రూ.2000 నోట్లలో జీపీఎస్ చిప్స్, ఎంత వరకు నిజం..?

రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తూ మోదీ సర్కార్ తీసుకున్న సంచలనాత్మక నిర్ణయం దేశవ్యాప్తంగా ప్రకంపనలు పుట్టిస్తోంది. రద్దు చేయబడిన నోట్ల స్థానంలో సరికొత్త రూ.500, రూ.2000 నోట్లను త్వరలో తీసుకువస్తామని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. త్వరలో అందుబాటులోకి రానున్న రూ.2000 నోట్లలో 'nano GPS chip'లను నిక్షిప్తం చేస్తున్నారంటూ వాట్సాప్‌లో జోరుగా చర్చ సాగుతోంది.

Read More : జియో నవ్వు కేక.. 600జీబి ఇంటర్నెట్ రూ.500కే?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఎక్కడి నుంచైనా ట్రాక్ చేసే అవకాశం

నోట్లలో పొందుపరిచిన NGC టెక్నాలజీ ఆధారంగా వీటిని ఎక్కడి నుంచైనా ట్రాక్ చేసే వీలుంటుందని ప్రచారం జరుగుతోంది.

ప్రస్తావన ఎక్కడా రాలేదు

రూ.2,000 నోట్ల గురంచి జర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించిన వివరాల్లో nano GPS chip ప్రస్తావన ఎక్కడా రాలేదు. కాబట్టి, ఇటువంటి ప్రచారాల్లో ఎలాంటి వాస్తవం లేదని మీరు గమనించాలి.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మహాత్మా గాంధీ నోట్ల సిరీస్‌లో భాగంగానే

RBI త్వరలో లాంచ్ చేయబోతున్న రూ.2000 కరెన్సీ నోట్ పరిమాణం 66mm x 166mmగా ఉంటుంది. మహాత్మా గాంధీ నోట్ల సిరీస్‌లో భాగంగానే ఈ కొత్త నోట్లను లాంచ్ చేయటం జరిగింది.

నోట్ ముందు భాగంలో ..

నోట్ ముందు భాగంలో మహాత్మా గాంధీ బొమ్మ, వెనుక భాగంలో మన దేశ అంతరిక్ష పరిశోధనల సత్తాను ప్రపంచానికి చాటిన మంగళయాన్ ఉపగ్రహ బొమ్మ తో పాటు స్వచ్ భారత్ నినాదాన్ని ముద్రించారు.

NGC Technology ఎలా పనిచేస్తుంది..?

nano GPS chip (NGC) టెక్నాలజీకి ఎటువంటి పవర్ సోర్స్ అవసరం ఉండదు. ఇది ఒక సిగ్నల్ రిఫ్లెక్టర్‌లా స్పందిస్తుంది. శాటిలైట్ నుంచి సిగ్నల్‌ను అందుకున్న వెంటనే ఈ చిప్ తన ఉన్న లోకేషన్ తాలుకా సమాచారాన్ని శాటిలైట్‌కు చేరవేస్తుంది.

సలువుగా కనిపెట్టే అవకాశం..

NGC చిప్ అమర్చిన కరెన్సీ నోట్లను భూమికి 120 మిటర్ల లోతులో పాతి పెట్టినప్పటికి సలువుగా కనిపెట్టే వీలుంటుంది.

NGC చిప్‌లను అమర్చిన కరెన్సీ నోట్లను

NGC చిప్‌లను అమర్చిన కరెన్సీ నోట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందుబాటులోకి తీసుకురావటం ద్వారా నల్లధనాన్ని సలువుగా నియంత్రించే అవాకాశముంటుంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Nano GPS Chip Forward About Rs.2000 Note Is a Rumor..?. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot