రోజుకు రూ.300 కోట్లు, ఉచితంతో ఊడ్చుకుపోయిందెక్కడ ?

సంపన్న భారతీయుల జాబితాలో పారిశ్రామిక దిగ్గజం, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.

|

సంపన్న భారతీయుల జాబితాలో పారిశ్రామిక దిగ్గజం, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. దాదాపు రూ.3,71,000 కోట్ల సంపదతో బార్‌క్లేస్‌ హురున్‌ ఇండియా రిచ్‌ లిస్ట్‌-2018లో కూడా అగ్రస్థానం దక్కించుకున్నారు. ఆయన టాప్‌-1 స్థానంలో ఉండటం ఇది వరసగా ఏడోసారి. సుమారు రూ.1,000 కోట్లకు పైగా సంపద గల సంపన్న భారతీయులతో బార్‌క్లేస్‌ ఈ జాబితా రూపొందించింది. ఈ సారి లిస్టులో చోటు దక్కించుకున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగినట్లు హురున్‌ రిపోర్ట్‌ ఇండియా ఎండీ రెహ్మాన్‌ జునైద్‌ తెలిపారు.

నెలకి రూ. 4,499 కట్టండి, కొత్త ఐఫోన్ XS సొంతం చేసుకోండినెలకి రూ. 4,499 కట్టండి, కొత్త ఐఫోన్ XS సొంతం చేసుకోండి

ముకేశ్ అంబానీ సంపాదన

ముకేశ్ అంబానీ సంపాదన

సెకనుకు రూ.35 వేలు.. నిమిషానికి రూ.21 లక్షలు.. గంటకు రూ.12.5 కోట్లు.. రోజుకు రూ.300 కోట్లు.. ఇదీ గడిచిన ఏడాది కాలంలో భారతీయ కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముకేశ్ అంబానీ సంపాదన తీరు.

 వరుసగా ఏడోసారి ..

వరుసగా ఏడోసారి ..

తొలి స్థానంలో ఉన్న ముకేశ్ మొత్తం సంపద.. తర్వాతి మూడు స్థానాల్లో ఉన్నవారి మొత్తం సంపద కంటే ఎక్కువ కావడం గమనార్హం. రూ.3,71,000 కోట్ల సంపదతో వరుసగా ఏడోసారి ముకేశే అగ్రస్థానంలో నిలిచారు.

 అజీం ప్రేమ్‌జీ నాలుగో స్థానం..

అజీం ప్రేమ్‌జీ నాలుగో స్థానం..

రూ.1,59,000 కోట్లతో ఎస్‌పీ హిందుజా కుటుంబం రెండో స్థానంలో ఉండగా, రూ.1,14,500 కోట్లతో లక్ష్మీనివాస్ మిట్టల్ కుటుంబం మూడో స్థానంలో, రూ.96,100 కోట్లతో అజీం ప్రేమ్‌జీ నాలుగో స్థానంలో ఉన్నారు.

45 శాతానికిపైగా పుంజుకోవడం ..

45 శాతానికిపైగా పుంజుకోవడం ..

రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ విలువ 45 శాతానికిపైగా పుంజుకోవడం ముకేశ్ అంబానీ సంపదను అమాంతం పెంచేసిందని బార్క్‌లేస్ అభిప్రాయపడింది.

చివరి ఆరు స్థానాల్లో..

చివరి ఆరు స్థానాల్లో..

టాప్-10లో చివరి ఆరు స్థానాల్లో ఉన్నవారి విషయానికొస్తే.. దిలీప్ సంఘ్వీ (రూ.89,700 కోట్లు), ఉదయ్ కొటక్ (రూ.78,600 కోట్లు), సైరస్ పూనవాలా (రూ.73,000 కోట్లు), గౌతమ్ అదానీ కుటుంబం (రూ.71,200 కోట్లు), సైరస్ పల్లోంజీ మిస్త్రీ (రూ.69,400 కోట్లు), షాపూర్ పల్లోంజీ మిస్త్రీ (రూ.69,400 కోట్లు) ఉన్నారు.

అంబానీల సంపద రూ.3,90,500 కోట్లు..

అంబానీల సంపద రూ.3,90,500 కోట్లు..

ఇక కుటుంబ ఆస్తుల్లో చూస్తే అంబానీల సంపద రూ.3,90,500 కోట్లుగా ఉన్నది. కాగా, రూ.1,000 కోట్లు అంతకంటే ఎక్కువ సంపద ఉన్నవారు 34 శాతం పెరుగగా, 831 మంది కుబేరుల సంపద దేశ జీడీపీలో పావు శాతానికి సమానంగా ఉండటం విశేషం.

719 బిలియన్‌ డాలర్లు..

719 బిలియన్‌ డాలర్లు..

సంపన్న భారతీయుల జాబితా లిస్టు 2017లో 617గా ఉండగా.. ఈసారి 831కి చేరినట్లు హురున్‌ రిపోర్ట్‌ ఇండియా ఎండీ రెహ్మాన్‌ జునైద్‌ వెల్లడించారు. వీరందరి సంపద కలిపితే 719 బిలియన్‌ డాలర్లుగా ఉంటుంది.

జీడీపీలో ఇది పావు భాగం

జీడీపీలో ఇది పావు భాగం

భారత్‌ స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ)లో ఇది పావు భాగం కావడం గమనార్హం. అంతర్జాతీయ ద్రవ్య నిధి అంచనాల ప్రకారం భారత జీడీపీ 2.85 ట్రిలియన్‌ డాలర్లు.

సంపన్నుల కేంద్రంగా ముంబై..

సంపన్నుల కేంద్రంగా ముంబై..

అత్యంత సంపన్నుల కేంద్రంగా ముంబై అగ్రస్థానంలో ఉంది. ఇక్కడ రూ.1,000 కోట్లు పైగా సంపద గల వారు మొత్తం 233 మంది ఉన్నారు. 163 మంది సంపన్నులతో న్యూఢిల్లీ రెండో స్థానంలో, 70 మందితో బెంగళూరు మూడోస్థానంలో ఉంది.

 కొత్తగా 306 మంది చోటు..

కొత్తగా 306 మంది చోటు..

2018 జాబితాలో కొత్తగా 306 మంది చోటు దక్కించుకోగా.. గతేడాది లిస్టులో ఉన్న 75 మంది ఈ సారి స్థానం కోల్పోయారు.

అత్యంత పిన్న వయస్కుడు

అత్యంత పిన్న వయస్కుడు

ఒరావెల్‌ స్టేస్‌ (ఓయో రూమ్స్‌) వ్యవస్థాపకుడు రితేష్‌ అగర్వాల్‌ (24 ఏళ్లు).. ఈ లిస్టులో అత్యంత పిన్న వయస్కుడు కాగా.. ఎండీహెచ్‌ మసాలా వ్యవస్థాపకుడు ధరమ్‌ పాల్‌ గులాటి (95 సంవత్సరాలు) వయోధికుడు.

తెలుగు రాష్ట్రాల నుంచి రూ.1,000 కోట్లకు పైబడిన సంపద..

తెలుగు రాష్ట్రాల నుంచి రూ.1,000 కోట్లకు పైబడిన సంపద..

రెండు తెలుగు రాష్ట్రాల నుంచి రూ.1,000 కోట్లకు పైబడిన సంపద గల వారి సంఖ్య 50కి పైగానే ఉంది. వీరిలో రూ.1,200 కోట్లతో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి సతీమణి నారా భువనేశ్వరి కూడా ఉండటం గమనార్హం. హెరిటేజ్‌ ఫుడ్స్‌ వాటాదారుగా ఆమె సంపద రూ.1,200 కోట్లున్నట్లు బార్‌క్లేస్‌ తాజా జాబితా తెలియజేసింది.

Best Mobiles in India

English summary
Mukesh Ambani earned Rs 300 cr per day over last one year more news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X