హైదరాబాద్ ఇంటర్నెట్ యూజర్లు 4.7మిలియన్‌లు

Posted By:

దేశీయంగా ఇంటర్నెట్ వినియోగం విస్తరిస్తోంది. 2013, ఇంటర్నెట్ వినియోగానికి సంబంధించి ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐఏఎమ్ఏఐ) ఇటీవల విడుదల చేసిన ఓ నివేదిక ప్రకారం హైదరాబాద్ 4.7 మిలియన్లు ఇంటర్నెట్ యూజర్‌లను కలిగి ఉంది. 2012లో ఈ సంఖ్య 3.6 మిలియన్లు. 12 మిలియన్‌ల ఇంటర్నెట్ వినియోగదారులతో ముంబయ్ మొదటి స్థానంలో నిలిచింది. 2012లో ముంబయ్ ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య 8.3 మిలియన్లు.

హైదరాబాద్ ఇంటర్నెట్ యూజర్లు 4.7మిలియన్‌లు

81 లక్షల ఇంటర్నెట్ వినియోగదారులతో ఢిల్లీ రెండవ స్థానంలో నిలిచింది. 2012లో ఢిల్లీ ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 60లక్షలు. నాలుగవ స్థానంలో నిలిచిన చెన్నై 45 లక్షల ఇంటర్నెట్ వినియోగదారులను కలిగి ఉంది. 2012లో చెన్నై ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య 34లక్షలు. ఐదవ స్థానంలో నిలిచిన కోల్‌కతా 44 లక్షల ఇంటర్నెట్ వినియోగదారులను కలిగి ఉంది. 2012లో కోల్‌కతా ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య 30 లక్షలు.

6వ స్థానంలో నిలిచిన బెంగుళూరు 38 లక్షల ఇంటర్నెట్ వినియోగదారులను కలిగి ఉంది. 2012లో ఈ సంఖ్య 27 లక్షలు. 7వ స్థానంలో ఆహ్మదాబాద్ 28 లక్షల ఇంటర్నెట్ యూజర్లను కలిగి ఉంది. 2012లో ఈ సంఖ్య 23 లక్షలు. 8వ స్థానంలో నిలిచిన పూణే 27 లక్షల ఇంటర్నెట్ వినియోగదారులను కలిగి ఉంది. 2012లో ఈ సంఖ్య 20 లక్షలు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot