మొబైల్ కోసం రైల్లో నుంచి దూకి ప్రాణాలు విడిచిన ముంబై వాసి

తన మొబైల్ దొంగతనానికి యత్నించిన ఓ దొంగ బారి నుంచి మొబైల్ ఫోన్‌ని కాపాడుకునే ప్రయత్నంలో చేతన్ అహిర్ రావు(35) అనే వ్యక్తి రైల్ లో నుంచి దూకి దురదృష్టవశాత్తు ట్రాక్ ఫై పడ్డాడు.

By Anil
|

తన మొబైల్ దొంగతనానికి యత్నించిన ఓ దొంగ బారి నుంచి మొబైల్ ఫోన్‌ని కాపాడుకునే ప్రయత్నంలో చేతన్ అహిర్ రావు(35) అనే వ్యక్తి రైల్ లో నుంచి దూకి దురదృష్టవశాత్తు ట్రాక్ ఫై పడ్డాడు.అయితే అహిర్ రావు ని ఆస్పత్రికి తరలించేలోగా తుది శ్వాస విడిచాడు .ఈ ఘటన ఆగస్టు 19న ముంబైలోని కల్వా స్టేషన్‌లో చోటు చేసుకుంది . ప్రమాదవశాత్తుగా చనిపోయిన చేతన్ అహిర్ రావు ఊరు నాశిక్‌ అని పోలీసులు పోలీసులు గుర్తించారు.ఈ విషాద సంఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే...

కల్వా స్టేషన్ నుంచి థానె జిల్లాలోని దివా స్టేషన్‌కి వెళ్లెందుకు.....

కల్వా స్టేషన్ నుంచి థానె జిల్లాలోని దివా స్టేషన్‌కి వెళ్లెందుకు.....

చేతన్ అహిర్ రావు కల్వా స్టేషన్ నుంచి థానె జిల్లాలోని దివా స్టేషన్‌కి వెళ్లెందుకు లోకల్ ప్యాసింజర్ రైలు ఎక్కాడు. కల్వా స్టేషన్ నుంచి రైలు కదులుతుండగా ఫుట్‌బోర్డ్ పైనే నిల్చున్న చేతన్ మొబైల్ ను దొంగిలించేందుకు సోలంకి(19) అనే దొంగ అతని చెయ్యి పై బలంగా కొట్టాడు.

దొంగ నుంచి మొబైల్‌ను కాపాడుకునే క్రమంలో.....

దొంగ నుంచి మొబైల్‌ను కాపాడుకునే క్రమంలో.....

సోలంకి దాడి నుంచి మొబైల్‌ను కాపాడుకునే క్రమంలో చేతన్ తనకి తెలియకుండానే రైల్లోంచి దూకి పట్టాలపై పడిపోయాడు. ఈ ప్రమాదంలో తీవ్రగాయాలపాలైన చేతన్‌ని ఆస్పత్రికి తరలించేలోపే తుదిశ్వాస విడిచాడు. మరోవైపు సోలంకి ఆ మొబైల్ తీసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు.

 

 

దర్యాప్తు చేపట్టిన పోలీసులు.....

దర్యాప్తు చేపట్టిన పోలీసులు.....

ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు మొదట చేతన్ ప్రమాదవశాత్తుగా రైలు నుంచి జారి కిందపడి మృతిచెందాడనే అనుకున్నారు .

సీసీటీవీ ఫుటేజ్ ను .....

సీసీటీవీ ఫుటేజ్ ను .....

అయితే, అతడి వద్ద మొబైల్ ఫోన్ కనిపించకపోవడంతో అనుమానంతో కల్వా స్టేషన్‌లోని సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించారు. సీసీటీవీ చిక్కిన దృశ్యాల్లో చేతన్ మొబల్‌ని సోలంకి చోరీచేసేందుకు ప్రయత్నించడం , ఆ క్రమంలోనే చేతన్ రైల్లోంచి పడిపోయిన దృశ్యాలన్ని రికార్డ్ అయ్యాయి.

దొంగను  కళ్యాణ్ రైల్వే స్టేషన్‌లో అదుపులోకి తీసుకున్నారు....

దొంగను కళ్యాణ్ రైల్వే స్టేషన్‌లో అదుపులోకి తీసుకున్నారు....

దీంతో సోలంకిని గుర్తించిన పోలీసులు మరునాడే కళ్యాణ్ రైల్వే స్టేషన్‌లో అతడిని అదుపులోకి తీసుకున్నారు. సోలంకిపై చోరి, దాడి, హత్య నేరాల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

Best Mobiles in India

English summary
Mumbai: 35-Year-Old Man Jumps Off The Train To Save Mobile, Falls On Tracks, Dies.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X