వీకెండ్ పార్టీకని ఫైవ్ స్టార్‌కెళ్శి, స్విమ్మింగ్ పూల్‌లో చనిపోయిన ఐటి మేనేజర్

Posted By: Super

వీకెండ్ పార్టీకని ఫైవ్ స్టార్‌కెళ్శి, స్విమ్మింగ్ పూల్‌లో చనిపోయిన ఐటి మేనేజర్

పూణె: వీకెండ్ పార్టీకని పూణెలోని ఖండాలా ప్రాంతానికి వెళ్శినటువంటి సాప్ట్‌వేర్ ఇంజనీర్ల బృందానికి సంబంధించిన వ్యక్తి ఐదు నక్షత్రాల హోటల్‌లో ఉన్నటువంటి స్విమ్మింగ్ పూల్‌లో పడి మరణించడం జరిగింది. వివరాలలోకి వెళితే మృతుడు పేరుని జయప్రకాష్ శంకరన్ నాయర్‌గా గుర్తించడం జరిగింది. అతని వయసు 31సంవత్సరాలు. ముంబై అర్జన్ ఏరియా అయినటువంటి కందివ్లిలో అతను నివాసం ఉంటున్నట్లు తెలిసింది. కాన్పరెన్స్ కోసమని విక్రోలి నెట్ మ్యాజిక్‌కి సంబంధించినటువంటి 70 మంది ఐటి ప్రోపెషనల్స్ బృందం శుక్రవారం ఐదు నక్షత్రాలు హూటల్ అయినటువంటి డూక్స్ రీట్రీట్‌కి రావడం జరిగింది.

అక్కడకి వచ్చినటువంటి ఐటి ప్రోపెషనల్స్ బృందంలో శనివారం సాయంత్రం ఐదుగురు స్విమ్మింగ్ పూల్‌లో ఈత కోడదామని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ ఐదుగురిలో నాయర్ ఒకడు. సాయంత్రం ఏడు గంటలు అవ్వడంతో ఈసమయంలో ఈతకి వెళ్శడం మంచిది కాదని అక్కడున్నటువంటి స్టాఫ్ చెబుతున్నప్పటకీ ఈ ఐదుగురు వినకుండా ఈత కొట్టడానికి పరిమిషన్ తీసుకన్నామని చెప్పి ఒక లైప్ గార్డు సహాయంతో ఈత కొలనులోకి దిగారని అక్కడున్న ఉద్యోగి పోలీసులుకు వివరించడం జరిగింది.

ఆ తర్వాత సమయం 7.45నిమిషాలకు నాయర్ స్విమ్మింగ్ పూల్‌లో కనిపించక పోవడంతో అతని స్నేహితులు, లైప్ గార్డు ఇద్దరూ కూడా స్మిమ్మింగ్ పూల్‌‌లో దూకి అతనిని బయటకు తీయడం జరిగింది. కొన ఊపిరితో ఉన్న నాయర్ హాస్పిటల్‌కి తీసుకువెళుతున్న సమయంలో మరణించడం జరిగిందని వివరించారు. కొత్తగా పెళ్శి చేసుకున్నటువంటి ఐటి మేనేజర్ నాయర్ స్నేహితులు మాత్రం నాయర్ మాకు మంచి స్విమ్మర్ అని చెప్పడంతో మేము అతనితో పాటు ఈత కొలను దిగడం జరిగిందని తెలియజేశారు. నాయర్ స్విమ్మింగ్ పూల్ అడుగు భాగానికి వెళ్శడంతో శ్వాస తీసుకోవడానికి కష్టమైపోయి చనిపోవడం జరిగిందని అక్కడున్న సాక్షి వెల్లడించడం జరిగింది.

ఇక లోన్లావాలా పోలీస్ నాయర్ శరీరాన్ని పోస్ట్ మార్టమ్‌కు తరలించడం జరిగింది. హూటల్ అధారిటీస్ వద్దు అని చెప్పినా వినకుండా ఈతకు వెళ్శినటువంటి నాయర్ ప్రెండ్స్‌ని పోలీసులు గట్టిగా మందలించడం జరిగింది. పోస్ట్ మార్టమ్ వివరాల ప్రకారం నాయార్ స్విమ్మింగ్ పూల్‌లో అడుగు భాగానికి వెల్లడం వల్ల శ్వాస అందక చనిపోయాడని పోలీసులు వెల్లడించారు. అంతేకాకుండా ఈ కేసులో ఎటువంటి మిస్టరీ లేదని తెలియజేశారు. ఆదివారం సాయంత్రానికల్లా నాయర్ శరీరాన్ని తన ఇంటికి పంపంచడం జరుగుతుందని, అతని పార్దీవ శరీరాన్ని తన తండ్రి శంకరన్‌కు అప్పగించడం జరుగుతుందని లోన్లావాలా పోలీసులు తెలియజేశారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot