జియో విప్లవంలో కంటికి కనపడని రహస్యాలు, వెనుక హీరోల గురించి తెలుసా ?

  దేశీయ టెలికాం రంగంలోకి ప్రవేశించినప్పటి నుంచే దిగ్గజాలను పరుగులు జియో పరుగులు పెట్టించిన సంగతి అందరికీ గుర్త ఉండే ఉంటుంది. కోట్ల లాభాల్లో మునిగితేలుతున్న టాప్ టెలికం దిగ్గజాలను కోట్ల నష్టాల్లోకి నెడుతూ సునామిలా దూసుకొచ్చింది జియో. వచ్చి రావడంతోనే ఉచిత ఆఫర్లతో యావత్ దేశాన్ని తనవైపుకు తిప్పుకుంది. మరి జియో అంతలా విజయపథంలో దూసుకుపోవడానికి కారణం ఎవరు..ముఖేష్ అంబాని ఒక్కడే జియోని నడిపారా..లేక ఆకాష్ అంబాని జియోని ముందుకు తీసుకువెళ్లారా ఇలాంటి ప్రశ్నలను మనం బేరీజు వేసుకుంటే మనకు అనేక ఆసక్తికర అంశాలు తెలుస్తాయి.

  అమెజాన్‌లో కొన్ని ఉచితంగా దొరుకుతాయి, అవేంటో ఓ లుక్కేయండి

  గిజ్బాట్ మరిన్ని అప్డేట్స్ ఇక్కడే

  చాలామంది విదేశీయులు..

  జియో వెనుక పెద్ద సైన్యమే ఉంది. భారతీయ ఇంటర్నెట్‌ చరిత్రలో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చిన జియోని నడిపిన వారిలో చాలామంది విదేశీయులు ఉన్నారు. ఆకాశ్‌ అంబానీ నేతృత్వంలో ఈ వ్యూహబృందం పక్కా ప్రణాళికతో జియోను ఆవిష్కరించింది.

  కీలక బాధ్యతల్లో..

  కీలక బాధ్యతల్లో విదేశీ నిపుణులు తమ బాధ్యతలను నిర్వర్తించి జియోని విజయం వైపు నడిపారు. ఇంకా విచిత్రమేమిటంటే వీరంతా యువకులే. జియో సక్సెస్ తరువాత వీరిలో చాలామంది కంపెనీని వీడగా మరికొందరు జియోలోనే కొనసాగుతున్నారు. జియో ప్రారంభం నుండి ఇప్పటిదాకా వారే జియోని ముందుండి నడిపారు.

  సైన్యం ఇదే..

  1. Rainer Deutschmann: జియోలోchief product and innovation officer . కాగా ఈయన గతంలో డెచ్‌ టెలికమ్‌ ఎగ్జిక్యూటీవ్‌గా పనిచేశారు.
  2. Mathew Oommen : ఈ ఇండో-అమెరికన్‌ ప్రస్తుతం Jio Networks head . గతంలోSprint chief technology officerగా పనిచేశారు.
  3. Stratos Davlos : జియో ప్లాట్‌ఫార్మ్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ విభాగానికి అధిపతిగా ‘హలో జియో' వాయిస్‌ అసిస్టెంట్‌ రూపుకర్తల్లో కీలక వ్యక్తి. గతంలో ఆపిల్‌లో పనిచేసిన అనుభవం ఉంది.

  సైన్యం ఇదే..

  4. Jordanian Tareq Amin: జోర్డాన్‌కు చెందిన తారిఖ్‌ జియో సాకేంతిక పరిజ్ఞానం, ఆటోమేషన్‌ విభాగాలను పర్యవేక్షిస్తున్నారు.
  5. Caroline Seifert: ఏడాది పాటు Jio chief brand and design officerగా పనిచేశారు.ప్రస్తుతం జియోని వీడారు.
  6. Janina Anjuli Schmidt : ఈమె కూడా సెఫర్ట్‌తో కలిసి పనిచేశారు. ప్రస్తుతం డిజైనింగ్‌ విభాగాన్ని పర్యవేక్షిస్తున్నారు.
  7. Shuming Li : చైనాకు చెందిన షుమింగ్‌ Jio's wifi rolloutsకు ప్రధాన సూత్రధారి.

