2026లో చంద్రునిపై NASA వ్యోమ‌గాములు దిగే అద్భుతమైన‌ సైట్ అదే!

|

చంద్రునిపై ప‌రిశోధ‌న‌ల‌కు గానూ అమెరికా అంత‌రిక్ష ప‌రిశోధ‌న సంస్థ నాసా NASA, ఆర్టెమిస్ మిషన్ (Artemis mission) పేరుతో అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ ను చేప‌ట్టింది. ఈ ప్రాజెక్టులో భాగంగా నాసా (Nasa) వ్యోమ‌గాముల‌ను మరోసారి చంద్రునిపైకి పంపేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తోంది.

 
2026లో చంద్రునిపై NASA వ్యోమ‌గాములు దిగే అద్భుతమైన‌ సైట్ అదే!

దీని కోసం, చంద్రుని ఉపరితలంపై రాకెట్ ల్యాండింగ్ మ‌రియు పార్కింగ్ ఎక్క‌డ చేయాల‌నే విష‌యంపై ముంద‌డుగు వేసింది. చంద్రుని దక్షిణ ధ్రువంలో 13 ల్యాండింగ్ సైట్‌లను నాసా (Nasa) ఎంపిక చేసింది.

LRO సాయంతో ప్ర‌దేశాల ఎంపిక‌!

LRO సాయంతో ప్ర‌దేశాల ఎంపిక‌!

వ్యోమ‌గాములు చంద్రునిపై 2026 లో దిగ‌నున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం వారు దిగేందుకు అవకాశం ఉన్న కొన్ని ప్రదేశాలను నాసా ఎంపిక చేసింది. ఈ ప్రాంతాలు LRO లేదా లూనార్ రికనైసెన్స్ ఆర్బిటర్ నుండి డేటాను ఉపయోగించి ఎంపిక చేయబడ్డాయి. ఈ పార్కింగ్ స్పాట్‌లలో ప్రతి ఒక్కటి 10 నుండి 10 మైళ్ళు (15 నుండి 15 కిలోమీటర్లు) ఉంటుంది. అవి దాదాపు 328 అడుగుల (100 మీటర్లు) వ్యాసార్థంతో బహుళ ల్యాండింగ్ సైట్‌లను కలిగి ఉంటాయి.

LRO చంద్రునిపై 2009లో ల్యాండింగ్ అయినప్పటి నుండి అక్క‌డి మ్యాపింగ్ మరియు ఇంటెల్‌ను సేకరిస్తోంది. ఈ చంద్రుని దక్షిణ ధ్రువంలో నీడ ఉన్న ప్రాంతాలలో నీటి మంచు జాడ‌లు ఉన్న‌ట్లు NASA భావిస్తోంది. గమనించదగ్గ విషయం ఏమిటంటే, చంద్రునిపై ఉన్న దక్షిణ ధ్రువంలో కొన్ని ప్రాంతాలు శాశ్వతంగా చీకటిలో ఉంటాయి మరియు మరికొన్ని స్థిరమైన సూర్యకాంతిలో ఉంటాయి.

"సగటు కంటే ఎక్కువ కాంతి ఉన్న ప్రదేశాలను కనుగొనడం వల్ల శక్తి మరియు ఉష్ణ నియంత్రణ కోసం కాంతిని ఉపయోగించుకునే వ్యవస్థలను రూపొందించడానికి మాకు వీలు కల్పిస్తుంది" అని నాసాలోని ప్రధాన అన్వేషణ శాస్త్రవేత్త జాకబ్ బ్లీచర్ విలేకరుల సమావేశంలో అన్నారు. చంద్రునిపై దక్షిణ ధృవం పై దిగేందుకు అనేక ప్రయోజనాలు ఉన్నప్పటికీ, వ్యోమగాములు చంద్రుని ఉపరితలంపై దిగే ముందు NASA అనేక సాంకేతిక వివరాలను జాగ్రత్తగా చూసుకోవాలి అని ఆయ‌న తెలిపారు.

అపోలో మిష‌న్ స్పాట్‌లోకి వెళ్ల‌డం లేదు!
 

అపోలో మిష‌న్ స్పాట్‌లోకి వెళ్ల‌డం లేదు!

అపోలో మిషన్ చేప‌ట్టిన దశాబ్దాల కాలం తర్వాత నాసా ఆర్టెమిస్ మిషన్ ద్వారా చంద్రునిపైకి వ్యోమగాములను పంపనుంది. అయితే ఈసారి, అపోలో వ్యోమగాములు వినియోగించిన ల్యాండింగ్ స్పాట్‌ను నాసా ఉపయోగించదు. "అపోలో ల్యాండింగ్ సైట్‌లు మధ్య భాగంలో ఉండేవి. ఇప్పుడు మేము పూర్తిగా భిన్నమైన, విభిన్నమైన మరియు పురాతన భౌగోళిక భూభాగాల్లోకి వెళ్తున్నాము" అని ఆర్టెమిస్ లూనార్ సైన్స్ లీడ్ సారా నోబుల్ వివరించారు.

ఆర్టెమిస్ మిషన్ అనేక ఇతర అంశాలలో విభిన్నంగా ఉంది. ఎందుకంటే ఇది చంద్రునిపై మానవ ఉనికిని మరింతగా స్థాపించడానికి మరియు నిలబెట్టడానికి ప్లాన్ చేస్తుంది, ఇది లోతైన అంతరిక్ష అన్వేషణను మరింత పెంచుతుంది. NASA మిషన్‌లో భాగంగా చంద్రునిపైకి రెండవ పురుషుడు మరియు మొదటి మ‌హిళ‌ను పంపుతున్నారు.

మ‌రోవైపు, నాసా ఇప్ప‌టికే మార్స్‌పైకి పంపిన Perseverance రోవ‌ర్ ఏం చేస్తుందో కూడా తెలుసుకుందాం:

మ‌రోవైపు, నాసా ఇప్ప‌టికే మార్స్‌పైకి పంపిన Perseverance రోవ‌ర్ ఏం చేస్తుందో కూడా తెలుసుకుందాం:

మ‌రోవైపు నాసా ఇప్ప‌టికే మార్స్‌పై చేప‌ట్టిన ప్ర‌తిష్ఠాత్మ‌క ప్రాజెక్ట్ లో భాగంగా అంగార‌కుడిపై ల్యాండ్ అయిన Perseverance రోవ‌ర్ డ‌స్ట్ డెవిల్స్ పై అధ్య‌యనం చేస్తున్నట్లు నాసా గ‌త నెల‌లో ప్ర‌క‌టించింది.
ఈ రోవ‌ర్ 2021లో ల్యాండింగ్ అయినప్పటి నుండి రాక్ శాంపిల్స్‌ను సేకరిస్తోంది. మార్స్‌పై డస్ట్ తో కూడిన క‌ఠిన‌మైన వాతావ‌ర‌ణం ఉన్న‌ప్ప‌టికీ.. Perseverance రోవ‌ర్ దాని ప‌రిశీల‌న‌కు కొత్త మార్గాల‌ను అన్వేషిస్తోంది.

డ‌స్ట్ డెవిల్స్‌పై Perseverance అధ్య‌య‌నం:

డ‌స్ట్ డెవిల్స్‌పై Perseverance అధ్య‌య‌నం:

ప‌ర్స‌వ‌రెన్స్‌ రోవర్ అంగారకుడిపై దిగి 200 రోజులకు పైగా గ‌డిచింది. మార్స్‌పై కఠిన‌మైన వాతావ‌ర‌ణం ఉన్న‌ట్లు స‌మాచారం. మార్స్ పై Perseverance రోవ‌ర్ ల్యాండ్ అయిన జెజెరో బిలంలో భారీ సుడుగాలులు, డ‌స్ట్ డెవిల్స్ తో కూడిన క‌ఠిన వాతావ‌ర‌ణం ఉంది. ప్ర‌స్తుతం రోవ‌ర్ ఈ డ‌స్ట్ డెవిల్స్ పై అధ్య‌య‌నం చేస్తోంది. ఇప్ప‌టికే ఇది శాస్త్రవేత్తలకు ప‌లు విష‌యాల‌ను అందించింది.

దీనికి సంబంధించి రోవర్ యొక్క 216 రోజుల ప్ర‌యాణం మరియు దాని ఆవిష్కరణలను డాక్యుమెంట్ చేస్తూ, సైన్స్ అడ్వాన్సెస్ జర్నల్‌లో ఓ అబ్జ‌ర్వేష‌న్ ప్రచురించబడింది. గ్రహంపై ఉన్న డస్ట్ ప్రాసెసర్‌ను బాగా అర్థం చేసుకోవడానికి, వాటిని అంచనా వేయడంలో కూడా ఈ రోవ‌ర్ చేసిన ఆవిష్క‌ర‌ణ‌లు బాగా సహాయపడుతున్న‌ట్లు NASA పేర్కొంది. NASA ప‌ర్స‌వ‌రెన్స్ రోవర్ ఈ ప్రాజెక్ట్ లో భాగంగా అనేక సెన్సార్లు మరియు పరికరాలను కలిగి ఉన్న విష‌యం తెలిసిందే. ఈ సెన్సార్ లు మార్స్ వాతావ‌ర‌ణంలోని గాలి, మరియు చుట్టూ ఉన్న సుడిగుండాలను గుర్తించగ‌ల సామ‌ర్థ్యం క‌లిగి ఉన్నాయి.

"మేం అంగారకుడిపై కొత్త ప్రదేశంలో దిగిన ప్రతిసారీ, గ్రహం యొక్క వాతావరణాన్ని బాగా అర్థం చేసుకోవడానికి ఒక అవకాశంగా అది ఉప‌యోగ‌ప‌డుతుంది. జనవరిలో దుమ్ముతో కూడిన‌ తుఫాను ను ఎదుర్కొన్నాం. కానీ మేము ఇప్పటికీ దుమ్ము తో కూడిన‌ సీజన్ కొన‌సాగుతోంది. కాబట్టి మరిన్ని దుమ్ము తో కూడిన‌ తుఫానులను ఎదుర్కొనే అవకాశం ఉంది" అని రోవ‌ర్ అధ్యయనానికి సంబంధించిన కీల‌క స‌భ్యుడు క్లైర్ న్యూమాన్ చెప్పారు.

మార్స్ పైకి వెళ్లిన‌ప్ప‌టి నుంచి రోవ‌ర్ అద్భుతాలు చేస్తోంది:

మార్స్ పైకి వెళ్లిన‌ప్ప‌టి నుంచి రోవ‌ర్ అద్భుతాలు చేస్తోంది:

గ‌తేడాది ఫిబ్ర‌వ‌రిలో అంగార‌క గ్ర‌హం మీదికి నాసా ప‌ర్స‌వ‌రెన్స్ రోవ‌ర్‌ను పంపిన విష‌యం తెలిసిందే. మార్స్‌పై ఉన్న‌ రాక్ నమూనాలను సేకరించడం, భూభాగాన్ని విశ్లేషించడం మరియు రెడ్ ప్లానెట్‌లో పూర్వపు సూక్ష్మజీవుల జీవితానికి సంబంధించిన ఆధారాలను కనుగొనడమే ప్రాథ‌మిక ల‌క్ష్యంగా NASA రోవర్ ను పంపింది. జెజెరో బిలంలో ల్యాండ్ అయిన కొద్ది రోజుల‌కే ఈ రోవ‌ర్ ప‌లు అద్భుతాల‌ను సృష్టించింది.

అంగారక గ్రహంపై ఇన్‌జెన్యూనిటీ హెలికాప్టర్‌ను నడిపించి అద్భుతాన్ని సృష్టించి రోదసి పరిశోధనల్లో కొత్త చరిత్రను సృష్టించింది. భూమిపై నుంచి నియంత్రిస్తూ భూమిపై కాకుండా మరో గ్రహంపై హెలికాప్టర్‌ను న‌డ‌ప‌డం చరిత్రలో ఇదే ప్ర‌థ‌మం. ఇన్‌జెన్యువిటీ అంగారక గ్రహం ఉపరితలానికి 3 మీటర్ల ఎత్తులో ఎగురుతున్న దృశ్యాలను పర్సవరెన్స్‌ రోవర్‌ 65 మీటర్ల దూరం నుంచి ఫొటోలు తీసి నాసాకు పంపించింది. ఇన్‌జెన్యునిటీ తొలిసారి ఎగిరిన‌పుడు 30 సెకండ్ల పాటు విహరించింది.

Best Mobiles in India

Read more about:
English summary
NASA Picks Parking Spots For Artemis Mission; How Is It Different From The Apollo Landing?

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X