గుజరాత్‌లో నారాయణ మూర్తికి జాబ్ ఆఫర్ చేసిన మోడి

Posted By: Super

గుజరాత్‌లో నారాయణ మూర్తికి జాబ్ ఆఫర్ చేసిన మోడి

అహ్మాదాబాద్: ఇన్పోసిస్ ఫౌండర్ నారాయణ మూర్తి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడిని అహ్మాదాబాద్‌లో మర్యాద పూర్వకంగా కలుసుకోవడం జరిగింది. ఇన్ఫోసిస్ ఛైర్మన్‌గా నారాయణ మూర్తి ఆగస్టు 20వ తారీఖున రిటైర్ అవనున్నారు. వీరిద్దరి బేటీ కొంత ప్రాముఖ్యతను సంతంరించుకుంది. ఈ సందర్బంలో గుజరాత్ గవర్నమెంట్ నారాయణ మూర్తి వద్ద ప్రస్తావించినటువంటి యూత్ కోసం ప్రత్యేకంగా వరల్డ్ క్లాస్ సెంటర్‌ని గుజరాత్‌ని స్దాపించడానికి ప్రపంచంలోనే ఉత్తమమైన ఐటి కంపెనీలలో ఒకటైనటువంటి ఇన్పోసిస్ ఛైర్మన్ నారాయణ మూర్తి దీనిపై సానుకూలంగా స్పందించినట్లు ముఖ్యమంత్రి ఆఫీసు ప్రతినిధులు వెల్లడించారు.

ఈ విషయంపై నారాయణ మూర్తి మాట్లాడుతూ ఇలాంటి గొప్ప ప్రాజెక్టులో నన్ను కూడా భాగస్వామిని చేసినందుకు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. గవర్నమెంట్ నిర్ణయం తీసుకున్న తర్వాత నా వంతు సహాకారం కూడా నేను అందిస్తాను. మిగతా విషయాలను గవర్నమెంట్‌తో చర్చిస్తానని తెలిపారు. గతంలో ఇన్పోసిస్ గుజరాత్‌లో ఐటి సెంటర్‌ని స్దాపించడానికి ఆసక్తి చూపిన విషయం మీకు అందిరికి తెలిసిందే. ప్రస్తుతానికి మేము ఇంకా గుజరాత్ గవర్నమెంట్ నుండి ఎటువంటి భూమిని పోందలేదు.

ఈ విషయంపై గుజరాత్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంటే త్వరలోనే ఇక్కడ వరల్డ్ క్లాస్ సెంటర్‌ని స్దాపించడానికి మేము కూడా సానుకూలంగా ఉన్నామని ఆయన అన్నారు. ఇక గుజరాత్ గవర్నమెంట్ త్వరలో స్దాపించనున్న ఈ ఇన్పోసిటి గాందీ నగర్‌కి దగ్గరలో ఉండబోతుందని సమాచారం. సాధారణంగా గుజరాత్ స్టేట్ వేరే ఇతర ఇండస్ట్రీస్‌కి మంచి అనువైన ప్రదేశం. ఈ ఇన్పోసిటీ వల్ల త్వరలో దేశంలో మంచి ఐటి హాబ్‌గా గుజరాత్ కూడా అవతరిస్తుందని ముఖ్యమంత్రి అన్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot