అమాంతంగా పెరిగిన అపర కుబేరుడు ముకేష్ అంబానీ సంపద

By Gizbot Bureau
|

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీకి 2019 సంవత్సరం బాగా కలిసొచ్చిందనే చెప్పవచ్చు. ఈ ఏడాది ఆయన సంపద విలువ ఏకంగా 16.5 బిలియన్‌ డాలర్ల మేర (సుమారు రూ. 1.2 లక్షల కోట్లు) పెరిగింది. 60.8 బిలియన్‌ డాలర్లకు చేరింది.

బిలియనీర్స్‌

బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌ ద్వారా ఈ విషయాలు వెల్లడయ్యాయి.గణాంకాల ప్రకారం సుమారు 61 బిలియన్‌ డాలర్ల నికర విలువతో (దాదాపు రూ. 4.3 లక్షల కోట్లు) ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల జాబితాలో ముకేశ్‌ అంబానీ 12వ స్థానంలో నిల్చారు. ఏడాది కాలంగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్లు దూసుకెళ్లడం .. ముకేశ్‌ అంబానీ సంపద వృద్ధికి కారణమైంది.

 

రైల్వే టికెట్ కోసం రైల్వే టికెట్ కోసం "బుక్ నౌ పే లేటర్" ఫీచర్ ను మొదలెట్టిన IRCTC

రిలయన్స్‌ షేరు

రిలయన్స్‌ షేరు

నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజీ (ఎన్‌ఎస్‌ఈ) గణాంకాల ప్రకారం.. గడిచిన సంవత్సర కాలంలో రిలయన్స్‌ షేరు ఏకంగా 41 శాతం ఎగిసింది. మంగళవారం ఎన్‌ఎస్‌ఈలో రూ. 1,544.50 వద్ద క్లోజయ్యింది. గత కొన్నాళ్లుగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ వివిధ వ్యాపార విభాగాల్లోకి శరవేగంగా విస్తరిస్తోంది.

 

 

దేశ వ్యాప్తంగా ఉచిత వైఫై, ప్లాన్ చేస్తున్న కేంద్రందేశ వ్యాప్తంగా ఉచిత వైఫై, ప్లాన్ చేస్తున్న కేంద్రం

జియో గిగాఫైబర్‌ సేవలతో

జియో గిగాఫైబర్‌ సేవలతో

జియో పేరిట టెలికం రంగంలో సంచలనం సృష్టించిన రిలయన్స్‌ తాజాగా జియో గిగాఫైబర్‌ సేవలతో బ్రాడ్‌బ్యాండ్‌ సేవల్లోనూ దూసుకెడుతోంది. ఇక రిటైల్‌ రంగంలోనూ పట్టు సాధించడంతో పాటు త్వరలో ఈ-కామర్స్‌ విభాగంలోకి కూడా ప్రవేశించేందుకు జోరుగా కసరత్తు చేస్తోంది. ఈ-కామర్స్‌లో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ వంటి దిగ్గజాలకూ గట్టి పోటీనివ్వనుంది.

 

గూగుల్ పేలో 2 లక్షల రివార్డులను పొందడం ఎలా?గూగుల్ పేలో 2 లక్షల రివార్డులను పొందడం ఎలా?

టాప్‌లో బిల్‌ గేట్స్‌

టాప్‌లో బిల్‌ గేట్స్‌

బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌ ప్రకారం.. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు, టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ సంపద ఈ ఏడాది మరో 22.4 బిలియన్‌ డాలర్లు పెరిగి 113 బిలియన్‌ డాలర్లకు చేరింది.

 

 

పాత ప్లాన్‌లను తిరిగి తీసుకువచ్చిన ఎయిర్‌టెల్పాత ప్లాన్‌లను తిరిగి తీసుకువచ్చిన ఎయిర్‌టెల్

రెండో స్థానంలో ఉన్న అమెజాన్‌ సీఈవో జెఫ్‌ బెజోస్‌

రెండో స్థానంలో ఉన్న అమెజాన్‌ సీఈవో జెఫ్‌ బెజోస్‌

రెండో స్థానంలో ఉన్న అమెజాన్‌ సీఈవో జెఫ్‌ బెజోస్‌ సంపద మాత్రం 13.2 బిలియన్‌ డాలర్లు తగ్గింది. మరోవైపు, చైనాకు చెందిన ఈ-కామర్స్‌ దిగ్గజం ఆలీబాబా గ్రూప్‌ వ్యవస్థాపకుడు జాక్‌ మా నికర విలువ 11.3 బిలియన్‌ డాలర్లు పెరిగింది. అత్యంత సంపన్నుల లిస్టులో ఆయన 19వ స్థానంలో ఉన్నారు.

Best Mobiles in India

English summary
Mukesh Ambani Adds $16 Billion To Wealth, Becomes 12th Richest In World: Report

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X