Home
News

ఐఫోన్‌ ఆర్డర్‌ ‌క్యాన్సిల్.. ఉద్దేశపూర్వకంగా చేశారంటూ ఫ్లిప్‌కార్ట్‌కు జరిమానా విధించిన వినియోగదారుల కమిషన్‌.!

ఫ్లిప్‌కార్ట్‌కు (Flipkart) డిస్ట్రిక్ట్‌ కన్స్యూమర్‌ డిస్ప్యూట్‌ రిడ్రెసల్‌ కమిషన్‌ (జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కర కమిషన్‌) గట్టి షాక్‌ ఇచ్చింది. ఓ వివాదంలో రూ.10,000 జరిమానా చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. ఓ కస్టమర్‌ ఆర్డర్‌ను అతని అనుమతి లేకుండా ఏకపక్షంగా క్యాన్సిల్‌ చేసిందని స్పష్టం చేసింది.

ఈ సందర్భంగా సెంట్రల్‌ ముంబైలోని జిల్లా వినియోగదారుల కమిషన్‌ ఈ సందర్భంగా ఫ్లిప్‌కార్ట్‌పై (RS10000 Fine imposed to Flipkart) కీలక వ్యాఖ్యలు చేసింది. అధిక లాభాలు కోసమే కస్టమర్‌ బుకింగ్‌ చేసుకున్న ఐఫోన్‌ను క్యాన్సిల్‌ చేసిందని స్పష్టం చేసింది. ఉద్దేశపూర్వకంగానే ఈ చర్యలకు పాల్పడినట్లు భావిస్తున్నట్లు తీర్పు సందర్భంగా వ్యాఖ్యానించింది.

Mumbai district consumer disputes redressal commission imposes fine to Flipkart

కస్టమర్‌ బుకింగ్ చేసుకున్న ఐఫోన్‌ను ఏకపక్షంగా రద్దుచేయడం వల్ల అతను మానసిక వేదన అనుభవించారని అందువల్ల అతనికి పూర్తి పరిహారం దక్కాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ముంబైలోని దాదర్‌కు చెందిన వ్యక్తి 2022 జులై 10న ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా ఐఫోన్ కొనుగోలు కోసం క్రెడిట్‌ కార్డు ద్వారా రూ.39,628 చెల్లించాడు. జులై 12న డెలివరీ రావాల్సి ఉంది.

అయితే అక్కడి ఆరు రోజుల తర్వాత అతని ఆర్డర్‌ క్యాన్సిల్‌ చేసినట్లు ఫ్లిప్‌కార్ట్‌ నుంచి మెసేజ్ వచ్చింది. డెలివరీ చేసేందుకు Ekart ద్వారా చాలాసార్లు ప్రయత్నం చేసినా స్పందన లేకపోయిన కారణంగా ఆర్డర్‌ రద్దుచేసినట్లు సంస్థ పేర్కొంది. దీంతో సదరు వ్యక్తి జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.

తాను బుకింగ్‌ చేసిన ఐఫోన్ ఆర్డర్‌ కారణంగా ఆర్థిక నష్టం, మానసిక క్షోభకు గురైనట్లు పేర్కొన్నాడు. మరియు ఇది ఆన్‌లైన్‌ మోసం కిందకూ వస్తుందని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఈ కేసు విచారణ సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ ను కమిషన్‌ వివరణ కోరింది. అయితే తమది కేవలం ఆన్‌లైన్‌ పోర్టల్‌ మాత్రమేనని ఫ్లిప్‌కార్ట్‌ తెలిపింది.

ఇది కస్టమర్‌, ఇంటర్నేషనల్‌ వాల్యూ రిటైల్‌ ప్రైవేట్‌ లిమిడెట్‌ సంస్థ మధ్య వివాదమని పేర్కొంది. కస్టమర్ చెల్లించిన నగదును తిరిగి చెల్లిస్తామని తెలిపింది. దీనిపై విచారణ సందర్భంగా కమిషన్‌ కీలక వ్యాఖ్యలు చేసింది. ఐఫోన్ ఆర్డర్‌ చేసిన కస్టమర్‌ సదరు సంస్థకు అందుబాటులో ఉన్నారని, ఆ సమయంలోనే ఆర్డర్‌ను రద్దు చేసినట్లు కమిషన్‌ తెలిపింది.

మరియు వివాదాన్ని పరిష్కరించేందుకు తాము ప్రయత్నం చేసినట్లు సంస్థ కస్టమర్‌కు చెప్పినట్లు కమిషన్‌ తెలిపింది. దీంతో ఈ వివాదంలో ఫ్లిప్‌కార్ట్‌కు బాధ్యత ఉందని స్పష్టం చేసింది. అయితే వివాదం అనంతరం కస్టమర్‌కు నగదు రిఫండ్‌ చేసి కొత్తగా మరో ఆర్డర్‌ చేసుకోవాలని సూచించిన, ఆఫర్ ముగిసిన కారణంగా ఐఫోన్ ధర రూ.7000 పెరిగిందని కమిషన్ తెలిపింది.

ఆర్డర్‌ రద్దు చేసి మనోవేదనకు గురిచేశార్న వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌ :
ఈ వ్యవహారం కస్టమర్‌ను మనోవేదనకు గురిచేయడమేనని కమిషన్ స్పష్టం చేసింది. అదనపు లాభాల కోసమే ఇలా వ్యవహరించాలని భావిస్తున్నట్లు చెప్పిన కమిషన్.. రూ.10000 జరిమానా చెల్లించాలని స్పష్టం చేసింది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Mumbai district consumer disputes redressal commission imposes fine to Flipkart
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X