యూట్యూబ్ నుండి దొంగతనాల పాఠాలను నేర్చుకున్న ముంబైజంట
ఇంటర్ నెట్ వాడుతున్న ప్రతి ఒక్కరు ఎక్కువ సేపు యూట్యూబ్ ను వాడుతూ ఉంటారు. అలాగే మొబైల్ డేటాను వాడుతున్న వారు కూడా ఎక్కువగా ఖాళీ సమయాలలో యూట్యూబ్ ను చూస్తూ ఉంటారు. ఇప్పుడు యూట్యూబ్ లో ప్రతి విషయాన్ని అప్ లోడ్ చేస్తున్నారు. ఇందులో కొన్ని మంచి విషయాలకు దారి తీస్తుంటే మరిన్ని వీడియోలు చెడువిషయాలకు ప్రేరేపిస్తున్నాయి. అలాంటి సంఘటన ఇప్పుడు ఇండియాలోని నాగపూర్ లో జరిగింది.

నాగపూర్ లోని ఒక జంట దొంగతనాలను చేస్తూ పోలీసులకు దొరికారు. పోలీసుల విచారణలో వారు తెలిపిన విషయాలు చూసి అందరు ఆశ్చర్యపోయారు. వివరాలలోకి వెలితే హజియాపహాద్ నివాసి అయిన శైలేష్ వసంత డుంబ్రే (29) ఎంబీఏ హోల్డర్ మరియు అతని జీవిత భాగస్వామి గౌరీ గోమాడే (21) చిత్రకళా మహావిద్యాలయలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ విద్యార్థి గత కొన్ని రోజులుగా దొంగతనాలను చేస్తూ కాలం గడుపుతూ ఉండే వారు.

నిందితుల కథణం
నిందితులు పోలీసులకు తెలిపిన సమాచారం ప్రకారం వారు ఇద్దరు గత కొన్ని నెలలుగా కలిసి ఒక 1BHK భవనంలో నివసిస్తున్నారు. వీరు జల్సాలకు అలవాటు పడి సుఖంగా మరియు త్వరగా డబ్బును సంపాదించడానికి దొంగతనాలను వృత్తిగా ఎంచుకున్నారు. వీరు దొంగతనాలను ఎలా చేయాలో తెలుసుకోవడానికి తరచుగా యూట్యూబ్‌లోని వీడియోలను చూస్తూ ఉండేవారు. ఇందులో ముఖ్యంగా దొంగతనం కోసం ఇంటిని ఎలా లూటీ చేయాలో తెలుసుకొనే వీడియోలను చూసేవారు. ఇందులో భాగంగా తలుపులను ఎలా పగలగొట్టాలి మరియు ఇనుప గొట్టాలను పగలగొట్టే గ్యాస్ కట్టర్‌లను ఎలా ఉపయోగించాలో వంటి వివరాలను యూట్యూబ్ ద్వారా తెలుసుకున్నారు.

వీరు ఇద్దరు మొదటిసారి ఏప్రిల్‌లో మంకపూర్ ప్రాంతంలోని ఒక ఇంటిలోకి ప్రవేశించి ఈ జంట రూ .2 లక్షలు దోచుకున్నట్లు ఆరోపణలు వచ్చాయని పోలీసులు తెలిపారు. తరువాత వారి విలాసవంతమైన జీవనశైలికి తోడ్పడటానికి ప్రతి నెలా రెండు లేదా మూడు ఇళ్లలో దొంగతనాలు చేయడం మొదలు పెట్టారు. చివరికి పోలీసులకు దొరికారు.

పోలీసుల కథణం
పోలీసుల విచారణలో నిందితులు తమ నేరాన్ని అంగీకరించినట్లు తెలిపారు. నిందితుల వద్ద నుండి వారు దొంగతనానికి వినియోగించిన కారు, గ్యాస్ కట్టర్ గన్, ఆక్సిజన్ సిలిండర్లు మరియు ఇతర ఉపకరణాలను స్వాధీనం చేసుకున్నట్లు మంకాపూర్ పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు..
తరువాతి వారంలో వారు తమకు దగ్గరలో ఉన్న ATMను దొంగలించడానికి కావలసిన సమాచారం సేకరించినట్లు తెలిపారు. అలాగే దీని కార్యాచరణ అమలుపరచడానికి కూడా యూట్యూబ్‌లోని వీడియోల ద్వారా సమాచారం సేకరించినట్లు తెలిపారు.


Click it and Unblock the Notifications








