మార్స్‌పై ఉన్న డ‌స్ట్‌పై అధ్య‌యనం చేస్తున్న Perseverance రోవ‌ర్‌!

|

అమెరికాకు చెందిన అంత‌రిక్ష ప‌రిశోధ‌న సంస్థ (NASA) గ‌తేడాది మార్స్ మిష‌న్‌ను ప్ర‌తిష్ఠాత్మ‌కంగా చేపట్టిన విష‌యం తెలిసిందే. ఈ ప్రాజెక్టును విజయవంతం చేయడానికి ఇప్పటికే అనేక ప్రాజెక్టులు పనిచేస్తున్నాయి. ఇందులో మార్స్ ప‌ర్స‌వ‌రెన్స్ (Perseverance) రోవర్ కూడా ఉంది. ఈ రోవ‌ర్ 2021లో ల్యాండింగ్ అయినప్పటి నుండి రాక్ శాంపిల్స్‌ను సేకరిస్తోంది. మార్స్‌పై డస్ట్ తో కూడిన క‌ఠిన‌మైన వాతావ‌ర‌ణం ఉన్న‌ప్ప‌టికీ.. Perseverance రోవ‌ర్ దాని ప‌రిశీల‌న‌కు కొత్త మార్గాల‌ను అన్వేషిస్తోంది.

 
Mars perseverance rover

డ‌స్ట్ డెవిల్స్‌పై Perseverance అధ్య‌య‌నం:
ప‌ర్స‌వ‌రెన్స్‌ రోవర్ అంగారకుడిపై దిగి 200 రోజులకు పైగా గ‌డిచింది. మార్స్‌పై కఠిన‌మైన వాతావ‌ర‌ణం ఉన్న‌ట్లు స‌మాచారం. మార్స్ పై Perseverance రోవ‌ర్ ల్యాండ్ అయిన జెజెరో బిలంలో భారీ సుడుగాలులు, డ‌స్ట్ డెవిల్స్ తో కూడిన క‌ఠిన వాతావ‌ర‌ణం ఉంది. ప్ర‌స్తుతం రోవ‌ర్ ఈ డ‌స్ట్ డెవిల్స్ పై అధ్య‌య‌నం చేస్తోంది. ఇప్ప‌టికే ఇది శాస్త్రవేత్తలకు ప‌లు విష‌యాల‌ను అందించింది. దీనికి సంబంధించి రోవర్ యొక్క 216 రోజుల ప్ర‌యాణం మరియు దాని ఆవిష్కరణలను డాక్యుమెంట్ చేస్తూ, సైన్స్ అడ్వాన్సెస్ జర్నల్‌లో ఓ అబ్జ‌ర్వేష‌న్ ప్రచురించబడింది. గ్రహంపై ఉన్న డస్ట్ ప్రాసెసర్‌ను బాగా అర్థం చేసుకోవడానికి, వాటిని అంచనా వేయడంలో కూడా ఈ రోవ‌ర్ చేసిన ఆవిష్క‌ర‌ణ‌లు బాగా సహాయపడుతున్న‌ట్లు NASA పేర్కొంది. NASA ప‌ర్స‌వ‌రెన్స్ రోవర్ ఈ ప్రాజెక్ట్ లో భాగంగా అనేక సెన్సార్లు మరియు పరికరాలను కలిగి ఉన్న విష‌యం తెలిసిందే. ఈ సెన్సార్ లు మార్స్ వాతావ‌ర‌ణంలోని గాలి, మరియు చుట్టూ ఉన్న సుడిగుండాలను గుర్తించగ‌ల సామ‌ర్థ్యం క‌లిగి ఉన్నాయి.

 
Mars perseverance rover

Perseverance రోవర్ మార్స్ గ్రహం మీద కనీసం నాలుగు సుడిగుండాలను ఎదుర్కొన్న‌ట్లు నాసా నివేదిక పేర్కొంది. ఈ గాలుల వల్ల ఏర్పడిన కొన్ని ధూళి మేఘాలు 4 చదరపు కిలోమీటర్ల మేర పెద్దగా ఉన్నాయి. ఈ ప‌రిస్థితులు శాస్త్రవేత్తలకు ప‌లు ప్ర‌త్యేక‌మైన విష‌యాలపై అవ‌గాహ‌న క‌ల్పించేందుకు వీలు క‌ల్పిస్తుందని నాసా నివేదిక వెల్ల‌డించింది. "మేం అంగారకుడిపై కొత్త ప్రదేశంలో దిగిన ప్రతిసారీ, గ్రహం యొక్క వాతావరణాన్ని బాగా అర్థం చేసుకోవడానికి ఒక అవకాశంగా అది ఉప‌యోగ‌ప‌డుతుంది. జనవరిలో దుమ్ముతో కూడిన‌ తుఫాను ను ఎదుర్కొన్నాం. కానీ మేము ఇప్పటికీ దుమ్ము తో కూడిన‌ సీజన్ కొన‌సాగుతోంది. కాబట్టి మరిన్ని దుమ్ము తో కూడిన‌ తుఫానులను ఎదుర్కొనే అవకాశం ఉంది" అని రోవ‌ర్ అధ్యయనానికి సంబంధించిన కీల‌క స‌భ్యుడు క్లైర్ న్యూమాన్ చెప్పారు.

మార్స్ పైకి వెళ్లిన‌ప్ప‌టి నుంచి రోవ‌ర్ అద్భుతాలు చేస్తోంది:
గ‌తేడాది ఫిబ్ర‌వ‌రిలో అంగార‌క గ్ర‌హం మీదికి నాసా ప‌ర్స‌వ‌రెన్స్ రోవ‌ర్‌ను పంపిన విష‌యం తెలిసిందే. మార్స్‌పై ఉన్న‌ రాక్ నమూనాలను సేకరించడం, భూభాగాన్ని విశ్లేషించడం మరియు రెడ్ ప్లానెట్‌లో పూర్వపు సూక్ష్మజీవుల జీవితానికి సంబంధించిన ఆధారాలను కనుగొనడమే ప్రాథ‌మిక ల‌క్ష్యంగా NASA రోవర్ ను పంపింది. జెజెరో బిలంలో ల్యాండ్ అయిన కొద్ది రోజుల‌కే ఈ రోవ‌ర్ ప‌లు అద్భుతాల‌ను సృష్టించింది.

Mars perseverance rover

అంగారక గ్రహంపై ఇన్‌జెన్యూనిటీ హెలికాప్టర్‌ను నడిపించి అద్భుతాన్ని సృష్టించి రోదసి పరిశోధనల్లో కొత్త చరిత్రను సృష్టించింది. భూమిపై నుంచి నియంత్రిస్తూ భూమిపై కాకుండా మరో గ్రహంపై హెలికాప్టర్‌ను న‌డ‌ప‌డం చరిత్రలో ఇదే ప్ర‌థ‌మం. ఇన్‌జెన్యువిటీ అంగారక గ్రహం ఉపరితలానికి 3 మీటర్ల ఎత్తులో ఎగురుతున్న దృశ్యాలను పర్సవరెన్స్‌ రోవర్‌ 65 మీటర్ల దూరం నుంచి ఫొటోలు తీసి నాసాకు పంపించింది. ఇన్‌జెన్యునిటీ తొలిసారి ఎగిరిన‌పుడు 30 సెకండ్ల పాటు విహరించింది. దీంతో అప్ప‌ట్లో నాసా త‌మ‌ ప్రయోగం విజయవంతం కావడం పట్ల సంతోషం వ్యక్తం చేసింది. ఇన్‌జెన్యునిటి బరువు 1.8 కిలోలు. పర్సవరెన్స్‌తో పాటే దీనిని 28.9 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న మార్స్‌ మీదకు పంపించారు. ఇప్ప‌టికే ఈ రోవ‌ర్ చాలా వ‌ర‌కు మార్స్‌పై అరుదైన చిత్రాల‌ను పంపింది. అంతేకాకుండా రోవ‌ర్ మార్స్ గ్రహం మీద నీటి మంచు ప్రదేశాలను కనుగొన్నట్లు ప‌రిశోధ‌న‌ తెలిపింది. అంగారక గ్రహం మీద చాలా ప్రదేశాలలో నీటి మంచు నిక్షేపాలు ఉపరితలానికి కొంచెం త‌క్కువ‌లో ఉన్నట్లు కనుగొన్నారు.

Best Mobiles in India

English summary
NASA Perseverance Rover Experiences Dust Devils On Mars

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X