సంచలనం రేపుతున్న TCS జీతాలు, ఛైర్మెన్ స్పందన ఇదే

By Gizbot Bureau
|

దేశంలోని ఐటీ దిగ్గజ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) ఉద్యోగుల వార్షిక జీతాలకు సంబంధించి 'ఎకనామిక్ టైమ్స్’ ఈ మధ్య ఓ ఆసక్తికరమైన అంశాన్ని వెల్లడించింది. టీసీఎస్‌లో 100 మంది కంటే ఎక్కువ మంది ఉద్యోగులు 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ.1 కోటి కంటే ఎక్కువ వార్షిక జీతం అందుకుంటున్నట్లు ఆ కథనంలో తెలిపింది. వీరిలో దాదాపు 25 శాతం మంది ఉద్యోగులు ఆ సంస్థలోనే కెరీర్‌ను ప్రారంభించిన వారు కావడం విశేషమని పేర్కొంది.

సంచలనం రేపుతున్న TCS జీతాలు, ఛైర్మెన్ స్పందన ఇదే

2017-18 ఆర్థిక సంవత్సరంలో 91 మంది ఉద్యోగులు రూ.1 కోటి కంటే ఎక్కువ జీతాలు అందుకున్నారు. 2018-19 సంవత్సరానికి ఈ సంఖ్య 103కి చేరింది. సీఈవీ రాజేశ్ గోపినాథన్, సీఓఓ ఎన్జీ సుబ్రహ్మణ్యం, విదేశాల్లో పనిచేసే ఎగ్జిక్యూటివ్‌లను కలుపుకుంటే ఈ సంఖ్య మరింత పెరుగుతుంది. టీసీఎస్‌లో రూ.1 కోటి జీతం అందుకుంటున్న వారిలో అత్యధిక వయస్కులు 72 ఏళ్ల ఉద్యోగికాగా...అతి తక్కువ వయస్కులు 40లలో ఉన్నారు. కాగా ఇన్ఫోసిస్‌లో ఇలా రూ.1 కోటి కంటే ఎక్కువ వార్షిక జీతాలు తీసుకుంటున్న ఉద్యోగుల సంఖ్య 60గా ఉంది.స్టాక్ మార్కెట్ లాభాలకు అనుగుణంగానూ తమ ఉద్యోగులకు టీసీఎస్ ప్రత్యేక ఇన్సెంటివ్స్ ఇస్తుండగా ఇన్ఫోసిస్ అలా ఇవ్వడం లేదు.దీనిపై టీసీఎస్ ఛైర్మన్ స్పందించారు.

ఎన్ చంద్రశేఖరన్ స్పందన

ఎన్ చంద్రశేఖరన్ స్పందన

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) తమ ఉద్యోగులకు భారీ వేతనాలు చెల్లిస్తోందన్న ఆరోపణలు, షేర్ హోల్డర్స్ ఆందోళనలపై ఆ కంపెనీ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ స్పందించారు. టీసీఎస్ వృద్ధికి, అద్భుత ఫలితాలను సాధించిన ఘనత టీసీఎస్ మేనేజ్‌మెంట్‌కు దక్కుతుందని చెప్పారు. ఇందుకు వారికి తగిన ప్రతిఫలం ఇవ్వాలని సంస్థ భావించిందని చెప్పారు. యాన్యువల్ జనరల్ మీటింగ్‌లో సీనియర్ ఉద్యోగులకు ఇచ్చే హైశాలరీస్‌ను లేవనెత్తారు. దీంతో టాప్ మేనేజర్లకు, ఇతరులకు ఇచ్చే కంపన్షేషన్ స్ట్రక్చర్‌ను చంద్రశేఖరన్ సమర్థించారు.

ఎక్కువ వేతనాలు సరికాదు

ఎక్కువ వేతనాలు సరికాదు

కొందరికి ఎక్కువ వేతనాలు చెల్లిస్తుందనే వ్యాఖ్యలు సరికాదని ఆయన అన్నారు. వారికి ఎక్కువగా ఏమీ ఇవ్వడం లేదని చెప్పారు. అలా అయితే వారికి మరింత చెల్లించాలని, కానీ కంపెనీ సంస్థ సంప్రదాయంగానే ముందుకు సాగుతోందన్నారు. కొంతమందికి రిటైర్మెంట్ ఏజ్ దాటినా విధులు నిర్వర్తిస్తున్నారనే అంశంపై చంద్రశేఖరన్ మాట్లాడుతూ... వారికి సముచిత నైపుణ్యం ఉందని, వారి అనుభవానికి గౌరవం ఇవ్వాలన్నారు. ఉద్యోగులను నిలుపుకోవడం ప్రధానంగా తాము ఎక్కువగా దృష్టి పెట్టామని టీసీఎస్ సీఎండీ రాజేష్ గోపినాథన్ చెప్పారు.

 రూ.1కోటికి పైగా వేతనం

రూ.1కోటికి పైగా వేతనం

టీసీఎస్‌లో దాదాపు 100 మంది కంటే ఎక్కువ ఉద్యోగులకు 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ.1 కోటి కంటే ఎక్కువ వేతనం అందుకున్నట్లు నివేదికలు వచ్చాయి. కంపెనీలోనే ఉంటూ, మంచి ప్రతిభ కనబరుస్తున్న వారికి ఎలాంటి రివార్డ్స్ ఇవ్వాలనే అంశంపై బోర్డ్, నామినేషన్ కమిటీలు ఎప్పటికప్పుడు చర్చిస్తాయని చంద్రశేఖరన్ చెప్పారు. కాగా, అలాంటి రివార్డ్స్ అందుకున్న ఉద్యోగుల్లో 25 శాతం మంది ఉద్యోగులు టీసీఎస్‌లోనే కెరీర్ ప్రారంభించినవారు. టీసీఎస్ ఉద్యోగులకే 52 శాతం రెవెన్యూ వెళ్తోందని, ఇది ఎక్కువ అని షేర్ హోల్డర్స్ అభిప్రాయపడుతున్నారు.

టీసీఎస్‌లో వందకు పైగా, ఇన్ఫోసిస్‌లో 60

టీసీఎస్‌లో వందకు పైగా, ఇన్ఫోసిస్‌లో 60

2017-18 ఆర్థిక సంవత్సరంలో TCSలో రూ.కోటిపైగా వేతనం అందుకున్న వారు 91 మంది. 2018-19 సంవత్సరానికి ఈ సంఖ్య 103కి చేరుకుంది. సీఈవీ రాజేశ్ గోపినాథన్, సీఓఓ ఎన్‌జీ సుబ్రహ్మణ్యం, విదేశాల్లో పనిచేసే ఎగ్జిక్యూటివ్‌ల్ని కలుపుకుంటే ఈ సంఖ్య మరింత పెరుగుతుంది. TCS లైఫ్ సైన్సెస్, హెల్త్‌కేర్, పబ్లిక్ సర్వీసెస్ బిజినెస్ హెడ్ డెబాషిస్ ఘోష్ రూ .4.7 కోట్లు సంపాదించారు.

 కోటీశ్వరులు వీరే

కోటీశ్వరులు వీరే

బిజినెస్ అండ్ టెక్నాలజీ సర్వీసెస్ హెడ్ కృష్ణన్ రామానుజం రూ.14.1 కోట్లు. బ్యాంకింగ్ అండ్‌ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ బిజినెస్ హెడ్ కె కృతివాసన్ సంవత్సరానికి రూ.4.3 కోట్లకు పైగా వేతనాన్ని అందుకున్నారు. రూ.1 కోటి జీతం అందుకుంటున్న వారిలో అత్యధిక వయస్కులు ఫైనాన్స్ వైస్ ప్రెసిడెంట్ బరీంద్ర సన్యాల్ (72) ఉద్యోగిగా ఉండగా, అతి తక్కువ వయస్సు కలిగిన వారు 40 ఏళ్లు. ఇన్ఫోసిస్‌లోరూ.1 కోటి కంటే ఎక్కువ వార్షిక వేతనాలు తీసుకుంటున్న ఉద్యోగుల సంఖ్య 60గా ఉంది. స్టాక్ మార్కెట్ లాభాలకు అనుగుణంగానూ తమ ఉద్యోగులకు టీసీఎస్ ప్రత్యేక ఇన్సెంటివ్స్ ఇస్తుంది. కానీ ఇన్ఫోసిస్ మాదిరిగా టిసిఎస్ ఉద్యోగులకు స్టాక్ ఆధారిత ప్రోత్సాహకాలు లభించవు.

Best Mobiles in India

English summary
N Chandrasekaran defends top pay at TCS, allays shareholder fears more

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X