తెలంగాణ కేంద్రానికి వదిలేస్తే చంద్రబాబు ఎందుకు: నాగం జనార్దన్ రెడ్డి

Posted By: Staff

తెలంగాణ కేంద్రానికి వదిలేస్తే చంద్రబాబు ఎందుకు: నాగం జనార్దన్ రెడ్డి

హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అంశం కేంద్రానికి వదిలేసిన తర్వాత ఇక ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ చంద్రబాబునాయుడు ఇక ఉండి ఎందుకని ఆ పార్టీ బహిష్కృత శాసనసభ్యుడు నాగం జనార్దన్ రెడ్డి సోమవారం ప్రశ్నించారు. తెలంగాణ అంశం కేంద్రం నిర్ణయానికి వదిలేయడం సరికాదన్నారు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా టిడిపి తెలంగాణపై స్పష్టమైన వైఖరి ప్రకటించాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ నిర్ణయాన్ని కేంద్రానికి వదిలేసినట్టుగానే గతంలో తీసుకున్న నిర్ణయాలను కూడా టిడిపి కేంద్రాన్ని అడిగే తీసుకుందా అని ఆయన ప్రశ్నించారు.

తెలంగాణ ఉద్యమం ఇప్పుడు నాయకుల చేతుల్లో లేదన్నారు. అది ప్రజల చేతుల్లోకి వెళ్లిందన్నారు. ఉద్యమంలోకి రాని నేతలను ప్రజలే శిక్షిస్తారని హెచ్చరించారు. త్వరలో అన్ని పార్టీలతో కలిసి భేటీ నిర్వహిస్తానని చెప్పారు. తెలంగాణ కోసం తాను పార్టీ జెండానే పక్కన పెట్టానన్నారు. పార్టీ తనను పక్కన పెట్టాలని చూస్తే తాను పార్టీ అధినేతనే ధిక్కరించానని చెప్పుకొచ్చారు. తెలంగాణ కోసం దేనినైనా వదులుకోవడానికి సిద్ధం అని ప్రకటించారు. తెలంగాణపై మహానాడు తీర్మానం చూస్తే టిడిపి తప్పించుకునే ధోరణిలో ఉన్నట్లు కనిపిస్తోందన్నారు.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting