ఐఫోన్-5 కొంటున్నారా.. సమస్యేంటంటే?

Posted By: Prashanth

ఐఫోన్-5 కొంటున్నారా.. సమస్యేంటంటే?

 

ఆపిల్ కొత్త జనరేషన్ స్మార్ట్‌ఫోన్ ‘ఐఫోన్-5’కు దేశీయ మార్కెట్లో అనూహ్య స్పందన లభిస్తోంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఐఫోన్-5 ఫీవర్ మొదలైంది, గ్రే మార్కెట్ ద్వారా దాదాపు 500 ఐఫోన్-5 యూనిట్‌లు అమ్ముడైనట్లు సమాచారం. ప్రీ‌ఆర్డర్‌ల కోసం పలువురు ఆన్‌లైన్ రిటైలర్‌ను సంప్రదిస్తున్నట్లు మార్కెట్ వర్గాలు టాక్.

సమస్యేంటంటే..?

ఐఫోన్-5 నానో సిమ్‌లను మాత్రమే సపోర్ట్ చేస్తుంది. దేశీయంగా ఏ టెలికాం నెట్‌వర్క్ ప్రొవైడర్ నానో సిమ్‌లను ప్రవేశపెట్టలేదు. ఐఫోన్-5 అధికారిక విడుదల అనంతరం వీటిని అందుబాటులోకి తెచ్చే అవకాశముందని మార్కెట్ల్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అయితే, రెగ్యులర్ సిమ్‌ను, నానో సిమ్‌గా మార్చే ‘సిమ్ కట్టర్’ అందుబాటులోకి వచ్చినప్పటికి ఏ మాత్రం పొరపాటు జరిగినా సిమ్ పూర్తిగా ధ్వంసమైపోతుంది. చైనాలో తయారు కాబడిన ఈ సిమ్ కట్టర్‌లు త్వరలో భారత్‌కు రానున్నాయి.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot