MWC 2019లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ అవార్డు ఈ కంపెనీదే
బార్సిలోనాలో జరుగుతున్న MWC 2019 ఈవెంట్లో చైనా దిగ్గజం హువాయి కంపెనీకి చెందిన Mate 20 Pro బెస్ట్ స్మార్ట్ ఫోన్ అవార్డును గెలుచుకుంది. GSMA ఆధ్వర్యంలో జరిగిన అవార్డుల వేడకలో బెస్ట్ స్మార్ట్ ఫోన్ కేటగిర
బార్సిలోనాలో జరుగుతున్న MWC 2019 ఈవెంట్లో చైనా దిగ్గజం హువాయి కంపెనీకి చెందిన Mate 20 Pro బెస్ట్ స్మార్ట్ ఫోన్ అవార్డును గెలుచుకుంది. GSMA ఆధ్వర్యంలో జరిగిన అవార్డుల వేడకలో బెస్ట్ స్మార్ట్ ఫోన్ కేటగిరిలో హువాయి మేట్ 20 ప్రొ నామినేట్ అయింది. పవర్ పుల్ బ్యాటరీ ఫెర్ఫార్మెన్స్, అవుట్ స్టాండింగ్ కెమెరా సిస్టం, లాంగ్ బ్యాటరీ లైఫ్ , ఇన్నోవేటివ్ ఛార్జింగ్ సొల్యూషన్స్ , స్టిక్కింగ్ డిజైన్ లో ఈ ఫోన్ బెస్ట్ గా నిలిచింది.

కస్టమర్లకు ఆకట్టుకునే విధంగా సరికొత్త టెక్నాలజీతో బెస్ట్ ఉత్పత్తులను అందిస్తూ వినియోగదారులను ఆకట్టుకోవడంలో ఎప్పుడూ ఈ చైనా దిగ్గజం ముందు వరసలోనే ఉంది.

హువాయి మేట్ 20 ప్రొ ఫీచర్లు
6.39 ఇంచ్ క్యూహెచ్‌డీ ప్లస్ ఓలెడ్ డిస్‌ప్లే, 3120 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, హువావే కైరిన్ 980 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, 40, 20, 8 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 24 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, 3డీ ఫేస్ అన్‌లాక్, ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, డ్యుయల్ స్పీకర్లు, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్‌ఈ, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 4200 ఎంఏహెచ్ బ్యాటరీ, సూపర్ చార్జ్, వైర్‌లెస్ క్విక్ చార్జ్.

world’s first 7nm mobile
కాగా ఈ మొబైల్ వరల్డ్ ఫస్ట్ 7nm mobile AI chipset Kirin 980తో వచ్చింది. బ్యాటరీ లైఫ్ లో టాప్ క్లాస్ ఫెర్మార్మెన్స్ ఇస్తుంది. హువావే సూపర్ చార్జ్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీని ఈ ఫోన్‌లో అందిస్తున్నారు. దీని వల్ల ఈ ఫోన్ 0 నుంచి 70 శాతం చార్జింగ్ అయ్యేందుకు 30 నిమిషాల సమయం మాత్రమే పడుతుంది. ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్‌ను ఏర్పాటు చేశారు.

వైర్‌లెస్ క్విక్ చార్జ్ సపోర్ట్
అలాగే వైర్‌లెస్ క్విక్ చార్జ్ సపోర్ట్‌ను కూడా ఈ ఫోన్‌కు అందిస్తున్నారు. దీంతోపాటు వైర్‌లెస్ రివర్స్ చార్జింగ్ ఫీచర్ ఉన్నందున ఈ ఫోన్‌తో ఇతర డివైస్‌లను వైర్‌లెస్‌గా చార్జింగ్ చేసుకోవచ్చు.6.39 ఇంచుల భారీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఈ ఫోన్‌లో అమర్చారు. ఈ ఫోన్‌లో ముందు భాగంలో ఉన్న కెమెరాకు 3డీ ఫేస్ అన్‌లాక్ సదుపాయాన్ని అందిస్తున్నారు.

కెమెరా
కెమెరాతో 3డీ లైవ్ ఎమోజీలను కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఈ ఫోన్‌లో వెనుక భాగంలో 40, 20, 8 మెగాపిక్సల్ కెమెరాలు మూడింటిని ఏర్పాటు చేయగా ముందు భాగంలో 24 మెగాపిక్సల్ కెమెరా ఉంది. ఈ ఫోన్‌లో కొత్తగా ఎన్‌ఎం కార్డ్ స్లాట్‌ను ఏర్పాటు చేశారు. మైక్రో ఎస్‌డీ కార్డుకు బదులుగా ఎన్‌ఎం కార్డులను ఈ స్లాట్‌లో వేసుకోవాల్సి ఉంటుంది. ఈ కార్డులను కూడా హువాయినే తయారు చేస్తున్నది.

ధర
హువావే మే20 ప్రొ ఫోన్ మిడ్‌నైట్ బ్లూ, బ్లాక్, ట్విలైట్, ఎమరాల్డ్ గ్రీన్ కలర్ వేరియెంట్లలో విడుదల కాగా ఈ ఫోన్ రూ.69,990 ధరకు వినియోగదారులకు లభిస్తోంది. ఈ ఫోన్‌కు గాను మరో రూ.2వేలను అదనంగా చెల్లిస్తే రూ.29,990 విలువైన సెన్‌హెయిజర్ పీఎక్స్‌సీ550 వైర్‌లెస్ హెడ్‌ఫోన్స్‌ను ఉచితంగా అందివ్వనున్నారు.

ఇతర ఉత్పత్తులు
ఇదిలా ఉంటే బార్సిలోనా ఈవెంట్లో హువాయి కంపెనీ వరల్డ్ ఫస్ట్ 5జీ ఫోల్డబుల్ ఫోన్ HUAWEI Mate X,HUAWEI MateBook X Pro, HUAWEI MateBook 14,HUAWEI MateBook X Pro, HUAWEI MateBook 14,HUAWEI 5G CPE Proలను ఆవిష్కరించింది.


Click it and Unblock the Notifications








