ఘనంగా ఇన్ఫోసిస్‌ మూర్తి కుమారుడు రోహన్, లక్ష్మీ వేణు వివాహాం

Posted By: Super

ఘనంగా ఇన్ఫోసిస్‌ మూర్తి  కుమారుడు రోహన్, లక్ష్మీ వేణు వివాహాం

చెన్నై: ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి కుమారుడు రోహన్‌, టీవీఎస్‌ గ్రూపునకు చెందిన వేణు శ్రీనివాసన్‌ కుమార్తె లక్ష్మీ వేణు వివాహం ఆదివారం నాడు చెన్నై జరిగింది. రోహన్‌మూర్తి (28 ) మైక్రోసాఫ్ట్‌ ఫెల్లోతో పాటు హర్వార్డ్‌ విశ్వవిద్యాలయంలో కంప్యూటర్‌ సైన్స్‌లో పీ.హెచ్‌డీ చేస్తున్నారు. లక్ష్మీ (27) ద్విచక్రవాహనాల దిగ్గజం టీవీఎస్‌ మో టారు కంపెనీ చైర్మన్‌ కుమార్తె. ఈ వివాహానికి దేశంలోని ప్రముఖ రాజకీయ నాయకులతోపాటు సినీతారలు హాజరయ్యారు. బీజీపీ నాయకుడు ఎల్‌ కె అద్వానీ, కేంద్రమంత్రి పి.చిదంబరం, కమల్‌నాథ్‌, ఆనంద్‌శర్మ, జీకే వాసన్‌, కార్పొరేట్‌ దిగ్గజాలు కూడా హాజరయ్యారు.

ఇన్ఫోసిస్‌ మాజీ చైర్మన్‌ ప్రస్తు తం యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడు నందన్‌ నీకేకనీ, ఎయిర్‌ డెక్కన్‌ వ్యవస్థాపకుడు కెప్టెన్‌ గోపీనాథ్‌, గోద్రెజ్‌ గ్రూపు చైర్మన్‌ ఆది గోద్రెజ్‌ హాజరయిన ప్రముఖుల్లో ఉన్నారు.తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన సుమారు 100-150 మంది పండితులు స్తోత్రాలు చదువుతుండగా 10.15 నిమిషాలకు వరుడు రోహన్‌ వధువు లక్ష్మీకి మంగళ సూత్రాన్ని కట్టారు.

వరుడు సిల్క్‌ షేర్వాని ధరించగా, వధువు ఎరుపు రంగు చీర ధరించింది.నారాయణమూర్తి సమాచారం ప్రకారం రోహన్‌ గత సంవత్సరం లక్ష్మీని ప్రతిపా దించాడని.. దీంతో జూన్‌ 2010లోనే వారి నిశ్చితార్థం చేశామని చెప్పారు. లక్ష్మీ యెల్‌ విశ్వవిద్యాల యం ఆర్థికశాస్త్రంలో డిగ్రీ చేస్తున్నట్లు.... యుకెలోని వార్‌విక్‌ విశ్వవిద్యాలయం నుంచే మాన్యుఫ్యా క్చరింగ్‌ మేనేజిమెంట్‌లో పీహెచ్‌డీ చేస్తున్నట్లు చెప్పారు. ఇన్ఫోసిస్‌లో నారాయణమూర్తి కుటుంబానికి 4.5 శాతం వాటా ఉంది. రోహన్‌కు 1.39 శాతం వాటా లేదా 79 లక్షల షేర్లున్నాయి.వివాహం జరిగిన రాధాక్రిష్ణన్‌ సలాయ్‌ ప్రాంతంలో కట్టుదిట్టమైన భధ్రతా ఏర్పాట్లను చేశారు. ఈ కార్యక్రమానికి మీడియాను అనుమతించలేదు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot