NASA మార్స్ రోవర్ ల్యాండింగ్..! సంచలన విషయాలు వెలుగులోకి.

By Gizbot Bureau
|

మార్స్ పై జీవం ఉందా లేదా అని తెలుసుకోవడానికి నాసా పంపిన పర్సెవరెన్స్ అనే రోవర్ ఎట్టకేలకు అంగారక గ్రహంపై దిగింది. మార్స్ (అంగారక గ్రహం) పై తమ రోవర్ దిగిన దృశ్యాల తాలూకు వీడియోను నాసా విడుదల చేసింది. 'పర్సే వెరెన్స్ ' అనే ఈ రోవర్ అరుణగ్రహం పై దిగుతూ వేర్వేరు శబ్దాలతో కూడిన గాలి రికార్డింగులను కూడా వినిపించిందని నాసా రీసెర్చర్లు తెలిపారు. ఈ రోవర్ దిగేముందు నారింజ రంగుతో కూడిన పారాచ్యూట్ ని కిందికి వదిలింది. గాలి శబ్దాలను రోవర్ లోని కెమెరా క్యాప్చర్ చేయగలిగిందని శాస్త్రజ్ఞులు తెలిపారు.

 

మార్స్ పై రోవర్ దిగుతుండగా

మార్స్ పై రోవర్ దిగుతుండగా

అయితే మార్స్ పై రోవర్ దిగుతుండగా ఓ మైక్రోఫోన్ పని చేయలేదని తెలిసింది. 10 సెకండ్ల పాటు గాలి శబ్దం వినబడినట్టు వారు చెప్పారు. అటు ఈ రికార్డింగును భూమికి పంపామని కెమెరా లీడ్ ఇంజనీర్ దవే గ్రుయెల్ తెలిపారు. మార్స్ పై దుమ్ము రేగుతున్న జెజెరో అనే క్రేటర్ ని రోవర్ టచ్ చేసిందని, ఇది ల్యాండ్ అవుతుండగా గాలి శబ్దాలను క్యాప్చర్ చేయడం ఇదే మొదటిసారి అని నాసా జెట్ ప్రొపెల్షన్ ల్యాబ్ డైరెక్టర్ మైఖేల్ వాట్ కిన్స్ తెలిపారు. ఇది ఇమేజింగ్ వీడియో అన్నారు.

Also Read:ఆర్టెమిస్ III మిషన్ వ్యోమగాముల లక్ష్యాలను నిర్దేశించిన NASA...Also Read:ఆర్టెమిస్ III మిషన్ వ్యోమగాముల లక్ష్యాలను నిర్దేశించిన NASA...

3 నిముషాల 25 సెకండ్ల వీడియో
 

3 నిముషాల 25 సెకండ్ల వీడియో

ఇది 3 నిముషాల 25 సెకండ్ల పాటు ఉంది. గత ఏడాది జులై 30 న నాసా ఈ రోవర్ ను లాంచ్ చేసింది. సమీప భవిష్యత్తులో ఈ విధమైన మరిన్ని వీడియోలను తాము పంపే అవకాశాలు ఉన్నాయని ఈ సంస్థ పేర్కొంది. యోలో రోవర్ ల్యాండ్ అవుతున్న టైంలో అంగారకుడిపై దుమ్ము లేవడం, తాళ్ల సాయంతో స్పేస్ షిప్ నుంచి రోవర్ కిందకి దిగడం స్పష్టంగా కనిపించింది. ఈ అద్భుతమైన వీడియోను క్యాప్చర్ చేయడానికి రికార్డు స్థాయిలో 25 కెమెరాలను వాడారు సైంటిస్టులు. రోవర్ శుక్రవారమే అంగారకుడిపైకి చేరగా రీసెంట్ గా నాసా. ఈ వీడియో రిలీజ్ చేసింది.

ఏడు నెలలు అంతరిక్షంలో..

ఏడు నెలలు అంతరిక్షంలో..

ఈ రోబోటిక్ వాహనం దాదాపు ఏడు నెలలు అంతరిక్షంలో 293 మిలియన్ మైళ్ళు (472 మిలియన్ కిమీ) ప్రయాణించింది. భూమిపై జీవించే కొన్ని జీవులను మార్స్ (అంగారక గ్రహం లేదా అరుణ గ్రహం లేదా కుజ గ్రహం లేదా మంగళ గ్రహం) చెంతకు తీసుకువెళ్తే... ఆ జీవులు కొంతకాలం పాటూ అక్కడ జీవించగలవు అని అమెరికా స్పేస్ రీసెర్చ్ సెంటర్ - నాసా (NASA) తెలిపింది. ఈ కొత్త అధ్యయనం... భూమి కాకుండా మనుషులు బతికేందుకు అవకాశం ఉన్న ఇతర గ్రహాలను గుర్తించేందుకు వీలు కల్పిస్తోందని శాస్త్రవేత్తలు తెలిపారు.

Also Read: చంద్రుడి మీద మానవ మనుగడకు రేడియేషన్ వివరాలను అంచనా వేస్తున్న NASAAlso Read: చంద్రుడి మీద మానవ మనుగడకు రేడియేషన్ వివరాలను అంచనా వేస్తున్న NASA

మార్స్‌పైనా బతికేందుకు అవకాశం

మార్స్‌పైనా బతికేందుకు అవకాశం

నాసాతో కలిసి జర్మన్ ఏరోస్పేస్ సెంటర్ (DLR) సైంటిస్టులు ప్రత్యేక సూక్ష్మక్రిములపై పరీక్షలు జరిపారు. సాధారణంగా మార్స్‌పై పగటి వేళ ఉష్ణోగ్రతలు 20 డిగ్రీల సెల్సియస్ ఉంటాయి. అదే రాత్రి వేళ మైనస్ 60 డిగ్రీల సెల్సియస్ ఉంటాయి. పగటివేళ ఉష్ణోగ్రతలను మనం తట్టుకోగలం కానీ... రాత్రివేళ అస్సలు భరించలేం. తాజా పరిశోధనలో శాస్త్రవేత్తలు.... మార్స్‌పై ఉండే తరహా ఉష్ణోగ్రతలను భూమిపై ప్రత్యేక బెలూన్లలో ఏర్పాటు చేసి... అక్కడ కొన్ని రకాల సూక్ష్మజీవుల్ని (బ్యాక్టీరియా, ఫంగస్) ప్రవేశపెట్టారు. ఆ బెలూన్లను గాల్లో వదిలారు. అవి భూమి నుంచి పైకి వెళ్లాయి. అలాంటి వాతావరణంలో అవి బతకగలిగితే... అవి మార్స్‌పైనా బతగగలవు అని భావించారు. కొంతసేపు అవి బతకగలుగుతున్నాయని తేల్చారు. ఈ అధ్యయన వివరాలను ఫ్రాన్షియర్స్ ఇన్ మైక్రో బయాలజీలో పబ్లిష్ చేశారు.

మనుషులకు హాని తలపెట్టే అవకాశాలు

మనుషులకు హాని తలపెట్టే అవకాశాలు

భవిష్యత్తులో రెడ్ ప్లానెట్ పైకి మనుషులు వెళ్లినప్పుడు వారితోపాటూ సూక్ష్మ జీవులు కూడా అక్కడ బతికే అవకాశాలు ఉంటాయని తాజాగా శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. అలాగే. అలాంటి సూక్ష్మజీవులు మనుషులకు హాని తలపెట్టే అవకాశాలు కూడా ఉంటాయంటున్నారు. మరికొన్ని మైక్రోబ్స్... ఆహారాన్ని ఉత్పత్తి చేయడానికీ, కొన్ని రకాల పదార్థాలను సరఫరా చేయడానికి పనికొస్తాయని అంటున్నారు. భూమి నుంచి వేరే గ్రహానికి వెళ్లినప్పుడు సూక్ష్మజీవులు, బ్యాక్టీరియాతో ఎంతో అవసరం ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Best Mobiles in India

English summary
NASA’s Perseverance rover makes historic Mars landing, Interesting Facts.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X