘యాష్‌ఏఎల్‌ఎల్‌యాష్’ అని టైప్ చేసి 58355 (టోల్-ఫ్రీ) నెంబర్‌కు ఎస్‌ఎంఎస్ పంపాల్సి ఉంటుందని యూనినార్ ప్రకటించింది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot