Home
News

లేడిస్ హాస్టల్ లో సీక్రెట్ కెమెరాలు.. పట్టుబడిన హాస్టల్ యజమాని

ముంబైలోని ఓ లేడిస్ హాస్టల్ లో కలకలం రేగింది. అమ్మాయి గదిలో సీక్రెట్ కెమెరా బయటపడటంతో పోలీసులకు సమాచారం అందించారు. తనిఖీలు నిర్వహించగా రహస్య కెమెరా బయటపడింది . దీంతో హాస్టల్ యజమానిని పోలీసులు అదుపు

ముంబైలోని ఓ లేడిస్ హాస్టల్ లో కలకలం రేగింది. అమ్మాయి గదిలో సీక్రెట్ కెమెరా బయటపడటంతో పోలీసులకు సమాచారం అందించారు. తనిఖీలు నిర్వహించగా రహస్య కెమెరా బయటపడింది . దీంతో హాస్టల్ యజమానిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.ఈ సంఘటన పూర్తి వివరాల్లోకి వెళితే..

ముంబై  గిర్గావ్ లో ఓ 47 ఏళ్ల వ్యక్తి లేడీస్ హాస్టల్....

ముంబై గిర్గావ్ లో ఓ 47 ఏళ్ల వ్యక్తి లేడీస్ హాస్టల్....

ముంబై గిర్గావ్ లో ఓ 47 ఏళ్ల వ్యక్తి తన నివాసంలోనే లేడీస్ హాస్టల్ నిర్వహిస్తూ తన తల్లితండ్రులతో ఉండేవాడు. అదే హాస్టల్ కొందరు అమ్మాయిలు సంవత్సరం నుంచి ఉండేవాళ్లు అయితే గత కొద్దీ రోజుల నుంచి అమ్మాయిలు హాస్టల్ లో ఏం మాట్లాడేవారో సీక్రెట్ కెమెరా ద్వారా వినేవాడు.

తమ మాటలు వినట్టు....

తమ మాటలు వినట్టు....

హాస్టల్ ఓనర్ తమ మాటలు వినట్టు అమ్మాయిలకి డౌట్ వచ్చింది.అయితే ఒక రోజు ఆ అమ్మాయిలు వారు ఉన్న రూమ్ లో చిన్న ఎలక్ట్రిక్ అడాప్టర్ ను కనుగొన్నారు. వెంటనే వారు ఆ అడాప్టర్ ను చిన్న కట్చీఫ్ తో కవర్ చేసారు.చెకింగ్ కి వచ్చిన ఆ హాస్టల్ ఓనర్ వెంటనే ఆ కట్చీఫ్ ను అక్కడి నుంచి తొలిగించమని కోరాడు.

గూగుల్ లో సెర్చ్ చేయగా అది సీక్రెట్ కెమెరా...

గూగుల్ లో సెర్చ్ చేయగా అది సీక్రెట్ కెమెరా...

డౌట్ వచ్చిన ఆ అమ్మాయిలు వెంటనే గూగుల్ లో సెర్చ్ చేయగా అది సీక్రెట్ కెమెరా అని తెలుసుకొని అవాక్కయ్యారు.హాస్టల్ అమ్మాయిలు అందరూ కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో హాస్టల్ యజమానిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించారు.

పోలీసులు తనిఖీలు నిర్వహించగా రహస్య కెమెరాలు బయటపడ్డాయి....

పోలీసులు తనిఖీలు నిర్వహించగా రహస్య కెమెరాలు బయటపడ్డాయి....

పోలీసులు తనిఖీలు నిర్వహించగా బెడ్ రూమ్,ఫ్యాన్ , విండోస్ కి , కరెంట్ ప్లగ్స్, బట్టలు మార్చుకునే స్థలంలో రహస్య కెమెరాలు బయటపడ్డాయి.అతని ల్యాప్ టాప్ స్వాధీనం చేసుకున్న పోలీసులు అందులో చాలా‌ మంది అమ్మాయిల వీడియోలు ఉన్నాయని తెలిపారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

కొన్ని  రోజుల క్రితం తమిళనాడు లో  ఇలాంటి ఘటనే మరొకటి  చోటు చేసుకుంది....

కొన్ని రోజుల క్రితం తమిళనాడు లో ఇలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది....

లేడిస్ హాస్టల్ లో రహస్యంగా కెమెరాలు పెట్టి అమ్మాయిల వీడియోలను రికార్డు చేస్తున్న హాస్టల్ ఓనర్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన చెన్నై లో జరిగింది. ఆదంబాక్కం తిల్లై నగర్‌లో 49 ఏళ్ల సంజీవి అనే వ్యక్తి తన నివాసం లోని రెండో అంతస్తులో లేడీస్ హాస్టల్ ను నిర్వహిస్తున్నాడు.ఇందులో 10 మంది అమ్మాయిలు ఉంటున్నారు.

 హాస్టల్‌లో మరమ్మత్తుల చేశాడు....

హాస్టల్‌లో మరమ్మత్తుల చేశాడు....

కొద్దిరోజుల క్రితం సంజీవ్ హాస్టల్‌లో మరమ్మత్తుల చేశాడు. అతడి తీరుపై హాస్టల్‌లో ఉంటున్న ఓ యువతికి తాను ఉంటున్న రూం లో రహస్య కెమెరాలు ఉన్నట్టు అనుమానం వచ్చింది. దీంతో ఆ కెమెరాల‌ను ఎలా కనిపెట్టాలని గూగుల్ సెర్చ్‌ చేస్తే సాఫ్ట్‌వేర్‌ దొరికింది.

సీక్రెట్ కెమెరాల కోసం వెతికింది...

సీక్రెట్ కెమెరాల కోసం వెతికింది...

సాఫ్ట్‌వేర్‌ను తన ఫోన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకుని సీక్రెట్ కెమెరాల కోసం వెతికింది. బెడ్‌రూమ్, బాత్ రూమ్‌లు, బట్టలు తగిలించుకునే హ్యాంగర్లతో పాటూ కొన్ని చోట్ల రహస్య కెమెరాలు ఉన్నట్లు గుర్తించింది. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హాస్టల్ యజమానిని అదుపులోకి తీసుకున్నారు. ఐటీ చట్టం కింద కేసు నమోదు చేశారు.

వైఫై ఆన్ చేసి బ్లూటూత్ కెమెరాల్లో రికార్డైన అమ్మాయిల వీడియోలను...

వైఫై ఆన్ చేసి బ్లూటూత్ కెమెరాల్లో రికార్డైన అమ్మాయిల వీడియోలను...

తన నివాసం నుండే వైఫై ఆన్ చేసి బ్లూటూత్ కెమెరాల్లో రికార్డైన అమ్మాయిల వీడియోలను తన ఫోన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకుని చూస్తున్నట్లు విచారణలో సంజీవి తెలిపాడు. అతని ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు అందులో చాలా‌ మంది అమ్మాయిల వీడియోలు ఉన్నాయని తెలిపారు.

More from GizBot

Best Mobiles in India

English summary
Mumbai: PG owner held for fixing hidden camera in ladies' bathroom.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X