సెల్ పోయిందని అమ్మాయి ఆత్మహత్య, సెన్సిటివ్ అంశం మళ్ళీ తెరపైకి
బంగారు భవిష్యత్తును వదులుకొని విద్యార్థి, యువత తృణప్రాయంగా తమ ప్రాణాల్ని వదులు కుంటున్నారు అందులో ముక్యంగా అమ్మాయిలు.చిన్న కష్టం వచ్చిన దానికి పరిష్కారాం వెతకకుండా బలవన్మరణానికి పాలుపడ్తున్నారు.
బంగారు భవిష్యత్తును వదులుకొని విద్యార్థి, యువత తృణప్రాయంగా తమ ప్రాణాల్ని వదులు కుంటున్నారు అందులో ముక్యంగా అమ్మాయిలు.చిన్న కష్టం వచ్చిన దానికి పరిష్కారాం వెతకకుండా బలవన్మరణానికి పాలుపడ్తున్నారు.ఈ నేపథ్యంలో అలాంటి సంఘటనే ఒకటి గురువారం మైసూరు నగరంలో చోటు చేసుకుంది. సెల్‌ఫోన్ పోగొట్టుకోవడంతో మనస్తాపం చెంది ఒక విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది .ఈ విషాద సంఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే...

స్థానిక నగరంలోని గాంధీనగర్‌కు చెందిన నిఖిత ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది.....
స్థానిక నగరంలోని గాంధీనగర్‌కు చెందిన నిఖిత గాయత్రిపురంలో ఉన్న ఓ ప్రైవేటు పాఠశాలలో టెన్త్ క్లాస్ చదువుతోంది.తన వయస్సు 17 సంవత్సరాలు. బుధవారం సాయంత్రం తన తమ్ముడు బబ్లూతో ఫోన్‌లో మాట్లాడిన తరువాత నిఖిత సెల్‌ఫోన్ కనిపించలేదు.తండ్రి తనకెంతో ప్రేమగా కొనిచ్చిన ఫోన్ కనిపించకపోవడంతో నిఖిత గురువారం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది.ఎన్‌ఆర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.
Image Source : Sakshi

పోయిన మీ స్మార్ట్‌ఫోన్‌ను వెతికిపట్టుకునేందుకు 8 మార్గాలు...
ప్రస్తుత రోజుల్లో స్మార్ట్ ఫోన్ అనేది ప్రతి ఒక్కరి జీవితం లో అత్యవసర పరికరం.వ్యక్తికి సంబంచిన కీలక సమాచారం మొత్తం స్మార్ట్ ఫోన్ లో భద్రపరచడం జరుగుతుంది బ్యాంకింగ్ కి సంబందించిన సమాచారం కానీ నగదు లావాదేవీలకు సంబందించి ఇంకా ఇతర అనేక పనులు ఈ స్మార్ట్ ఫోన్ ద్వారా జరుగుతుంతుంది.ఇలా మన జీవితంలో కీలక పాత్రా పోషిస్తున్న స్మార్ట్ ఫోన్ ఉన్నంటుండి పోగొట్టుకుంటే ఇంకా అంతే సంగతి కొన్ని సందర్భాల్లో వీటికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సిస్తుంది. అలాంటి పరిస్థితుల ఈ 8 మార్గాలు పాటించండి మీ ఫోన్ మళ్ళీ మీరు తిరిగి పొందవచ్చు.

కాల్ లేదా మెసేజ్ చేయండి:
మీ స్మార్ట్ ఫోన్ దొంగలించబడితే లేదా మీరు ఎక్కడైనా పడేసుకుంటే చేయాల్సిన మొదటి పని కాల్ లేదా మెసేజ్ చేయడం. ఒక వేళా మీ ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంటే మెసేజ్ చేయండి, మీ ఫోన్ స్విచ్ ఆన్ అయినా వెంటనే మీకు డెలివరీ రిపోర్ట్ వస్తుంది.

Google Device Manager ద్వారా మీ ఫోన్ ట్రాక్ చేయండి :
మీ స్మార్ట్ ఫోన్ లోని GPS ఎనేబుల్ అయ్యి ఉంటే Google Device Manager ద్వారా ట్రాక్ చేసి లొకేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంది.

మీ ఫోన్ ను లాక్ చేయండి :
ఆండ్రాయిడ్ Device Manager ద్వారా మీ ఫోన్ ను లాక్ చేసుకోవచ్చు. Android Device Manager ఓపెన్ చేసి అందులో "LOCK " అనే ఆప్షన్ ని ఓకే చేస్తే చాలు

మీ ఆండ్రాయిడ్ ఫోన్ లో ఉన్న కాంటాక్ట్స్ రిస్టోర్ చేసుకోండి :
ఈ లింక్ https://www.google.com/contacts/ ఓపెన్ చేసి మీరు రిజిస్టర్ చేసుకున్న google అకౌంట్ తో లాగిన్ అవ్వండి. మీ కాంటాక్ట్స్ లిస్ట్ తిరిగి మళ్లి తెచ్చుకోవచ్చు.మీ కాంటాక్ట్ లిస్ట్ లో ఎరేస్ చేయబడ్డ కాంటాక్ట్స్ కూడా తెలుసుకోవచ్చు.

మీ ఆండ్రాయిడ్ ఫోన్ యొక్క IMEI నెంబర్ ను పునరుద్ధరించండి:
మీ కంప్యూటర్ నుండి మీ Google Dashboard ను సందర్శించండి. ఆండ్రాయిడ్ అనే ఆప్షన్ ను OK చేస్తే మీ పేరు, IMEI నంబర్ మరియు లాస్ట్ ఆక్టివిటీ అక్కడ చూడవచ్చు.

మీ ఆండ్రాయిడ్ ఫోన్ లోని Data ను ఎరేస్ చేయడం:
ఇంతకముందు చెప్పిన విధంగా మీ ఆండ్రాయిడ్ device manager ను enable చేసుకోవాలి అందులోని "erase" అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసినట్లయితే మీ ఫోన్ లోని Data అంతే ఎరేస్ అయిపోతుంది.

పోలీస్ రిపోర్ట్ ఇవ్వండి :
అన్నింటికంటే ముఖ్యమైన పని దొగలించినబడిన లేదా పారేసుకున్న మీ ఫోన్ పై పోలీస్ స్టేషన్ కు వెళ్లి రిపోర్ట్ ఇవ్వండి.


Click it and Unblock the Notifications