30 సంవత్సరాల బంధం రేపటితో తీరిపోతుంది: మూర్తి

Posted By: Super

30 సంవత్సరాల బంధం రేపటితో తీరిపోతుంది: మూర్తి

న్యూఢిల్లీ: చిన్న ఐటి కంపెనీగా ప్రారంభమై దేశంలో అత్యున్నతమైన ఐటి కంపెనీగా 30 సంవత్సరాలుగా తన అమూల్యమైన సేవలు అందిస్తున్న ఇన్పోసిస్ కంపెనీ రూపశిల్పి, ఛైర్మన్ నారాయణ మూర్తి తనకు 65 సంవత్సరాలు వచ్చిన సందర్బంగా ఆగస్టు 20న తన కన్న బిడ్డలాంటి ఇన్పోసిస్ కంపెనీ నుండి రిటైర్ అవ్వనున్నారు.
ఆగస్టు 21 నుండి ఇన్పోసిస్ చైర్మన్‌గా బ్యాంకర్ కెవి కామత్ ఆ భాద్యతలను నిర్వర్తించనున్నారు. కొత్తగా పదవులను అలంకరించిన అందరూ లీడర్స్ కూడా ఆగస్టు 21 నుండి వారి వారి విధులను నిర్వర్తించనున్నారు.

ఇన్పోసిస్ రూపశిల్పి నారాయణ మూర్తి 1981లో ఇన్పోసిస్ కంపెనీని తన ఆరుగురు పాట్నర్స్‌తో కలసి USD 250లతో స్దాపించడం జరిగింది. ప్రస్తుతం దేశంలో రెండవ అతి పెద్ద ఐటి దిగ్గజంగా ఏర్పడమే కాకుండా సంవత్సరానికి USD 6 బిలియన్ రెవిన్యూని ఉత్పత్తిని చేయడమే కాకుండా, ఇందులో మొత్తం సుమారుగా 1,30,820 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.

ఇది మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా Nasdaq లిస్ట్‌లో ఉన్న కంపెనీలలో ఇన్పోసిస్ ఒకటి. ఇటీవలే AGM మీటింగ్‌లో ఇన్పోసిస్ చైర్మన్ హోదాలో నారాయణ మూర్తి మాట్లాడుతూ ఆర్డినరి జనాభాకు నా జీవితమే ఆదర్శంగా నిలవాలని కోరుకుంటున్నానని తన సందేశాన్ని ప్రపంచానికి తెలిపారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot