Home
News

ప్రపంచ కుబేరుల్లో 6 స్థానానికి ముకేశ్ అంబానీ!! మస్క్, గూగుల్ ఫౌండర్ వెనక్కి...

ఇండియా యొక్క బిలియనీర్ అత్యంత ధనవంతుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఎప్పుడు ఎదో ఒక అద్భుతానికి తెరలేపుతూ ఉంటాడు. కొన్ని రోజులుగా జియోలో పెట్టుబడులు వరదలాగా వస్తున్న సంగతి అందరికి తెలిసిన విషయమే. వీటి యొక్క ప్రభావాల కారణంగా ముఖేష్ అంబానీ యొక్క సంపద ఇప్పుడు ప్రముఖ టెక్ దిగ్గజాలు టెస్లా CEO ఎలోన్ మస్క్ మరియు గూగుల్ సహ వ్యవస్థాపకులు సెర్గీ బ్రిన్ మరియు లారీ పేజ్ యొక్క నికర ఆదాయాలను అధిగమించి ముందుకు సాగిపోయాడు.

ప్రపంచ కుబేరుల్లో ముకేశ్ అంబానీ

ప్రపంచ కుబేరుల్లో ముకేశ్ అంబానీ

బ్లూమ్‌బెర్గ్ ఇండెక్స్ ఇటీవల విడుదల చేసిన బిలియనీర్స్ జాబితా తాజా సమాచారం ప్రకారం రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) చైర్మన్ నికర ఆదాయ విలువ 72.4 బిలియన్ డాలర్లుగా గుర్తించింది. ఇప్పుడు ప్రపంచ బిలియనీర్స్ జాబితాలో అంబానీ ఆరవ స్థానంలో ఉన్నారు. టెక్ దిగ్గజ వ్యవస్థాపకులు మస్క్ యొక్క నికర ఆదాయ విలువ 68.6 బిలియన్ డాలర్లు కాగా, లారీ పేజ్ యొక్క నికర ఆదాయ సంపద 71.6 బిలియన్ డాలర్లు మరియు బ్రిన్స్ యొక్క నికర ఆదాయ సంపద 69.4 బిలియన్ డాలర్లు.

 

జియో ప్లాట్‌ఫామ్‌లో పెట్టుబడులు

జియో ప్లాట్‌ఫామ్‌లో పెట్టుబడులు

రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) కు వెన్నెముకలా ఉన్న టెలికాం యూనిట్ జియో ప్లాట్‌ఫామ్‌లలో ఇటీవల ప్రముఖ టెక్ దిగ్గజలు ఫేస్‌బుక్, కెకెఆర్ మరియు ఇంటెల్ సంస్థలతో సహా పలు సంస్థలు పెట్టుబడులను పెట్టాయి. ఈ సంస్థల యొక్క నిధులు జియోలోకి వచ్చి చేరిన తరువాత మార్చి నుండి RIL సంస్థ యొక్క షేర్ ధర అమాంతం పెరిగింది.

ప్రపంచంలోని పది మంది ధనవంతులలో అంబానీ స్థానం

ప్రపంచంలోని పది మంది ధనవంతులలో అంబానీ స్థానం

ప్రపంచ ప్రఖ్యాత టెక్ సంస్థలు జియో ప్లాట్‌ఫామ్‌లలో పెట్టుబడులు పెట్టడం వల్ల 2021 మార్చి 31 న లక్ష్యంగా పెట్టుకున్న తేదీ కంటే ముందే కంపెనీ నికర రుణ రహితంగా మారిందని RIL సంస్థ అధికారికంగా తెలిపింది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం అంబానీ సంపద ఇటీవల జియో ప్లాట్‌ఫామ్‌లలో పెట్టుబడి పెట్టిన ప్రఖ్యాత పెట్టుబడిదారు వారెన్ బఫ్ఫెట్‌ను అధిగమించింది. అంతే కాకుండా ప్రపంచంలోని పది మంది ధనవంతులలో ఆసియా ఖండం నుండి అంబానీ మాత్రమే స్థానం దక్కిచ్చుకున్నాడు.

Best Mobiles in India

English summary
Mukesh Ambani Become 6th Richest Man in the World
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X