రూ.700కే ఇంటర్నెట్,డీటీహెచ్,ల్యాండ్‌లైన్ ఇంకా మరెన్నో..
రిలయన్స్ జియో యూజర్లు ముకేశ్ అంబానీ బంపర్ ఆఫర్ ఇచ్చారు. సెప్టెంబర్ 5న జియోగిగాఫైబర్ సేవలను ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. జియో వెల్‌కమ్ ఆఫర్లో భాగంగా.. ఫరెవర్ ప్లాన్ తీసుకున్న వారికి 4కే రిజల్యూషన్‌తో కూడిన హెచ్‌డీ ఎల్‌ఈడీ టీవీలను, సెట్ టాప్ బాక్సులను ఉచితంగా ఇస్తామని ప్రకటించారు.

రిలయన్స్ యాన్యువల్ జనరల్ మీటింగ్ సందర్భంగా ముకేశ్ అంబానీ ఈ ప్రకటన చేశారు. ఇప్పటికే ఐదు లక్షల నివాసాల్లో ట్రయల్ రన్ నిర్వహిస్తున్నామన్నారు. వచ్చే 12 నెలల్లో గిగాఫైబర్ సేవలను దేశమంతటా అందిస్తామన్నారు. ఆగష్టు 15 నుంచి రిజిస్ట్రేషన్లను ప్రారంభిస్తామన్నారు.

నెలకు రూ.700 నుంచి ప్లాన్
‘Jio forver Annual plans' తో జియో ఉచితంగా 4K/HD TV, 4K set-top box ఆఫర్ చేస్తోంది. జియో గిగాఫైబర్ అందించే డేటా ప్లాన్లు రూ.700 నుంచి ప్రారంభం కానున్నాయి. రూ. 700 ప్లాన్ నుంచి కనీసం నెలకు రూ.10వేల ప్లాన్ వరకు అఫర్ చేస్తోంది. ఒకే కనెక్షన్‌తో ఇంటర్నెట్, డీటీహెచ్, ల్యాండ్‌లైన్ సేవలను పొందొచ్చని తెలిపారు. రిలయన్స్ గిగాఫైబర్‌లో 100 ఎంబీపీఎస్ నుంచి 1 జీబీపీఎస్ వరకు స్పీడ్‌తో ఇంటర్నెట్ అందజేస్తారు.

రూ.500 చెల్లిస్తే ఇంటర్నేషనల్ కాల్స్
ఇంటర్నేషనల్ కాలింగ్ కోసం నెలకు రూ.500 చెల్లిస్తే చాలు. జియో గిగాఫైబర్ Fixed voice calling, fixed line rates పొందవచ్చు. ఈ ప్లాన్ ద్వారా యూజర్లు ఇంటర్నేషనల్ నెంబర్లకు Unlimited calling చేసుకోవచ్చు. US, Canada దేశాలకు Unlimited వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. Free voice కాల్స్ మాత్రమే కాదు.. జియో గిగాఫైబర్ సర్వీసు అందించే ప్లాన్స్ యాక్టివేట్ చేసుకుంటే OTT ప్లాట్ ఫాం సబ్ స్క్రిప్షన్ల బండెల్ పొందవచ్చు. ఇందులో కొత్తగా రిలీజ్ అయిన మూవీలను చూసి ఎంజాయ్ చేయవచ్చు.

జియో ఫరెవర్ ప్లాన్ కన్ప్యూజన్
జియో ఫరెవర్ ప్లాన్‌కు సంబంధించిన వివరాలను ముకేశ్ అంబానీ పూర్తిగా వెల్లడించలేదు. కానీ దీర్ఘకాలిక జియో గిగాఫైబర్ ప్లాన్లను ఎంపిక చేసుకున్న వారికి ఉచితంగా టీవీలను అందజేస్తామని మాత్రం ప్రకటించారు. ఏ బ్రాండ్ టీవీలను ఇస్తారు, సెక్యూరిటీ డిపాజిట్ తీసుకుంటారా? లేదా అనేది తెలియాల్సి ఉంది.

2 కోట్ల మందికి గిగాఫైబర్ సేవలు
జియో గిగాఫైబర్ సర్వీస్ ద్వారా ఉచితంగా ల్యాండ్‌లైన్ కనెక్షన్, ఇంటర్నెట్, డిజిటల్ సెట్‌టాప్ బాక్స్, అల్ట్రా హై డెఫినిషన్ ఎంటర్‌టైన్‌మెంట్, వర్చువల్ కంటెంట్, ఇంటరాక్టివ్ గేమింగ్, స్మార్ట్ హోమ్ సొల్యూషన్లను అందజేయనున్నారు. దేశంలో 2 కోట్ల మందికి గిగాఫైబర్ సేవలను అందిస్తామని అంబానీ తెలిపారు. జియో ఫైబర్ కోసం ఇప్పటికే 15 మిలియన్ల రిజిస్ట్రేషన్లు వచ్చాయన్నారు.
క్లౌడ్ డేటాసెంటర్ల ఏర్పాటు కోసం రిలయన్స్, మైక్రోసాఫ్ట్ చేతులు కలిపాయని ముకేశ్ అంబానీ తెలిపారు. ఐటీ స్టార్టప్‌లకు జియో-అజుర్ సేవలను ఉచితంగా అందజేస్తామన్నారు.

జియో Smart TV
ప్రీమియం కస్టమర్ల కోసం జియో Postpaid Plus అందుబాటులోకి తీసుకోస్తోంది. దీనిద్వారా platinum-grade సర్వీసు పొందవచ్చు. ఇంట్లో SIM సెటప్ సర్వీసుతో పాటు డేటా షేరింగ్, వాయిస్ కనెక్టవిటీ వంటి ఎన్నో ఫ్యామిలీ ప్లాన్లు పొందవచ్చు. ఇతర ఇంటర్నెట్ సర్వీసు ప్రొవైడర్లకు పోటీగా హైస్పీడ్ ఆప్టికల్ ఫైబర్ బేసిడ్ బ్రాడ్ బ్యాండ్ సర్వీసులను జియో అందిస్తోంది. జియో గిగాఫైబర్ సర్వీసులో స్మార్ట్ హోం డొమైన్ గా పనిచేయనుంది. jio స్మార్ట్ టీవీలను కూడా ఇండియాలో విస్తరించేందుకు ప్లాన్ చేస్తోంది.


Click it and Unblock the Notifications








