ముఖేష్‌ అంబానీ భవంతి స్థలం ముస్లిం వక్ఫ్‌బోర్డుది

Posted By: Staff

ముఖేష్‌ అంబానీ భవంతి స్థలం ముస్లిం వక్ఫ్‌బోర్డుది

ముంబై: ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో చోటు సంపాదిచుకున్న భారత సంతతికి చెందిన ప్రముఖ వాణిజ్యవేత్త ముఖేష్‌ అంబానీ ఎంతో ఇష్టపడి నిర్మించుకున్న కలల సౌధం ప్రస్తుతం పెద్ద దుమారాన్ని రేపుతోంది. అసలు విషయానికి వస్తే... ముఖేష్‌ అంబానీ ఎంతో ముచ్చపడి కట్టుకున్న అత్యాధునిక భవంతి స్థలం వాస్తవానికి ముస్లిం వక్ఫ్‌బోర్డుదని తేలింది. ఈ స్థలం కొనుగోలు చేయడంలోనే ఆయన అవకతవకలకు పాల్పడ్డారని ఆయన పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం మహారాష్ట్ర ప్రభుత్వం దీనిపై విచారణ చేపట్టింది కూడా. దక్షిణ ముంబయిలోని అల్టామౌంట్‌ రోడ్‌ ప్రాంతంలోఉన్న 4,532 చదరపు మీటర్ల ఫ్లాట్‌ను వాస్తవానికి ముస్లిం అనాథ పిల్లలకోసం వినియోగించాలని వక్ఫ్‌బోర్డు నిర్ణయించింది.

అయితే రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ ముఖేష్‌ అంబానీ ఈ స్థలాన్ని కుర్రిమ్‌బాయ్‌ ఇబ్రాహీం ఖోజా ఆర్ఫనేజ్‌ ట్రస్టు నుంచి 2002లో 4.88 మిలియన్‌ డాలర్లు (రూ.21,50,00,000)కోట్లు వెచ్చించి కొనుగోలు చేశారు. ఈ డీల్‌ను ముంబయి ఛారిటీ కమిషనర్‌ కూడా ఆమోదించారు. అయితే ఈ స్థలాన్ని బదిలీ చేసుకునేందుకు ముఖేష్‌ అంబానీ మహారాష్ట్ర స్టేట్‌ వక్ఫ్‌బోర్డు అనుమతి తీసుకోలేదు. ఇస్లాం చట్ట ప్రకారం వక్ఫ్‌ ఆస్తులన్నీ... ముస్లిం మతానికి సంబంధించిన కార్యకలాపాల కోసం కానీ... లేదా దానధర్మసంస్థల కోసం వాటని ప్రత్యేకంగా కేటాయించి పెడతారు.ముఖేష్‌ అంబాని ఇంటిపై వస్తున్న వివావాలపై వ్యాఖ్యానించేం దుకు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధికార ప్రతినిధి నిరాకరించారు.

ఇది వారి వ్యక్తిగత వ్యవహారమని, దీనికి కంపెనీకి ఎలాంటి సంబంధం లేదని అన్నారు. ఈ వివాదంపై వ్యాఖ్యానించేందుకు అంబానీ కూడా అందుబాటులో లేరు. మహారాష్ట్ర స్టేట్‌ వక్ఫ్‌బోర్డు చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఎన్‌ డీ పఠాన్‌ మాట్లాడుతూ. ముఖేష్‌ అంబానీ నిర్మించిన 27 అంతస్తుల భవనం స్థలం వాస్తవానికి వక్ఫ్‌బోర్డుదని..ఈ స్థలాన్ని వక్ఫ్‌ బోర్డుకిచ్చి అనాధ పిల్లలకు విద్యా బుద్ధులు నేర్పించేందుకు ఈ స్థలాన్ని వాడాలని కోరామని చెప్పారు. కొంత మంది ట్రస్టు సభ్యులు చారిటీ కమిషనర్‌ను నుంచి అనుమతి తీసుకుని ముఖేష్‌ అంబానికి విక్రయించారని తెలుస్తోంది. అయితే వక్ఫ్‌బోర్డు అంబానీ నుంచి స్థలాన్ని వెనక్కు తీసుకోవాలనుకుంది. దీంతో అంబానీ బొంబాయి హైకోర్టుకు వెళ్లి స్టే తెచుకున్నారని పఠాన్‌ చెప్పారు. తమ స్థలాన్ని తమకు ఇప్పించమని... ఈ స్థలం బదిలీయే అక్రమమని వక్ఫ్‌బోర్డు కూడా సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది.

హైకోర్టులో కేసు విచారణలో ఉంది కాబట్టి తాము జోక్యం చేసుకోమని సుప్రీంకోర్టు చేతులెత్తేసిందని పఠాన్‌ చెప్పారు. ప్రస్తుతం ఈకేసు హైకోర్టులో పెండింగ్‌లో ఉందని ఆయన అన్నారు. మహారాష్ట్ర మైనారిటీ వ్యవహారాలశాఖ మంత్రి, వక్ఫ్‌ మంత్రి మహ్మద్‌ అరిఫ్‌ నసీం ఖాన్‌ మాట్లాడుతూ... ఈ విషయాన్ని సీబీఐకి అప్పగించాలని యోచిస్తున్నట్లు చెప్పారు. అయితే కొన్ని వార్తా పత్రికల కథనాల ప్రకారం రాష్ట్రప్రభుత్వం ఈ భూ వివాదంలో సీబీఐ విచారణకు నిరాకరించినట్లు తెలుస్తోందని వార్తలు వచ్చాయి. ఏది ఏమైనా విచారణ మొదలు పెట్టినా... పెట్టకపోయినా ఒక్కటి మాత్రం నిజం ముఖేష్‌ అంబానీ ఎంతో ముచ్చటపడి కట్టుకున్న కలలసౌధం పలు విమర్శలకు గురికావడం తథ్యం. ఈ భవనాన్ని 2010లో పూర్తి చేశారు. ప్రపంచంలోనే ఇదే మొట్టమొదటి బీలియన్‌డాలర్‌ హోమ్‌గా చరిత్రలో మిగిలిపోతుంది. ముంబయిలో బాగా విస్తరించిన మురికి వాడల ప్రాంతంలో ముఖేష్‌ 27అంతస్తుల అత్యాధునిక భవంతిని నిర్మించారు. ఈ భవనంలో ఒక సినిమాహాలు... ఒక హెలీప్యాడ్‌, హెల్త్‌క్లబ్‌, స్విమ్మింగ్‌పూల్‌ ఉన్నాయి. ఈ భవంతి నెల విద్యుత్‌ బిల్లు రూ.75,00,000 పై మాటే.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot