Home
News

ఇన్‌స్టంట్‌ బ్యాంక్‌ లోన్‌ ఇస్తామంటూ ఫోన్లు వస్తున్నాయా... అయితే జర జాగ్రత్త!

టెక్నాలజీ రోజురోజుకు గణనీయంగా అభివృద్ధి చెందుతోంది. ఈ సాంకేతికతను సైబర్‌ నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. అమాయక ప్రజలను మోసం చేస్తున్నారు. ఇటీవల కాలంలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ ఆధారిత డీప్‌ పేక్‌ సహా ఇతర టెక్నాలజీలతో ప్రజలను మోసం చేస్తున్నారు. అందినకాడికి దోచుకుంటున్నారు.

ఇన్‌స్టంట్‌ లోన్‌ పేరుతో మోసం : తాజాగా ఇన్‌స్టంట్‌ లోన్‌ ఇస్తామంటూ ఓ వ్యక్తిని సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. అతని నుంచి 90 వేల రూపాయలు వసూలు చేశారు. దీంతోపాటు అదనంగా నగదు చెల్లించాలని కోరడంతో మోసపోయానని గుర్తించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.

instant loan scam

నేవీ ముంబైకి చెందిన ఓ వ్యక్తి ఫేస్‌బుక్‌లో కేవలం 2 గంటల్లోనే ఇన్‌స్టంట్‌ లోన్ ఇస్తామన్న యాడ్‌ కనిపించింది. దీంతో 56 ఏళ్ల వ్యక్తి లోన్‌ కోసం దరఖాస్తు చేశాడు. తన కుమార్తె చదువు కోసం లోన్‌ కావాలని కోరాడు. అయితే దరఖాస్తు చేసిన కొన్ని నిమిషాల్లోనే బాధితుడికి ఫోన్‌ వచ్చింది. లోన్‌ మంజూరు చేస్తామని అందుకు ఇన్స్యూరెన్స్‌, జీఎస్టీ, ఎన్‌వోసీ ఛార్జీల కింద రూ.90 వేలు చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు.

అయితే రూ.90 వేలు చెల్లించిన తర్వాత కూడా బాధితుడికి లోన్‌ మంజూరు కాలేదు. అంతేకాకుండా అదనంగా మరికొంత మొత్తం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. దీంతో మోసపోయానని గుర్తించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటన నవంబర్‌ 8 జరిగింది. బాధితుడి ఫిర్యాదుతో IPC 420 మరియు ఐటీ శాఖ చట్టం ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు.

* ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత డీప్‌ఫేక్‌ టెక్నాలజీతో సాయంతో సైబర్‌ నేరగాళ్లు చెలరేగిపోతున్నారు. గతవారం మొదట్లో డీప్‌ఫేక్‌ టెక్నాలజీని ఉపయోగించి ప్రముఖ నటి రష్మిక మందన్న నకిలి వీడియోను క్రియేట్‌ చేశారు. ఈ వీడియో బాగా వైరల్‌ అయింది. ఈ నకిలీ వీడియోపై నటి రష్మిక తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది. డీప్‌ఫేక్‌ టెక్నాలజీతో స్నేహితుడి వలే వీడియో కాల్ చేసి, తనకు కొంత డబ్బు అవసరం ఉందని, వెంటనే పంపాలని కోరాడు. అయితే ఈ కాల్ నిజమని నమ్మిన ఓ వ్యక్తి రూ.40 వేల రూపాయలు పొగొట్టుకున్నాడు. ఈ తాజా ఘటనలో డీప్‌ఫేక్‌ టెక్నాలజీ దుర్వినియోగంపై మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది.

ఈ ఘటనలో కోల్‌ ఇండియా మాజీ ఎగ్జిక్యూటివ్‌ రాధాకృష్ణన్‌ను మోసం చేశారు. డీప్‌ఫేక్‌ టెక్నాలజీ ఆధారంగా వీడియో కాల్‌ చేసి, తన సోదరికి ఆపరేషన్‌ జరుగుతోందని అత్యవసరంగా రూ.40 వేల కావాలని కోరాడు. తొలుత రాధాకృష్ణన్‌ కొంత అనుమానం వ్యక్తం చేసినా... వీడియో కాల్‌ చేయడంతో అనుమానం నివృత్తి అయింది.

దీంతో వెంటనే గూగుల్‌ పే ద్వారా రూ.40 వేల నగదును బదిలీ చేశాడు. అయితే మరో 35 రూపాయలు కావాలని మరోసారి ఫోన్‌ చేయగా.. రాధాకృష్ణన్‌కు అనుమానం వచ్చింది. దీంతో తన వద్దనున్న వేణుకుమార్‌ ఫోన్‌ నంబర్‌కు కాల్ చేశారు. దీంతో ఇదంతా మోసంగా తెలుసుకున్న రాధాకృష్ణన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుమారు 4 నెలల విచారణ అనంతరం కోజికొడ్‌ పోలీసులు నిందితుల్లో ఒకరిని అరెస్ట్‌ చేశారు.

Best Mobiles in India

English summary
mumbai resident loses rs90000 in instant loan scam
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X