450 అడుగుల ఎత్తు నుంచి కింద పడినా చెక్కు చెదరని ఐఫోన్

థ్రిల్లింగ్ ప్రదేశానికి వెళ్ళినప్పుడు లేదా ఏదైనా థ్రిల్లింగ్ పని చేసేటప్పుడు ఫోన్ లో రికార్డు చేసుకోవాలి అనిపించడం కామన్ గా ప్రతి ఒక్కరు చేసే పనే

By Anil
|

థ్రిల్లింగ్ ప్రదేశానికి వెళ్ళినప్పుడు లేదా ఏదైనా థ్రిల్లింగ్ పని చేసేటప్పుడు ఫోన్ లో రికార్డు చేసుకోవాలి అనిపించడం కామన్ గా ప్రతి ఒక్కరు చేసే పనే .అయితే ఒక్కోసారి ఇలాంటి పనులు చేస్తున్నప్పుడు ఏదైనా తప్పు జరిగితే దానికి భారి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో టర్కీ కు చెందిన ఒక యువతీ తను చేసే థ్రిల్లింగ్ పనిని కెమెరాలో బంధించబోయి వెంట తెచ్చుకున్న యాపిల్ ఫోన్ ను 450 అడుగుల పై నుంచి పొరపాటున జార విడుచుకుంది.గమ్మత్తు ఏంటంటే అంత ఎత్తు నుంచి యాపిల్ ఐఫోన్ కింద పడిన ఎటువంటి స్క్రాచ్ పడకుండా ఏ డామేజ్ అవ్వకుండా సురక్షితంగా ల్యాండ్ అయింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే......

టర్కీ దేశానికి చెందిన Cansel Yildirim...

టర్కీ దేశానికి చెందిన Cansel Yildirim...

టర్కీ దేశానికి చెందిన Cansel Yildirim తన బాయ్ ఫ్రెండ్ తో విహార యాత్రికై ఫ్లోరిడ లోని ఓర్లాండో ప్రదేశానికి చేరింది. అక్కడ గత నెలలో ప్రారంభం అయిన StarFlyer మీద స్వింగ్ రైడ్ చేయాలనీ నిర్ణయించుకుంది. ఇది ప్రపంచంలోనే పొడవైన స్వింగ్ రైడ్ . ఈ స్వింగ్ రైడ్ లో 24 సీట్స్  అందుబాటులో ఉంటాయి. ఈ స్టార్ StarFlyer రైడ్ చేసేటప్పుడు 450 అడుగుల ఎత్తులోని థీమ్ పార్కుపైకి.. అది గాలిలోకి మనుషుల్ని తీసుకువెళుతుంది.

రికార్డు చేసే పనిలో పొరబాటున...

రికార్డు చేసే పనిలో పొరబాటున...

450 అడుగుల గాలిలోకి థీమ్ పార్కు పైకి ఎత్తుతున్నప్పుడు ఆ యువతీ వీడియోను రికార్డు చేయాలనీ నిర్ణయించుకుంది. వీడియో రికార్డు చేస్తున్నప్పుడు పొరబాటున తన యాపిల్ ఐఫోన్ ఫోన్ 450 అడుగుల గాల్లో నుంచి కింద పడేసుకుంది. అంత ఎత్తునుంచి ఫోన్ నుంచి ఫోన్ కింద పడినా ఎటువంటి స్క్రాచ్ మరియు డామేజ్ అవ్వకుండా చాలా చక్కగా చుట్టు పక్కల ప్రదేశం రికార్డు అవుతూ నేలమీదకు చేరింది.

ల్యాండ్ అయ్యాకా...

ల్యాండ్ అయ్యాకా...

అంత ఎత్తునుంచి కిందపడినప్పటికీ ఆ ఫోన్ కి ఏం కాలేదు.ఇంకా ఆసక్తికర అంశం ఏంటంటే ఆ స్పిన్నింగ్ దృశ్యాలన్నింటినీ తన కెమెరా ద్వారా ఐఫోన్ బంధించింది. 

ముక్కలు అవ్వకుండా...

ముక్కలు అవ్వకుండా...

450 అడుగుల ఎత్తు నుంచి గాలిలో లో కింద పడితే ఏ ఫోన్ అయిన రెండు ముక్కలు అవుతుంది.కాగా ఈ యాపిల్ ఐఫోన్ మాత్రం ముక్కలు అవ్వకుండా రికార్డు మోడ్ లో స్పిన్నింగ్ ను అంతా రికార్డు చేస్తూ ఉంది. 

Best Mobiles in India

English summary
A woman was recording on a 450ft ride in Florida when she dropped her phoneThe iPhone continued to record during the fall and only had a single scratch on it Cansel Yildirim was on the StarFlyer, the world's tallest swing ride, which flies 450ft over International Drive in Orlando

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X