అంబానీల ఏకైక కుమార్తె ఇషా గురించి తెలుసా?
దేశంలోనే అత్యంత ధనువంతుడైన ముకేశ్ అంబానీ కూతురు ఇషా అంబానీ తోటి మహిళలకు ఎంతో స్ఫూర్తిదాయికంగా నిలుస్తుంది.
దేశంలోనే అత్యంత ధనువంతుడైన ముకేశ్ అంబానీ కూతురు ఇషా అంబానీ తోటి మహిళలకు ఎంతో స్ఫూర్తిదాయికంగా నిలుస్తుంది.అంబానీ కుటుంబంలో ఇషా ఒక్కతే కూతురు కావడంతో కుటుంబసభ్యులంతా తనని చాలా గారాబంగా చూసుకుంటారు.ఇషా అంబానీ జన్మించింది ముంబై నగరంలోనే . మన దేశంలో ఇప్పుడు ప్రజలు వాడుతున్న ఫ్రీ ఇంటర్నెట్ ఫ్రీ కాల్స్ కి ముఖ్య కారణం మరెవరో కాదు నీతు,ముకేశ్ అంబానీ గారాల పట్టి ఇషా అంబానీయే .ఈ శీర్షిక లో భాగంగా ఇషా అంబానీ గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు మీకు తెలుపుతున్నాము.....

1991 అక్టోబర్ 23న....
ఇషా అంబానీ 1991 అక్టోబర్ 23న ముంబై లో జన్మించింది.బాల్యంలో ఆమె ధీరుభాయి అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుకుంది. తరువాత గ్రాడ్యుయేషన్ Yale University లో పూర్తి చేసింది.

17 సంవత్సరాల వయసు ఉన్నపుడే ఫోర్బ్స్ పత్రిక....
ఇషా కు 17 సంవత్సరాల వయసు ఉన్నపుడే ఫోర్బ్స్ పత్రిక ఆమె గురించి ప్రత్యకంగా రాసింది. ప్రపంచం లోనే అతి పెద్ద బిలియనీర్ గా ఇషాను అభివర్ణించింది. ఇషా ఆస్తి విలువ 70 మిలియన్ డాలర్లుగా పేర్కొంది.

2017లో ఆసియాలో గల...
2017లో ఆసియాలో గల 12 మంది బడా మహిళ వ్యాపారవేత్త జాబితాలో ఇషా కు ప్రముఖ స్థానం దక్కింది.ఇషా తన తండ్రికి వ్యాపారం లో సహాయం అందిస్తుంటుంది.

కెరియర్ ప్రారంభంలో....
ఇషా తన కెరియర్ ప్రారంభంలో న్యూయార్క్ లోని McKinsey కంపెనీలో బిజినెస్ యనలిస్ట్ గా పని చేసింది.తరువాత రిలయన్స్ జియో,రిలయన్స్ రిటైల్ బోర్డు అఫ్ డైరెక్టర్ గా నియమితులు అయింది.

2015లో సోదరుడితో కలిసి....
2015లో ఇషా అంబానీ తన సోదరుడితో కలిసి రిలయన్స్ జియో సర్వీస్ ను ప్రారంభించింది.

స్కూల్ రోజుల్లో ఫుట్ బాల్ కెప్టెన్ గా.....
స్కూల్ రోజుల్లో ఫుట్ బాల్ కెప్టెన్ గా వ్యవహరించింది. పియానో వాయించడం ఆమెకు ఇష్టమైనా వ్యాపకం. తన తల్లి నీతూ అంబానీ లాగే ఫ్యాషనబుల్ లైఫ్ స్టైల్ అంటే ఎంతో ఇష్టం.

జియో సర్వీస్ రావడనికి ముఖ్య కారణం ఇషా అంబానీ....
జియో సర్వీస్ రావడానికి ముఖ్య కారణం తన కూతురే అని ముఖేష్ అంబానీ చెబుతున్నారు. 7 ఏళ్ళ క్రిందట తన కూతురు ఇంటర్నెట్ గురించి కంప్లయింట్ చేయడం వలనే ఫ్రీ హై స్పీడ్ ఇంటర్నెట్ సర్వీస్ గురించి ఆలోచన వచ్చిందని ముకేశ్ అంబానీ తెలిపారు.


Click it and Unblock the Notifications








