Home
News

PUBG ఆడేందుకు మొబైల్ కొనివ్వలేదని బాలుడి ఆత్మహత్య

PUBG అనే ఈ గేమ్ మధ్య సోషల్ మీడియాని ఊపేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.ఈ గేమ్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.యువత ఈ గేమ్‌కు పూర్తిగా బానిసగా మారిపోయింది. రోజూ గంటల తరబడి గేమ్ ఆడుతూనే గడిపేస్తున్నారు.

PUBG అనే ఈ గేమ్ మధ్య సోషల్ మీడియాని ఊపేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.ఈ గేమ్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.యువత ఈ గేమ్‌కు పూర్తిగా బానిసగా మారిపోయింది. రోజూ గంటల తరబడి గేమ్ ఆడుతూనే గడిపేస్తున్నారు. ఇంత వరకు అంత బాగానే ఉంది కానీ ఈ గేమ్ గురించి కొందరు పిచోళ్లు అవుతుంటే మరి కొందరైతే ఆత్మహత్య చేసుకుంటున్నారు.ఇప్పుడు అలాంటి సంఘటనే ఒకటి చోటు చేసుకుంది. PUBG గేమ్ ఆడేందుకు ఖరీదైన మొబైల్‌ కొనివ్వలేదని మనస్తాపంతో ఓ 17 ఏళ్ళ బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు.ఈ ఘటన ముంబయిలో చోటు చేసుకుంది.ఈ సంఘటన పూర్తి వివరాల్లోకి వెళితే..

 PUBG గేమ్‌ ఆడేందుకుగానూ..

PUBG గేమ్‌ ఆడేందుకుగానూ..

కుర్లా నెహ్రూ నగర్‌లో నివసించే ఓ 18ఏళ్ల బాలుడు PUBG గేమ్‌ ఆడేందుకుగానూ రూ.37వేలు విలువ చేసే ఖరీదైన ఫోన్‌ కొనివ్వాలని తల్లిదండ్రలును కోరాడు . అయితే దానికి ఆ బాలుడి తల్లిదండ్రలు ఒప్పుకోలేదు. ఎలాగైనా సరే తనకు ఫోన్‌ కావాల్సిందేనని పట్టుబట్టడంతో రూ.20వేల లోపు ఫోన్‌ అయితే కొనిస్తామని చెప్పారు.

కిచెన్‌లో ఉరివేసుకుని...

కిచెన్‌లో ఉరివేసుకుని...

తల్లిదండ్రుల మాటలకు విసిగిపోయిన బాలుడు తీవ్ర మనస్థాపానికి గురై ఇంట్లో వాళ్లంతా నిద్రపోయాక వంట గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకొన్నాడు.

సమాచారం అందుకున్న పోలీసులు....

సమాచారం అందుకున్న పోలీసులు....

ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. దీనిపై మరింత విచారణ జరుపుతామని చెప్పారు.

ప్రధాని మోదీ అన్నట్లుగానే PUBG గేమ్

ప్రధాని మోదీ అన్నట్లుగానే PUBG గేమ్

ఈ మధ్య మరో సంఘటన చోటు చేసుకుంది . ఓ తల్లి ప్రధానితో మాట్లాడుతూ తన కొడుకు ఆన్‌లైన్ గేమ్స్‌కు అలవాటు పడిపోయి చదువులను పక్కనపెట్టేస్తున్నాడంటూ వాపోయింది. వెంటనే స్పందించిన ప్రధాని అతను PUBG ఆటగాడా అంటూ చమత్కరించారు. దీంతో ఒక్కసారిగా సభాప్రాంగణం నువ్వులతో మారుమోగిపోయింది.ప్రధాని మోదీ అన్నట్లుగానే PUBG గేమ్ ఆన్‌లైన్ గేమింగ్ ప్రపంచాన్ని శాసిస్తోంది. దేశవ్యాప్తంగా అత్యధికశాతం మంది యువత ఈ ఆటలో మునిగితేలుతున్నారు. చిన్న, పెద్ద అని తేడాలేకుండా ప్రైమరీ స్కూల్ నుంచి కళాశాల విద్యార్థుల వరకు ఆ ఆటకు బానిస అవుతున్నారు. గేమింగ్ ప్రపంచాన్ని ఇంతలా ఉర్రూతలూగిస్తోన్న ఈ గేమ్ గురించి 10 ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

'ప్లేయర్ అన్‌నౌన్స్ బ్యాటిల్ గ్రౌండ్స్’

'ప్లేయర్ అన్‌నౌన్స్ బ్యాటిల్ గ్రౌండ్స్’

మొబైల్ గేమింగ్ విభాగంలోకి పెను సంచలనంలా దూసుకొచ్చిన 'ప్లేయర్ అన్‌నౌన్స్ బ్యాటిల్ గ్రౌండ్స్' (పీయూబీజీ), ఇప్పుడు ప్రపంచమంతా వైరల్ అవుతోంది. ఈ రియల్ టైమ్ మల్టీప్లేయర్ షూటర్ గేమ్‌ను స్మార్ట్‌ఫోన్ యూజర్లు అమితంగా ఇష్టపడుతున్నారు. 2017లో లాంచ్ అయిన ఈ గేమ్‌ను పీయూబీజీ కార్పొరేషన్ అలానే చైనా టెన్సెంట్ గేమ్స్ సంయుక్తంగా అభివృద్థి చేసాయి.

