మార్స్ మీదకు హెలికాప్టర్, నాసా సంచలనం

By Gizbot Bureau
|

నాసా మరో అద్భుతం సృష్టించబోతోంది. అంగారక గ్రహం మీదకు ఏకంగా హెలికాప్టర్ నే దించేందుకు రెడీ అవుతోంది. అన్నీ కుదిరితే ars 2020 rover ద్వారా వచ్చే ఎండాకాలంలో tiny Mars Helicopter మార్స్ మీద అడుగుపెట్టనుంది.

మార్స్ మీదకు హెలికాప్టర్, నాసా సంచలనం

 

నాసా ప్లాన్ ప్రకారం వచ్చే ఏడాది సమ్మర్ లో ఫ్లోరిడాలోని Cape Canaveral Air Force Station నుండి యునెటైడ్ అమెరికా Alliance Atlas V rocketని మార్స్ మీదకు పంపనున్నట్లు తెలుస్తోంది. అయితే మార్స్ మీదకు హెలిక్యాప్టర్ వెళ్లడం సాధ్యమేనా అన్న అనుమానాలు ఇప్పటికే కలుగుతున్నాయి. అయితే దీనికి నాసా వేరే విధంగా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. రోవర్ ద్వారా అతి చిన్న హెలికాప్టర్ ను పంపించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

రోవర్‌తోపాటు పైకి

రోవర్‌తోపాటు పైకి

నాసా తొలి మార్స్ హెలిక్యాప్టర్ ఇప్పటికే రెడీ అయ్యింది. ఇది తుది అనుమతుల కోసం వేచి చూస్తోంది. మార్స్ హెలిక్యాప్టర్ ఒక్కటే డైరెక్ట్‌గా అంగారక గ్రహంపైకి వెళ్లలేదు. ఇది చిన్నగా ఉంటుంది. రోవర్‌తోపాటు దీన్ని పంపిస్తారు. దీనిపై పూర్తి వివరాలను నాసా ఇంకా రీవిల్ చేయలేదు. అతి త్వరలోనే దీనికి సంబంధించిన వివరాలను రీవిల్ చేసే అవకాశం ఉంది.

 జీవ జాతి ఏమైనా ఉందా..?

జీవ జాతి ఏమైనా ఉందా..?

ఆ గ్రహంపై రోవర్ ల్యాండ్ అయిన తర్వాత దీని నుంచి నాసా హెలిక్యాప్టర్ వేరవుతుంది. తర్వాతు మార్స్‌పై ఇది ఎగురి అక్కడి వింతలను విశేషాలను క్యాచ్ చేయనుంది. మార్స్ 2020 ప్రయోగం వచ్చే సమ్మర్‌లో జరగనుంది. ఇది 2021 కల్లా అంగారక గ్రహంపైకి వెళ్తుంది. రోవర్ ఆ గ్రహంపైన ఇదివరకు జీవ జాతి ఏమైనా ఉందా? అని పరిశీలిస్తుంది. అక్కడి నమూనాలను సేకరిస్తుంది. ఇక హెలీక్యాప్టర్ పైన ఎగురుతూ డేటా సేకరిస్తుంది.

 ఇన్‌సైట్‌
 

ఇన్‌సైట్‌

ఇదిలా ఉంటే అంగారకుడిపై మొదటిసారి కంపనాలకు సంబంధించిన శబ్దాలు రికార్డయ్యాయి. మార్స్‌పై పరిశోధనలు చేసేందుకు నాసా ప్రయోగించిన ‘ఇన్‌సైట్‌' అంతరిక్ష నౌక ఈ కంపనాల ధ్వనులను గుర్తించింది. ఇన్‌సైట్‌లో అమర్చిన సిస్మిక్‌ ఎక్స్‌పరిమెంట్‌ ఫర్‌ ఇంటీరియర్‌ స్ట్రక్చర్‌(ఎస్‌ఈఐఎస్‌) పరికరం ఈ నెల 6వ తేదీన ఈ కంపనాలను రికార్డు చేసినట్లు నాసా తెలిపింది.

 అసలు కారణాన్ని..

అసలు కారణాన్ని..

ఇప్పటివరకు అంగారకుడిపై మార్చి 14, ఏప్రిల్‌ 10, ఏప్రిల్‌ 11 తేదీల్లో అత్యంత చిన్న చిన్న కంపనాలను కూడా సిసిమోమీటర్‌ గుర్తించింది. అయితే సోలార్‌ 128 కంపనాలు ఇంతకుముందు నాసా చేపట్టిన మూన్‌ మిషన్‌లో కనుగొన్న కంపనాలను పోలి ఉన్నాయి. దీంతో సోలార్‌ 128 కంపనాలపైనే శాస్త్రవేత్తలు ఎక్కువగా దృష్టి కేంద్రీకరించారు. ఈ కంపనాలు ఏర్పడటానికి గల అసలు కారణాన్ని విశ్లేషిస్తున్నారు.

నిజంగా కంపనాలకు సంబంధించినవేనా..

నిజంగా కంపనాలకు సంబంధించినవేనా..

ఈ కంపనాలు చాలా చిన్నవని, ఇటువంటి చిన్న చిన్న కంపనాలను గుర్తించడమే ఇన్‌సైట్‌ నౌక అసలు లక్షమని ఇన్‌సైట్‌ ప్రిన్సిపల్‌ ఇన్వెస్టిగేటర్‌ బ్రూస్‌ బానెర్డ్‌ తెలిపారు. ఇన్‌సైట్‌ బృందానికి 128 కంపనాలు మైలురాయి లాంటిదని, ఇలాంటి సంకేతాల కోసం కొన్ని నెలలుగా తాము ఎదురుచూస్తున్నామని శాస్త్రవేత్త ఫిల్‌ లాగ్నొన్నె తెలిపారు. అయితే ఏప్రిల్‌ 6న నాసా విడుదల చేసిన తాజా శబ్దాలు నిజంగా కంపనాలకు సంబంధించినవేనా అనే విషయంపై శాస్త్రవేత్తలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించి పెద్ద చర్చే నడుస్తోంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
NASA IS TESTING ITS TINY MARS HELICOPTER FOR JULY 2020 LAUNCH

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X