లంచం ఇవ్వడాన్ని చట్టబద్దం చేస్తే సరి: నారాయణ మూర్తి

By Super
|
Narayana Murthy
న్యూఢిల్లీ: ఇన్ఫోసిస్ ఛైర్మన్ నారాయణ మూర్తి ప్రముఖ ఎకానమిస్ట్ కౌశిక్ బసుతో మాట్లాడుతూ లంచం ఇవ్వడాన్ని, తీసుకోవడాన్ని లీగల్ చేస్తే ఇండియా బాగుపడుతుందని అన్నారు. వివరాలలోకి వెళితే ఇండియాలో ఏ చిన్న పని జరగాలన్నా లంచం అనేది సర్వసాధారణం. అందుకే మన దేశంలో ఎవరైతే లంచం ఇస్తారో దానిని లీగల్ చేస్తే బాగుంటుందని నారాయణ మూర్తి అభిప్రాయపడ్డారు.

ఇక్కడ మనం లంచం ఇవ్వడాన్ని మాత్రమే లీగల్ చెస్తే గనుక ఎవరైతే లంచం తీసుకుంటున్నారో వారిని చాలా ఈజీగా బయట పెట్టడానికి అవకాశం ఉందని అన్నారు. ఈ విషయాన్ని నారాయణ మూర్తి ఆహ్మాదాబాద్‌లో మీడియాతో ప్రస్తావించారు. ఈ సందర్బంలో మూర్తి మాట్లాడుతూ నాకు తెలిసి ఇది మన దేశంలో తప్పనిసరిగా వర్క్ అవుట్ అవుతుందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ఇండియా అభివృద్ది రేటు పెరగాలంటే లంచగొండితనం పూర్తిగా మారాలి. లంచగొండితనం గనుక ఇండియాలో లేకపోతే మనం తప్పనిసరిగా రెండంకెల వృద్దిరేటుని నమోదు చేయడం జరుగుతుందని అన్నారు. ప్రపంచం మొత్తం లంచం తక్కువగా తీసుకునే దేశాలకు గాను రేటింగ్ ఇస్తే పది పాయింట్లకు గాను 3.3 పాయింట్ల రేటింగ్ తీసుకోని మన ప్రక్ర దేశమైన చైనా టాప్ 10 స్దానాలలో ఉంది. అదే మన ఇండియా 87వ స్దానంలో ఉందన్నారు.

మనిషి తన దైనందిని జీవితంలో ఎక్కడో ఒకచోట లంచం ఇవ్వాల్సిందేనని అన్నారు. ముఖ్యంగా డ్రైవింగ్ లైసెన్స్, ఫోన్ కనెక్షన్స్, పుట్టిన, చనిపోయిన ధృవీకరణ పత్రాల కోసం ఇలా ప్రతిచోటా లంచం తప్పనిసరి వస్తువు అయిపోయిందని తన ఆవేదనను వ్యక్తం చేశారు. గవర్నమెంట్ ఛీప్ ఎకానమిక్ ఎడ్వైజర్ కౌశిక్ బసు ఈ విషయంపై స్పందిస్తూ ఈ ప్రపోజల్‌‍ని లీగల్ చేస్త్ గనుక కామెంటేటర్స్ మనపై విరుసుకపడతారని అన్నారు. ఎప్పుడైతే లంచం ఇవ్వాలని ఒక వ్యక్తి అనుకుంటాడో అవతలి వైపు లంచం తీసుకునే వ్యక్తిని ఈజీగా దీని ద్వారా కనిపెట్టవచ్చని అన్నారు.

ఇలా గనుక చేస్తే రాబోయ కాలంలో ఎవరైనా లంచం తీసుకోవడానికి ఆలోచించడమే కాకుండా భయపడతారని అన్నారు. వచ్చే నెలలో ఇన్ఫోసిస్ ఛైర్మన్ పదవి నుండి నారాయణ మూర్తి రిటైర్ అవ్వనున్నారు. మొత్తం ఆరుగురు బిజినెస్ వేత్తలతో 1981లో కేవలం USD 250లతో ఇన్ఫోసిస్‌ని మూర్తి ప్రారంభించిన ఈరోజు దేశంలో ఓ పెద్ద ఐటి కంపెనీగా ఆవిర్బవించిన విషయం తెలిసిందే.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X