ప్లేయర్ అన్‌నౌన్ గోస్ట్ హోటల్ బ్యాటిల్ రాయల్ గేమ్ ఆధారంగా

ప్లేయర్ అన్‌నౌన్ గోస్ట్ హోటల్ బ్యాటిల్ రాయల్ గేమ్ ఆధారంగా

ప్లేయర్ అన్‌నౌన్ గోస్ట్ హోటల్ బ్యాటిల్ రాయల్ గేమ్ ఆధారంగా అభివృద్థి చేయబడిన ఈ గేమ్‌లో కొత్త ఫీచర్లతో పాటు కంట్రోల్స్‌ను ఇంక్లూడ్ చేసింది. ఈ రసవత్తర గేమ్‌లో పారాచ్యూట్ ల్యాండింగ్, ఆర్మర్స్ ఇంకా వెపన్స్‌ను కలెక్ట్ చేయటం, ఎనిమీల వ్యూహాల నుంచి తప్పించుకోవటం, ఎదురుదాడి చేయటం వంటి వ్యూహ ప్రతివ్యూహాలు ఈ గేమ్‌లో అందుబాటులో ఉంటాయి.

PUBG అనేది ఒక ఆన్‌లైన్ గేమ్

PUBG అనేది ఒక ఆన్‌లైన్ గేమ్

PUBG అనేది ఒక ఆన్‌లైన్ గేమ్, ఈ గేమ్‌లో మొత్తం 100 మంది ఆటగాళ్లు ఉంటారు. వీరంగా పారాచ్యూట్ సహాయంతో ఓ నిర్మానుష ద్వీపంలోకి నిరాయుధులగా చేరుకుంటారు. అక్కడికి చేరుకున్న తరువాత ఆయుధాలతో పాటు ఇతర వస్తువులను ఆటగాళ్లు వెతుక్కోవల్సి ఉంటుంది. ప్రతికొద్ది నిమిషాలకు గేమ్ మ్యాప్ కృశించుకుపోతుంటంతో ఎప్పటికప్పుడు కొత్త స్థావరాలకు వెతుక్కోవల్సి ఉంటుంది. ఈ మధ్యలో ప్రత్యర్థులను చంపుకుంటూ ముందుకు సాగవల్సి ఉంటుంది. ఆటలో అందరిని తుది ముట్టించి చివరి వరకు ప్రాణాలను నిలబెట్టుకన్న వారు ఈ ఆటలో విజేతలుగా నిలుస్తారు.

ఆండ్రాయిడ్ ఇంకా ఐఓఎస్ ప్లాట్‌ఫామ్‌లలో

ఆండ్రాయిడ్ ఇంకా ఐఓఎస్ ప్లాట్‌ఫామ్‌లలో

ఆండ్రాయిడ్ ఇంకా ఐఓఎస్ ప్లాట్‌ఫామ్‌లలో అత్యంత ప్రజాదరణను సొంతం చేసుకున్న PUBG గేమింగ్ యాప్ ను ఇప్పటి వరకు 20 కోట్ల మంది యూజర్లు డౌన్ లోడ్ చేసుకున్నట్లు ఓ అంచనా. వీరిలో 3 కోట్ల మంది యూజర్లు రోజు ఈ గేమ్ ను ఆడుతూనే ఉన్నారట. తాజాగా ఈ గేమ్ లకు పలు అప్ డేట్ లను కూడా టెన్సెంట్ గేమ్స్ విడుదల చేసింది.

AOW ఇంజిన్ ఆధారంగా

AOW ఇంజిన్ ఆధారంగా

AOW ఇంజిన్ ఆధారంగా స్పందించగలగే ఈ పీయూబీ ఎమ్యులేటర్ పీయూబీజీ మొబైల్ వెర్షన్‌ను పీసీలో ఆప్టిమైజ్ చేస్తుంది. ఈ ఎమ్యులేటర్ పీసీకి సంబంధించిన కీబోర్డ్ అలానే మౌస్‌లను ఆటోమెటిక్‌గా డిటెక్ట్ చేయటంతో పాటు పీసీలో రిసోర్సులను సమర్థవంతంగా వినియోగించుకుంటూ స్మూత్ ఇంకా లాగ్-ఫ్రీ గేమింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను ప్రొవైడ్ చేయగలుగుతుంది.

Best Mobiles in India

English summary
Mumbai boy commits suicide after family refuses to buy new phone for playing PUBG.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X