  సైన్యం ఇదే

  8. Marcus Brackebusch: జియో ప్లాట్‌ఫామ్‌ అండ్‌ సిస్టమ్స్‌ విభాగాన్ని పర్యవేక్షించారు. 2015-2017 వరకు ఆయన ఈ బాధ్యతలు నిర్వహించారు.
  9. Nikola Sucevic : స్వీడన్‌కు చెందిన ఈ డేటా శాస్త్రవేత్త జియోలో కీలక విభాగాలను పర్యవేక్షిస్తున్నారు. రేడియో కవరేజీలో డేటా అనలటిక్స్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ కెపాసిటీ, మెషీన్‌ లెర్నింగ్‌, టెలికామ్‌ డేటా మైనింగ్‌ బాధ్యతలను నిర్వహిస్తున్నారు.
  10. క్రిస్టన్‌ నోహ్ల: హ్యాకింగ్‌ అనుభవజ్ఞుడైన క్రిస్టన్‌ మూడేళ్లపాటు జియో ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ విభాగానికి అధిపతిగా పనిచేశారు. 2017 మార్చిలో ఈ బాధ్యతల నుంచి వైదొలగారు.

  పెట్రోలియం వ్యాపారాన్ని కూడా విదేశీ నిపుణులు..

  వీరే కాకుండా ఇంకా ఎంతో మంది నిపుణులు జియో వెనుక ఉండి నడిపించారు. వివిధ శాఖల్లో వారు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించి జియోని ఈ స్థాయికి తీసుకువచ్చారని తెలుస్తోంది. అయితే రిలయన్స్ కు ఇది కొత్తేం కాదు. జామ్ నగర్లోని పెట్రోలియం వ్యాపారాన్ని కూడా విదేశీ నిపుణులు దగ్గరుండి నడిపించారు. విదేశీ నిపుణులతో వ్యాపార రంగాన్ని పరుగులు పెట్టించడం అంబానీకే సాధ్యమని నిపుణులు చెబుతున్నారు.

  146 million subscribers

  జియోకు ఇప్పుడు 146 million subscribers ఉన్నారు. మరి ఇంతమంది జియోని ఆకర్షించడానికి వెనుక ఎంత పెద్ద కథ నడిచిందో ఈ సూత్రధారులను చూస్తే ఇట్టే తెలుస్తుంది. 2011 నుంచి జియో అడుగులో అడుగు వేసుకుంటూ ఈ స్థాయికి చేరింది. దేశంలోనే టాప్ దిగ్గజంగా ఎదిగింది.

  5జీ వైపు శరవేగంగా అడుగులు..

  ఇప్పుడు 5జీ వైపు శరవేగంగా అడుగులు పడుతున్నాయి. 4జీ నెట్ వర్క్ నే 5జీకి ఉపయోగించుకునేలా ముఖేష్ అంబాని టెక్నాలజీని నడిపించారు. ఇలాంటి టాలెంట్ ఇండియాలో అతికొద్ది మందికి మాత్రమే ఉంటుందని వారిలో అంబాని ముందు స్థానంలో ఉన్నారని telecom veteran T.V. Ramachandran చెబుతున్నారు. దీనికి ప్రధాన సూత్రధారి ఇండో అమెరికన్ Oommen అని అతనే జియో నెట్ వర్క్ ని ఇలా రూపుదిద్దాడని ఆయన అన్నారు.

  అతి పెద్ద పైబర్ నెట్ వర్క్

  ఇప్పుడు జియో ప్రపంచంలోనే అతి పెద్ద పైబర్ నెట్ వర్క్ ని కలిగి ఉంది. ఈ నెట్ వర్క్ ద్వారా ప్రపంచం నలుమూలలకి వాయిస్ కాల్స్, అలాగే డేటా ట్రాన్స్ ఫర్ చేసే అవకాశాన్ని జియో కలిగి ఉందని తెలుస్తోంది.

  జియోఫోన్ తో సంచలనం

  జియోఫోన్ తో సంచలనం రేపిన అంబాని ఇంకా మరిన్ని వ్యూహాలతో ముందు ముందు షాకులు ఇవ్వబోతున్నాడని అంచనాలు వెలువడుతున్నాయి. మార్కెట్లోకి అత్యంత చీప్ లో స్మార్ట్ ఫోన్లను ప్రవేశపెట్టి స్మార్ట్ ఫోన్ మార్కెట్లో కూడా సంచలనాలు నమోదు చేయాలనుకున్నారు. ఇదే జరిగితే జియో ఎవరికీ అందనంత ఎత్తుకు దూసుకెళ్లే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

  గిజ్బాట్ మరిన్ని అప్డేట్స్ ఇక్కడే

  English summary
  Mukesh Ambani’s army of expats at Reliance Jio More news at Gizbot telugu
  Opinion Poll
  X

  ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more