రిలయన్స్ జియో వెనుక ఉన్నదెవరో తేల్చి చెప్పిన జియో అధినేత

Written By:

రిలయన్స్ జియో..ఈ పదం దేశీయ టెలికాం రంగంలో ఓ సునామి. టెలికాం మార్కెట్లోకి వచ్చిన రెండేళ్ల వ్యవధిలోనే భారత్‌ను ప్రపంచంలో అతిపెద్ద మొబైల్‌ బ్రాడుబ్యాండ్‌ డేటా కన్జ్యూమింగ్‌ దేశంగా నిలబెట్టింది. ఇప్పడు జియో లేనిదే దేశం లేదన్నట్లుగా ప్రజలను తన వైపుకు తిప్పుకుంది. ఎదురులేని టెలికాం దిగ్గజాలను ఒక్కసారిగా ఖంగుతినిపించి భారీ నష్టాలకు వాటిని గురిచేసింది. మరి ఈ ప్రస్థానం వెనుక ఉన్నది ఎవరు..ఈ కంపెనీకి నాంది పలికింది ఎవరు ? ఈ విషయం మీద ముఖేష్ అంబాని ఆసక్తికర సమాధానం ఇచ్చారు. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చెందిన జియో కంపెనీకి నాంది తన కూతురు ఇషానేనని ముఖేష్‌ అంబానీ వెల్లడించారు. 2011లోనే ఇషా జియోకు విత్తు నాటితే అది అత్యంత తక్కవ కాలంలో పెరిగి పెద్దదయిందని తెలిపారు. ఫైనాన్షియల్ టైమ్స్ ఆర్సిలర్ మిట్టల్ బోల్డ్‌నెస్‌ ఇన్ బిజినెస్ అవార్డ్స్ కార్యక్రమంలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు 'డ్రైవర్స్‌ ఆఫ్‌ ఛేంజ్‌' అవార్డు దక్కింది. ఈ సందర్భంగా మాట్లాడిన ముఖేష్‌ ఈ విషయాన్ని రివీల్‌ చేశారు.

కొత్త ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా, ఇవిగోండి 5 బెస్ట్ ఆప్షన్స్...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

జియో ప్రారంభమైనప్పటి నుంచి..

2016లో జియో ప్రారంభమైనప్పటి నుంచి టెలికాం ఆపరేటర్ల గుండెలు గుబేల్‌మంటున్నాయి. జీవితకాలం ఉచిత కాల్‌ సర్వీసులతో పాటు తక్కువ రేట్లకు డేటాను కూడా ఆఫర్‌ చేస్తూ.. ప్రత్యర్థులకు ఝలక్‌ ఇస్తోంది.

2011లో తొలిసారి

2011లో తొలిసారి తన కూతురు ఇషా ఈ ఆలోచనను అందించిందని, ఆ సమయంలో ఇషా అమెరికాలోని యేల్‌ యూనివర్సిటీలో చదువుకుంటోందని గుర్తుచేసుకున్నారు. సెలవులకి ఇంటికి వచ్చిన సమయంలో ఇషా ఈ ఆలోచనను తమ ముందు ఉంచిందని చెప్పారు. ఇషా, ఆకాశ్‌లు అంబానీ కవల పిల్లలు. ప్రస్తుతం రిలయన్స్‌లో వీరిద్దరూ యంగ్‌ డైరెక్టర్లుగా ఉన్నారు.

ఉన్నతమైన దానిని అందించడానికి..

ప్రపంచంలో ఉన్నతమైన దానిని అందించడానికి దేశ యువతరానికి చెందిన ఇషా, ఆకాశ్‌లు ఎక్కువ సృజనాత్మకంగా, అతిపెద్ద లక్ష్యంతో ఉన్నారు. జియో​ నెలకొల్పడానికి ఈ యంగ్‌ ఇండియన్స్‌ ఇద్దరూ తనని ఒప్పించారని పేర్కొన్నారు.

భారత్‌ పూర్‌ కనెక్టివిటీతో..

ఆ సమయంలో భారత్‌ పూర్‌ కనెక్టివిటీతో ఉందని, డిజిటల్‌ వనరు డేటాలో తీవ్ర కొరతను ఎదుర్కొంటుందని చెప్పారు. డేటా కేవలం కొరతను ఎదుర్కొనడమే కాక, చాలా మంది భారతీయులకు ఇది అందుబాటులో లేదన్నారు.

మారుమూల గ్రామానికి కూడా

జియో వచ్చిన తర్వాత దేశంలో మారుమూల గ్రామానికి కూడా డేటా సరసమైన ధరల్లో అందుబాటులోకి వచ్చిందని చెప్పారు. 2016లో జియో లాంచ్‌ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే జియో అతిపెద్ద గేమ్‌ ఛేంజర్‌గా ఉంది.

అతిపెద్ద గ్రీన్‌ఫీల్డ్‌

ప్రపంచంలో అతిపెద్ద గ్రీన్‌ఫీల్డ్‌ 4జీ ఎల్‌టీఈ ఓన్లీ డేటా నెట్‌వర్క్‌ను జియో సృష్టించింది. 2019 నాటికి భారత్‌ లీడర్‌గా జియో నిలవబోతుందని అంబానీ ఆశాభావం వ్యక్తం చేశారు. లాంచైనా 170 రోజుల్లోనే 100 మిలియన్‌ కస్టమర్లను ఇది సొంతం చేసుకుందని తెలిపారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Mukesh Ambani says Jio was first thought of by daughter Isha in 2011 More News at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot