6 మిస్డ్ కాల్స్ ఇచ్చి 1.8 కోట్లు దోచేశారు

ముంబైకు చెందిన ఓ ప్రముఖ పారిశ్రామికవేత్తను సైబర్ నేరగాళ్లు నిలువునా దోచేసారు. అతిని ఫోన్ నెంబర్‌కు 6 మిస్డ్ కాల్స్ ఇచ్చి ఏకంగా 1.86కోట్ల రూపాయిలను కొల్లగొట్టేశారు.

|

ముంబైకు చెందిన ఓ ప్రముఖ పారిశ్రామికవేత్తను సైబర్ నేరగాళ్లు నిలువునా దోచేసారు. అతిని ఫోన్ నెంబర్‌కు 6 మిస్డ్ కాల్స్ ఇచ్చి ఏకంగా 1.86కోట్ల రూపాయిలను కొల్లగొట్టేశారు. సిమ్ స్వాప్ అని పిలవబడుతోన్న ఈ ప్రమాదకర బ్యాంకింగ్ ఫ్రాడ్ కు ఈ మధ్య చాలా మంది బలైపోతున్నారు. ఈ విధమైన ఘటనలకు సంబంధించి ఇప్పటికే పలు ఫిర్యాదులు కోల్‌కోతా, బెంగుళూరు, ముంబై, ఢిల్లీలోని సైబర్ పోలీసులకు అందాయి.

 సిమ్ స్వాప్ టెక్నాలజీని

సిమ్ స్వాప్ టెక్నాలజీని

వాస్తవానికి ఇదే విధమైన సిమ్ స్వాప్ టెక్నాలజీని కొత్త సిమ్ కార్డ్‌కు అప్‌గ్రేడ్ అయ్యే సమయాల్లో ఉపయోగించటం జరుగుతోంది. ప్రతి సిమ్ కార్డుకు 20 అంకెల ప్రత్యేకమైన నెంబర్‌ను కేటాయించటం జరుగుతుంది. ఈ నెంబర్‌ను సిమ్ వెనుక భాగంలో మనం చూడొచ్చు. ఈ నెంబర్‌ను హ్యాక్ చేయటం ద్వారానే స్విప్ స్వాప్ మోసాలనేవి జరుగుతాయి.

ముంబై వ్యాపారవేత్తకు సంబంధించిన సిమ్ నెంబర్ ను

ముంబై వ్యాపారవేత్తకు సంబంధించిన సిమ్ నెంబర్ ను

ముంబై మిర్రర్ రిపోర్ట్ చేసిన కథనం ప్రకారం ముంబై వ్యాపారవేత్తకు సంబంధించిన సిమ్ నెంబర్ ను పైన చర్చించుకున్న విధంగా సైబర్ నేరగాళ్లు మందస్తుగా హ్యాక్ చేయటం జరిగింది. ఆ తరువాత ఎవ్వరికి అనుమానం రాకుండా రాత్రికిరాత్రే మొత్తం తతంగాన్ని కానిచ్చేసారు.

 బాధితుడుకు సంబంధించి బ్యాంకింగ్ ఐడీ

బాధితుడుకు సంబంధించి బ్యాంకింగ్ ఐడీ

చాలా వరకు ఇటువంటి కేసుల్లో బాధితుడుకు సంబంధించి బ్యాంకింగ్ ఐడీ అలానే పాస్‌వర్డ్‌లకు సంబంధించి సమాచాన్ని నేరగాళ్లు ముందుగానే సేకరించట జరుగుతంది. రెండవ స్టెప్ క్రింద ఈ స్విమ్ స్వాప్ ప్రాసెస్‌ను వారు అమలు చేస్తారు. ఈ ప్రాసెస్‌లో భాగంగా బ్యాంక్ అకౌంట్‌తో లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్ నుంచి ఓటీపిని వారు రాబట్టాల్సి ఉంటుంది

6 మిస్డ్ కాల్స్ వచ్చాయి

6 మిస్డ్ కాల్స్ వచ్చాయి

ఇటీవల చోటుచేసుకున్న ఘటనలో ముంబైకు చెందిన వ్యాపారవేత్త ఫోన్‌కు రాత్రి 11 గంటల నంచి తెల్లవారుఘామున 2 గంటల వరకు 6 మిస్డ్ కాల్స్ వచ్చాయి. ఫోన్ సైలెంట్ మోడ్‌లో ఉండటంతో ఫోన్ నెంబర్స్‌ను బాధితుడు చూడలేదు. ఈ నెంబర్స్ +44 అనే కోడ్‌తో స్టార్ట్ అయి ఉన్నాయి. బాధితుడి సిమ్ కార్డ్‌ను స్వాప్ చేసిన అనంతరం అతని అకౌంట్ నుంచి 1.86 కోట్ల రూపాయిలను హ్యాకర్లు 14 వేరు వేరు అకౌంట్లకు ట్రాన్స్‌ఫర్ చేసేసుకున్నారు. ఇందులో రూ.20 లక్షలను మాత్రమే రికవర్ చేసుకోవటం జరిగింది. మిగిలిన మొత్తాన్ని రికవర్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

మొబైల్ ఫోన్‌లలోని సిమ్‌లను క్లోన్ చేసి

మొబైల్ ఫోన్‌లలోని సిమ్‌లను క్లోన్ చేసి

మొబైల్ ఫోన్‌లలోని సిమ్‌లను క్లోన్ చేసి ఆర్ధిక మోసాలకు తెగబడే ప్రయత్నాలు జోరందుకున్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.. మీ పర్సనల్ సిమ్ కార్డ్‌ను క్లోన్ చేయటం ద్వారా హ్యాకర్లు ఆ నెంబరుతో అనసంధానమై ఉన్న మీ బ్యాంక్ ఖాతా వివరాలను సేకరించి అకౌంట్‌లో ఉన్న నగదును మీకు తెలియకుండా లూటీ చేసేయగలరు.

 

 

 హైటెక్ సాఫ్ట్‌వేర్‌లను

హైటెక్ సాఫ్ట్‌వేర్‌లను

సిమ్ కార్డ్‌లను క్లోన్ చేసేందుకు హైటెక్ సాఫ్ట్‌వేర్‌లను హ్యాకర్లు ఉపయోగిస్తున్నట్లు సమాచారం. ఈ ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి సిమ్‌కార్డ్ రీడర్ సహయంతో టార్గెటెడ్ యూజర్ మొబైల్ సిమ్‌లోని సమాచారాన్నివేరొక సిమ్‌కార్డ్‌లోకి కాపీ చేసేస్తారు. కొన్ని వైరస్ కమాండ్‌లతో కూడిన ఎస్ఎంఎస్‌ల ద్వారా కూడా సిమ్ క్లోనింగ్ సాధమ్యవుతుందని సైబర్ నిపుణులు చెబుతున్నారు.

 

 

ఒక వ్యక్తికి తెలియకుండానే వారి ఫోన్ నుండి అవతలి వ్యక్తికి మెసేజ్

ఒక వ్యక్తికి తెలియకుండానే వారి ఫోన్ నుండి అవతలి వ్యక్తికి మెసేజ్

ఒక వ్యక్తికి తెలియకుండానే వారి ఫోన్ నుండి అవతలి వ్యక్తికి మెసేజ్ వెళ్లిందంటే ఆ నంబర్ క్లోన్ అయ్యిందనే అర్ధం చేసుకోవాలి. వెంటనే మీ మొబైల్ బిల్‌ను చెక్ చేసుకోండి. అందులో ఏమైనా మీకు తెలియని నెంబర్ల నుంచి కాల్స్ వెళ్లినట్లయితే వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను సంప్రదించండి.

Best Mobiles in India

English summary
Mumbai Businessman Loses Rs. 1.86 Crore To SIM Swap Fraud.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X