Home
News

సెల్ఫీ పిచ్చి ప్రాణాలను ఎలా తీసిందో చూస్తే ఒళ్లు ఝలదరించడం ఖాయం

సెల్ఫీ .. ప్రస్తుతం కొంత మంది యువత వెరైటీగా దిగి అందిరినీ ఆకట్టుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తుంటారు. అయితే ఆ సెల్ఫీ క్రేజ్లో పడి .. చైనాలోని పెనాన్ ప్రావిన్స్కి చెందిన ఓ 19 ఏళ్ల యువకుడు ప్రాణాలు క

సెల్ఫీ .. ప్రస్తుతం కొంత మంది యువత వెరైటీగా దిగి అందిరినీ ఆకట్టుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తుంటారు. అయితే ఆ సెల్ఫీ క్రేజ్లో పడి .. చైనాలోని పెనాన్ ప్రావిన్స్కి చెందిన ఓ 19 ఏళ్ల యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. కాస్త వెరైటీగా సెల్ఫీ దిగుదామనుకున్నాడో .. ఏమోగానీ .. డేరింగ్ సెల్ఫీకి ప్రయత్నించి విఫలమయ్యాడు. క్వీన్యాంగ్ ప్రాంతంలోని ఓ 18 అంతస్తుల భవనం కార్నర్ నుంచి సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించాడు.

 సెల్ఫీ పిచ్చి ప్రాణాలను ఎలా తీసిందో చూస్తే ఒళ్లు ఝలదరించడం ఖాయం

అయితే ఆ గోడ చివర రూఫ్ కూలిపోవడంతో ఆ యువకుడు ఒక్కసారిగా ప్రాణాలు కోల్పోయాడు. ఆ సమయంలో ఎదరుగా ఉన్న భవనం నుంచి ఓ వ్యక్తి వీడియో తీయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. రూఫ్టాప్ నిర్మాణంలో నాణ్యత లేకపోవడం వల్లే ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.

ప్రమాదకరమైన సెల్ఫీ వీడియో

సెల్పీ తీసుకోవడానికి అమితంగా ఇష్టపడుతున్న యూత్కు ముంబై పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. చావు అంచున నిలబడి సెల్ఫీలు దిగడంపై ప్రశ్నిస్తూ .. ఓ ప్రమాదకరమైన సెల్ఫీ వీడియో పోస్టు చేశారు.

గురుత్వాకర్షణ శక్తి డబుల్

గురుత్వాకర్షణ శక్తి డబుల్

బిల్డింగ్ అంచున నిలబడి సెల్ఫీ తీసుకుంటుంటే గురుత్వాకర్షణ శక్తి డబుల్ అయింది. బిల్డింగ్ అంచులు కూలిపోవడంతో ఒక్కసారిగా నేలకూలిపోయాడు. ఈ వీడియోను పోస్టు చేసిన ముంబై పోలీసులు ప్రాణం పోతే తిరిగి రాదని ఇలాంటి సాహసాలు ఎట్టి పరిస్థితుల్లో చేయరాదని హెచ్చరికలు జారీ చేశారు.
ప్రపంచవ్యాప్తంగా 259 మంది ఆత్మహత్యలు మరణించినట్లు ప్రముఖ ఇంగ్లీష్ మీడియా తెలిపింది. న్యూ ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ రీసెర్చర్స్ పరిశోధనల ప్రకారం .. సెల్ఫీ మరణాలు అక్టోబర్ 2011 నుంచి నవంబరు 2017 లు ఎక్కువైయ్యాయట.

భారత్ నుంచి సగానికి పైగా

భారత్ నుంచి సగానికి పైగా

2011 నుంచి ప్రపంచంలో సెల్ఫీ కారణంగా చనిపోయిన వారిలో భారత్ నుంచి సగానికి పైగా మనుషులు అంటే 159 వరకూ ప్రాణాలు కోల్పోయారట. ఈ క్రమంలోనే ముంబై పోలీసులు సెల్పీ తీసుకుంటున్న యువకుడు అదుపుతప్పి నేలమీద పడిపోయిన వీడియోను ట్వీట్ చేసి ఇలా రాసుకొచ్చారు.

అతని ప్రాణాలు కోల్పోయేలా

అతని ప్రాణాలు కోల్పోయేలా

'చాలా ధైర్యవంతమైన సెల్ఫీ తీసుకుందామనుకున్నాడో ... బాధ్యతారహితంగా ఫీట్ చేద్దామనుకున్నాడో .. ఏదీ ఏమైనా కానీ, ఈ ఫీట్ అతని ప్రాణాలు కోల్పోయేలా చేసింది' అని ట్వీట్ చేశారు.ఏప్రిల్ 22న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ముంబై పోలీసులు ట్వీట్ చేశారు.

#SafetyFirst

సెల్ఫీ పిచ్చితోనో.. లేక సాహసాల పేరుతోనో ప్రాణాలు కోల్పోవొద్దని సందేశమిచ్చారు. దీంతో ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. డేరింగ్‌ సెల్ఫీ కోసం ప్రయత్నం చేస్తున్నారా? బాధ్యత లేకుండా సాహసాలు చేస్తున్నారా ? చేసేదేదైనా మీకు మిగిలేది రిస్క్‌ మాత్రమే అంటూ హెచ్చరించారు. సేఫ్టీ ఫస్ట్‌ (#SafetyFirst )అనే హ్యాష్‌ ట్యాగ్‌తో ముంబై పోలీసులు ఈ పోస్ట్‌ పెట్టారు.

 

Best Mobiles in India

English summary
Mumbai Police tweets video of boy falling from building while taking selfie
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X