నేటి గుగూల్ హోమ్ పేజి విశిష్టత!

Posted By: Prashanth

నేటి గుగూల్ హోమ్ పేజి విశిష్టత!

 

సెర్చ్ ఇంజన్ జెయింట్ గుగూల్ ఆయా రంగాల్లో సేవలందించిన ప్రముఖ వ్యక్తుల సేవలను స్మరిస్తూ వారి ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పే విధంగా గుగూల్ హోమ్ పేజీ పై వారి స్మృతులతో కూడిన డూడుల్‌ను ప్రవేశపెడుతున్న విషయం తెలిసిందే. ఈ బృహత్తరమైన కార్యక్రమంలో భాగంగా బుధవారం ‘రాబర్డ్ ఆర్థర్ బాబ్ మోగ్’ 78వ పుట్టిన రోజును పురస్కరించుకుని సంగీతక కళాకారుల కోసం ఆయన ఆవిష్కరించిన ఎలక్ట్రానిక్ వాయిద్యం ‘మూగ్ సింథసైజర్’ను డూడుల్‌గా గుగూల్ తన హోమ్ పేజీలో అలంకరించింది.

సంగీత ప్రపంచంలో కత్త ఒరవడికి నాంది పలికిన ఈ వాయిద్యం 1960- 70 ప్రాంతాల్లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. రాబర్ట్ ఆర్థర్ మోగ్, 1934 మే 23 న్యూయార్క్‌లో జన్మించారు. ఇంజనీరింగ్ ఫిజిక్‌లో పీహెచ్‌డి పట్టా పొందిన ఆర్థర్, ఎలక్ట్రానిక్ సంగీత పరికరాలను సృష్టించడంలో తన వృత్తి జీవితాన్ని ప్రారంభించాడు. ఈ రంగంలో విశేష సేవలకు గాను రాబర్టుకు 2002లో గ్రామీ అవార్డును బహుకరించారు.

In English

బ్రెయిట్ ట్యూమర్ వ్యాధి కారణంగా మోగ్ 2005 ఆగుష్టు 21న తుది శ్వాస విడిచారు. నేటి గుగూల్ హోమ్ పేజీలో దర్శనమిస్తున్న ఈ ఎలక్ట్ర్రానిక్ సంగీత పరికరాన్ని మీరు కూడా ప్లే చేసి చూడొచ్చు. పరికరంలో అమర్చిన 24 ‘కీ’లు వైవిధ్యభరితమైన సంగీతాన్ని విడుదల చేస్తాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot