ముంబై నగరంలో ఏసీ పబ్లిక్ టాయిలెట్

Posted By:

ముంబై మున్సిపల్ కార్పొరేషన్ దేశంలోనే మొట్టమొదటి సారిగా అత్యాధునిక వసతులతో కూడిన పబ్లిక్ ఏసీ మరుగుదొడ్లను ప్రారంభించింది. ముంబై శివారు దాదర్ ప్రాంతంలోని ప్లాజా థియోటర్ సమీపంలో ఏర్పాటు చేసిన ఈ ఎయిర్ కండీషనింగ్ పబ్లిక్ టాయిలెట్‌లో మొత్తం 5 ఏసీలను అమర్చారు. రెండు ఏసీలు మగవారి విభాగంలో కాగా, రెండు ఏసీలు ఆడువారి విభాగంలో, మరొక ఏసీని వెయిటింగ్ ఏరియాలో ఏర్పాటు చేసారు.

ముంబై నగరంలో ఏసీ పబ్లిక్ టాయిలెట్

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన(ఎంఎన్ఎస్) అధ్యక్షుడు రాజ్ థాకరే ఈ ప్రజా టాయిలెట్‌ను శనివారం ప్రారంభించారు. ఈ టాయిలెట్‌లను వినియోగించుకునే ప్రజానీకం చార్జ్ క్రింద రూ.5 చెల్లించాల్సి ఉంటుంది. 3000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నెలకొల్పబడిన ఈ ప్రజా టాయిలెట్ వెయిటింగ్ హాల్‌లో ప్రజలు సేదతీరేందుకు రూ.2.5 లక్షల విలువ చేసే సోఫా సెట్‌లతో పాటు 42 అంగుళాల ఎల్‌సీడీ టీవీని ఏర్పాటు చేయటం జరిగింది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot