అమెజాన్‌లో మౌత్ వాష్ ఆర్డర్ చేసాడు!! స్మార్ట్‌ఫోన్ పొందాడు.. లక్ అంటే తనదే
అదృష్టం అనేది ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో చెప్పలేము. ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలు అమెజాన్ మరియు ఫ్లిప్ కార్ట్ ల యొక్క ఆన్‌లైన్ ఆర్డర్ల మీద స్మార్ట్‌ఫోన్‌లకు బదులుగా రిన్ సోప్ లను పొందడం చాలానే చూసాము. కానీ ఇప్పుడు ముంబైలో వినూత్నంగా ఒక మౌత్ వాష్ ఆర్డర్ చేస్తే అతనికి దానికి బదులుగా కొత్త రెడ్‌మి స్మార్ట్‌ఫోన్ వచ్చింది. వివరాలలోకి వెళితే కరోనా సమయంలో ముంబైకి చెందిన అమన్ అనే వ్యక్తి అమెజాన్ నుండి మౌత్ వాష్ కోసం ఆర్డర్ ఇచ్చాడు. అయితే దానికి బదులుగా స్మార్ట్ఫోన్ అందుకున్నాడు. ఈ విషయాన్ని ట్విట్టర్ యూజర్ లోకేష్ డాగా తన పోస్ట్‌లో అమెజాన్ ఇండియాను ట్యాగ్ చేయడంతో పాటుగా తన ఆర్డర్ యొక్క స్క్రీన్ షాట్‌లను కూడా షేర్ చేసాడు.

లోకేష్ డాగా మే 10 న అమెజాన్‌లో 396 రూపాయల ధర గల నాలుగు కోల్‌గేట్ మౌత్ వాష్ బాటిళ్ల కోసం ఆర్డర్ ఇచ్చారు. కానీ అతను అందుకున్నది చూసి ఆశ్చర్యపోయాడు. కారణం అతను పొందింది 13,000 రూపాయల విలువ గల కొత్త రెడ్‌మి నోట్ 10 స్మార్ట్‌ఫోన్. ఇతను ట్విట్టర్ లో ఇలా పోస్ట్ చేసాడు. "హలో @amazonIN. ORDER # 406-9391383-4717957 ద్వారా కోల్‌గేట్ మౌత్ వాష్‌ను ఆర్డర్ చేశాను. అయితే దానికి బదులుగా నేను @RedmiIndia note 10 ను అందుకున్నాను.

మౌత్ వాష్ వినియోగించదగిన ఉత్పత్తి కాబట్టి రాబడి పరిమితం చేయబడింది మరియు యాప్ ద్వారా తిరిగి రావాలని అభ్యర్థించలేకపోతున్నాను "అని లోకేష్ డాగా తన యొక్క ట్విట్టర్లో పోస్ట్ చేసాడు. అలాగే "అయితే నేను ప్యాకేజీని ఓపెన్ చేసినప్పుడు ప్యాకేజింగ్ లేబుల్ నాది కాకుండా ఇన్వాయిస్ వేరొకరిది చేసాను. ఉత్పత్తిని సరైన వ్యక్తికి అందించడానికి నేను మీకు ఇమెయిల్ పంపాను. " అని తెలిపారు.


Click it and Unblock the Notifications








