Home
News

గంటకు లక్ష కిలోమీటర్ల వేగంతో భూమి వైపుగా దూసుకొస్తున్న భారీ గ్రహశకలం.. మార్చి 23న ఏం జరగనుంది?

అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ- NASA కీలక విషయాలను వెల్లడించింది. మార్చి 20న నాలుగు ఆస్ట్రాయిడ్‌ల (గహశకలాలు) నుంచి భూమి తృటిలో తప్పించుకుందని తెలిపింది. ఈ నాలుగు గహశకలాల్లో 140 అడుగుల పరిమాణంలో ఉన్న ఆస్ట్రాయిడ్‌ వల్ల భూమికి ఎటువంటి ప్రమాదం జరగలేదని శాస్ట్రవేత్తలు సంతోషం వ్యక్తం చేశారు.

అయితే నాసాకు చెందిన 'భూమికి దగ్గరగా ఉండే వస్తువులపైన అధ్యయనం చేసే సంస్థ'- CNEOS మరో కీలక విషయాన్ని వెల్లడించింది. ఆస్ట్రాయిడ్‌ 2024 EU4 (Asteroid 2024 EU4) పేరున్న భారీ గ్రహశకలం భూమివైపు కదులుతున్నట్లు తెలిపింది. 420 అడుగుల భారీ పరిమాణం గల ఈ గ్రహశకలం భూమివైపు లక్ష కిలోమీటర్ల వేగంతో (101,885 km/h) కదులుతుందని తెలిపింది.

Nasa closely tracking 420 foot asteroid travelling towards earth with one lakh kmph speed news

మార్చి 23వ తేదీన ఈ గ్రహశకలం 2024 EU4 భూమికి అత్యంత దగ్గరగా వస్తుందని తెలిపింది. నాసా లెక్కల ప్రకారం భూమికి 4.5 మిలియన్‌ మైళ్ల దగ్గరగా వస్తుందని తెలిపింది. అయితే ఇది భారీ దూరం అయినా.. ఆస్ట్రాయిడ్‌ దిశలో ఎటువంటి మార్పులు వచ్చినా భూమికి ఇబ్బంది కలిగించే అవకాశం ఉందని అంచనా వేసింది.

నాసా అంచనా ప్రకారం భారీ పరిమాణం కారణంగా ప్రమాదకరమైనదిగా పరిగణించింది. సాధారణంగా 150 అడుగుల కంటే పెద్దగా 4.6 మిలియన్‌ మైళ్ల దూరంలో వచ్చిన అంతరిక్ష వస్తువులను ప్రమాదకరమైనవిగా నాసా భావిస్తోంది. అయితే ఈ ఆస్ట్రాయిడ్‌పైన ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలుస్తోంది. నాసా మాత్రం ఈ ఆస్ట్రాయిడ్‌ దిశను అత్యంత జాగ్రత్తగా పర్యవేక్షిస్తోందని, భూమికి అత్యంత దూరం నుంచి వెళ్తుందని తెలుస్తోంది.

అంతర్జాతీయ ఖగోల సంఘం ( IAU ) ఈ ఆస్ట్రాయిడ్‌లకు పేర్లు పెడుతుంది. గ్రహశకలాలను గుర్తించినప్పుడు వీటి వివరాలను ఈ సంఘానికి పంపిస్తారు. అప్పుడు వాటికి తాత్సాలికంగా పేర్లు నిర్ణయిస్తారు. ఈ అస్ట్రాయిడ్‌ గుర్తించిన సంవత్సరం నెల ఆధారంగా పేర్లు నిర్ణయిస్తారు.

** భారత రక్షణ పరిశోధన. అభివృద్ధి సంస్థ DRDO తయారు చేసిన ప్రత్యేక టెక్నాలజీతో అగ్ని 5 (Agni-5 Missile) రాకెట్‌ను ఇటీవల పరీక్షంచారు. ఈ మిస్సైల్‌ను MIRV (మల్టిపుల్‌ ఇండిపెండెట్లీ టార్గెటబుల్‌ రీఎంట్రీ వెహికల్‌) టెక్నాలజీ ద్వారా ప్రయోగించారు. ఈ ప్రయోగం ద్వారా దీని ద్వారా ఎక్కువ వార్‌హెడ్లను మోసుకెళ్లే సాంకేతిక భారత్‌ సొంతమైంది.

ఇప్పటికే ఈ తరహా సామర్థ్యం అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్‌, బ్రిటన్‌ దేశాలు కలిగి ఉన్నాయి. మల్టిపుల్‌ ఇండిపెండెట్లీ టార్గెటబుల్‌ రీఎంట్రీ వెహికల్‌- MIRV ద్వారా ఏకకాలంలో వివిధ ప్రాంతాల్లోని లక్ష్యాలపై దాడిచేయవచ్చు. సాధారణంగా ఒక మిస్సైల్‌ ద్వారా ఒక ప్రాంతంలోనే దాడి చేయగలం. ఈ మల్టిపుల్‌ ఇండిపెండెట్లీ టార్గెటబుల్‌ రీఎంట్రీ వెహికల్‌ ద్వారా ఏకకాలంలో వివిధ ప్రాంతాల్లో దాడి చేయవచ్చు.

ఈ టెక్నాలజీ ద్వారా ఒకే రాకెట్‌లో ఎక్కువ వార్‌హెడ్లను అమర్చవచ్చు. అంటే ఒకేసారి ఎక్కువ లక్ష్యాలపై గురిపెట్టవచ్చు. వీటిని ప్రయోగించాక.. కొంత దూరం వెళ్లాక వాటి లక్ష్యాలకు అనుగుణంగా విడిపోతాయి. అనంతరం పూర్తి స్వతంత్రంగా వ్యవహరిస్తాయి. నిర్దేశించిన వేగం, లక్ష్యానికి అనుగుణంగా ప్రయాణిస్తాయి.

More from GizBot

Best Mobiles in India

English summary
Nasa closely tracking 420 foot asteroid 2024 EU4 travelling towards earth with one lakh kmph speed
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X