Home
News

చంద్రుడిని జల్లెడ పట్టేది మేమే, దాన్ని తవ్వేది మేమే

By Gizbot Bureau

నాసా ప్రయోగించిన అపోలో 50 ఏళ్ల ప్రస్థానం తరవాత ఇన్నాళ్లకు మనం చంద్రయాన్‌ను ప్రవేశ పెట్టాం. దీంతో భారత అంతరిక్షరంగ చరిత్రలో మరో అద్భుతం ఆవిష్కృతమైంది. పరిశోధక పరికరాలతోపాటు 130 కోట్ల మంది భారతీయుల ఆశలు, ఆకాంక్షలను మోస్తూ 'చంద్రయాన్‌-2’ నిర్ణీత కక్ష్యలోకి చేరింది.

NASA says we will start harvesting precious resources like platinum from the moon this century

బాహుబలి వాహకనౌక 'జీఎస్‌ఎల్‌వీ మార్క్‌3-ఎం1’ తనపై ఇస్రో ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ.. వ్యోమనౌకను రోదసిలోకి మోసుకెళ్లింది.భూకక్ష్యలోకి దాన్ని చేర్చింది. దీంతో జాబిల్లిపైకి మనదేశం చేపట్టిన ప్రతిష్ఠాత్మక రెండో యాత్రలో తొలి అంకం విజయవంతంగా పూర్తయింది. దీంతో అమెరికా ఉలిక్కిపడినట్లు తెలుస్తోంది. ఇండియా కన్నా ముందు చంద్రుని మీద తవ్వకాల జరుపుతామని నాసా అధినేత జిమ్ బ్రిడెన్‌స్టైన్ మీడియా ముందుకు వచ్చి చెప్పారు. దీనికోసం ఫండ్స్ సేకరిస్తున్నామని ఆయన తెలిపారు.

చంద్రుడి ఉపరితలం మొత్తం తవ్వించేందుకు

చంద్రుడి ఉపరితలం మొత్తం తవ్వించేందుకు

ఈ శతాబ్దంలో ప్లాటినం వంటి విలువైన పదార్థాల కోసం మేము చంద్రుడి ఉపరితలం మొత్తం తవ్వించేందుకు ఏర్పాటు చేస్తున్నామని సిఎన్‌బిసి ఇంటర్వ్యూలో ఆయన తెలిపారు. మునుపెన్నడూ లభించని పదార్థాల శ్రేణిని అన్‌లాక్ చేయడానికి సాంకేతిక పరిజ్ఞానంపై అదనపు ఆసక్తి, కొత్త పురోగతులు సహాయపడతాయని నాసా అధినేత జిమ్ బ్రిడెన్‌స్టైన్ సిఎన్‌బిసి ఇంటర్వ్యూలో తెలిపారు.

 శాశ్వత ఉనికిని నెలకొల్పడానికి

శాశ్వత ఉనికిని నెలకొల్పడానికి

మానవులకు మునుపెన్నడూ అందుబాటులో లేని పదార్థాల శ్రేణిని అన్‌లాక్ చేయడానికి ఇవి సహయపడతాయని ఇందుకోసం సరికొత్త టెక్నాలజీ రెడీగా ఉందని తెలిపారు. అంతేకాకుండా అక్కడ శాశ్వత ఉనికిని నెలకొల్పడానికి సహాయం చేయాలనే ఉద్దేశంతో అక్కడ తవ్వకాలను చేపడుతోంది. తద్వారా మానవ నివాసానికి అమోదయోగ్యమైన వాటిని కనుగొనేందుకు ప్రయత్నిస్తోంది.

పెట్టుబడి పెడితే

పెట్టుబడి పెడితే

ఈ ప్రాజెక్టు చాలా ఖర్చతో కూడుకున్నదని ఆసక్తి కలిగిన బిలియనీర్స్ దీనిపై పెట్టుబడి పెడితే ఇంకా ప్రయోజనకరంగా ఉంటుందని తెలిపారు. Amazon CEO, Jeff Bezos, and SpaceX's Elon Mus లాంటి బిలియనీర్స్ ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యం కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

 ప్లాటినం గ్రూప్ లోహాలు

ప్లాటినం గ్రూప్ లోహాలు

చంద్రునిపై టన్నులకు టన్నుల ప్లాటినం గ్రూప్ లోహాలు ఉండవచ్చు, అరుదైన-భూమి లోహాలు, ఇవి భూమిపై ఎంతో విలువైనవి" అని బ్రిడెన్‌స్టైన్ అవుట్‌లెట్‌కు చెప్పారు.ప్లాటినంతో పాటు, శాస్త్రవేత్తలు చంద్రుడిని సిలికాన్‌తో లోడ్ చేయవచ్చని చెప్పారు. అలాగే టైటానియం మరియు అల్యూమినియం భవనాలను నిర్మించడానికి ఏర్పాట్లు చేయనున్నారు.

 2028 నాటి కల్లా

2028 నాటి కల్లా

2028 నాటి కల్లా చంద్రునిపై మనిషి స్థిరమైన ఉనికిని చాటుతాం. అమెరికా సంస్థలు, అంతర్జాతీయ భాగస్వాము లతో కలిసి ఈ లక్ష్యాన్ని చేరుకుంటాం అని నాసా అధిపతి జిమ్‌ బ్రిడెన్‌స్టైన్‌ వివరించారు. ఇప్పటికే కెనడీ స్పేస్‌ సెంటర్‌లో ఇంజినీర్లు ఒరాయన్‌ క్రతువులో నిమగ్నమయ్యారని ప్రకటించారు. 2024లో చంద్రునిపైకి వ్యోమగాములను పంపడానికి ముందస్తుగా... వచ్చే ఏడాది ఒరాయన్‌, ఎస్‌ఎల్‌ఎస్‌లను అమెరికా ప్రయోగాత్మకంగా అంతరిక్షంలోకి పంపి, పరీక్షించనుందని వెల్లడించింది.

 వ్యోమగాములు చంద్రుడిపైకి వెళ్లి

వ్యోమగాములు చంద్రుడిపైకి వెళ్లి

ఇన్నాళ్లూ అమెరికా గడ్డ విూద నుంచి రోదసిలోకి రాకెట్లు పంపుతున్నాంగానీ... త్వరలోనే అంతరిక్ష పరిశోధకులను చంద్రునిపైకి పంపి అక్కడే సాంకేతిక, వనరుల అభివృద్ధి చేపడతామని అమెరికా ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ వెల్లడించారు. ఈసారి మా వ్యోమగాములు చంద్రుడిపైకి వెళ్లి అక్కడే ఉండి మా ఉనికిని చాటుతాం. సరికొత్త సాంకేతికతను అభివృద్ధి చేస్తాం. చంద్రుని పైనుంచి అంగారకుడికి మా ప్రయాణం కొనసాగుతుందని ఆయన వివరించారు.

 2024లో చంద్రుడిపైకి

2024లో చంద్రుడిపైకి

ఆర్టెమిస్‌ కార్యక్రమం ద్వారా 2024లో చంద్రుడిపైకి పరిశోధకులను పంపనున్న నాసా వారిని అక్కడే ఉంచనున్నట్టు తెలుస్తోంది. తర్వాతి దశలో భాగంగా చంద్రుని పైనుంచి అంగారకుడి వద్దకు రాకెట్‌ను పంపనుందని ప్రకటించుకుంది. అయితే దీనికి ఇంతకాలం ఎందుకు తీసుకుందన్నదే ప్రశ్న. సాధారణంగా నాసా ప్రయోగాలు చురుకుగా ఉంటాయి. భారత్‌ జాబిల్లి యాత్రను చేపట్టిన వెంటనే ఈ ప్రకటన వెలువడడం గమనార్హం.

More from GizBot

Best Mobiles in India

English summary
NASA says we will start harvesting precious resources like platinum from the moon 'this century
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X