మైఎయిర్‌టెల్ యాప్: అన్ని సర్వీసులు ఇక్కడే

Posted By:

మీ స్మార్ట్‌ఫోన్ డేటా ప్లాన్‌లకు సంబంధించి ఒత్తిడిని తగ్గించుకోవటంతో పాటు డబ్బును ఆదా చేసుకునేందుకు ‘మైఎయిర్‌టెల్ యాప్’ మార్కెట్లో సిద్ధంగా ఉంది. ఈ యాప్‌ను పొందే ప్రతీ ప్రీపెయిడ్ ఎయిర్‌టెల్ వినియోగదారుడు క్యాష్‌బ్యాక్ ఆఫర్లు మొదలుకుని, టాక్‌టైమ్ బెనిఫిట్లు, ఎక్స్‌ట్రా డేటా ఇలా అనేక ప్రయోజనాలను పొందగలుగుతాడు. ఎయిర్‌టెల్ యూజర్లు తమ ఫోన్‌ల ద్వారా అన్ని ఎయిర్‌టెల్ సర్వీసులను సద్వినియోగం చేసుకునేందుకు ‘మై ఎయిర్‌టెల్ యాప్' ఓ సులభతరమైన మార్గం.

మైఎయిర్‌టెల్ యాప్: అన్ని సర్వీసులు ఇక్కడే

మై ఎయిర్‌టెల్ యాప్ అంటే ఏంటి..?

మై ఎయిర్‌టెల్ యాప్ అనేది ఎయిర్‌టెల్ వినియోగదారుల కోసం డిజైన్ చేయబడిన ఓ ఉచిత అప్లికేషన్. ఈ యాప్ ద్వారా ఎయిర్‌టెల్ అందిస్తోన్న అన్ని ఫ్లాగ్‌షిప్ సర్వీసులను మొబైల్, ఫిక్సుడ్ లైన్ ఇంకా డీటీహెచ్ ప్లాట్‌ఫామ్‌ల నుంచి యాక్సెస్ చేసుకుని నచ్చినట్లు వినియోగించుకోవచ్చు.

మైఎయిర్‌టెల్ యాప్: అన్ని సర్వీసులు ఇక్కడే

మై ఎయిర్‌టెల్ యాప్ ద్వారా వినియోగదారులు ఏ విధంగా లబ్థి పొందుతారు..?

ఈ యాప్ ద్వారా వినియోగాదారుడు తను వినియోగించుకున్న ఎయిర్‌టెల్ సర్వీసులకు సంబంధించి అన్ని రకాల బిల్లులను చెల్లించవచ్చు. అంతేకాదు, ‘ఎయిర్‌టెల్ సర్‌ప్రైజెస్' వివిధ క్యాటగిరీలకు సంబంధించి ధర డిస్కౌంట్‌లతో కూడిన కూపన్లతో పాటు ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లకు సంబంధించి బెస్ట్ డీల్స్‌ను ఎయిర్‌టెల్ ఈ యాప్ ద్వారా తమ వినియోగదారులకు అందిస్తుంది.

మైఎయిర్‌టెల్ యాప్: అన్ని సర్వీసులు ఇక్కడే

యాప్‌లోని ‘ఐ వాంట్ టు' టాబ్ ఏ విధంగా స్పందిస్తుంది..?

మైఎయిర్‌టెల్ యాప్‌లోని, ‘ఐ వాంట్ టు' (I Want To) ఫీచర్ ద్వారా ఎయిర్‌టెల్ యూజర్లు తమ అప్లికేషన్ హోమ్ స్ర్కీన్ పై తరచూ తాము చేసే పనులను సెట్ చేసుకోవచ్చు. తమ బిల్ పేమెంట్లకు సంబంధించి షార్ట్‌కట్‌లను సృష్టించుకోవచ్చు. రీచార్జ్, బుయ్ ప్యాక్స్, రికార్డ్ ఏ ప్రోగ్రామ్, ఆర్డర్ గేమ్స్, వ్యూ బ్యాలన్స్, డేటా వినియోగం, చెక్ రిచార్జ్ హిస్టరీ వంటి కార్యకలాపాలను ఈ ట్యాబ్ ద్వారా నిర్వహించుకోవచ్చు. .

మైఎయిర్‌టెల్ యాప్: అన్ని సర్వీసులు ఇక్కడే

షేక్ చేస్తే ఆఫర్ల వివరాలు

తమ ఫోన్‌లలోని మైఎయిర్‌టెల్ అప్లికేషన్ విండోను షేక్ చేయటం ద్వారా యూజర్లు తన ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ నెట్‌వర్క్‌కు సంబంధించి బెస్ట్ రీచార్జ్ డీల్స్‌ను తెలుసుకోగలుగుతారు. ప్రస్తుతానికి ఈ సరికొత్త షేక్ ఫీచర్ ఆండ్రాయిడ్ ఇంకా యాపిల్ ఐఫోన్‌లను మాత్రమే సపోర్ట్ చేస్తుంది.

మైఎయిర్‌టెల్ యాప్: అన్ని సర్వీసులు ఇక్కడే

మైఎయిర్‌టెల్ యాప్ 100 % సురక్షితం. మీ చెల్లింపులకు సంబంధించిన లావాదేవీలను ఈ యాప్ భద్రంగా ఉంచుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మై ఎయిర్‌టెల్ యాప్ ద్వారా సురక్షితమైన ఇంకా వేగవంతమైన పనితీరును ఆస్వాదించవచ్చు.

English summary
myAirtel App: Easiest Way to Manage all Airtel services and Save a Lot of Money. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot