2012, డిసెంబర్ 21... యుగాంతం లేదు!

Posted By: Staff

2012, డిసెంబర్ 21... యుగాంతం లేదు!

 

 

2012...డిసెంబర్ 12, ప్రపంచం అంతిరించిపోనుందా?, ఓ మహా ప్రళయం భూమిని  ధ్వంసం చేయనుందా..?, యుగాంతం తప్పదా..?, మానవాళి మనుగడ ప్రశ్నార్థకమేనా..?  యుగాంతం పై పుకార్లు షికార్లు చేస్తున్న నేపధ్యంలో ఇలా అనేక సందేహాలు చాల మంది మనసులలో పాతుకుపోయాయి. ఈ సందేహాలను నివృత్తి చేస్తూ అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) స్పష్టమైన ప్రకటన చేసింది.  డిసెంబర్ 21తో ప్రపంచం అంతరించిపోదని.. భూ గ్రహం మరో 400 కోట్ల సంవత్సరాల పాటు నిక్షేపంగా ఉంటుందని నాసా శాస్త్రవేత్తలు హామి ఇస్తున్నారు.

యుగాంతం పై నడుస్తున్న వాదనల్లో భాగంగా  'నిబిరు' అనే గ్రహం భూమి వైపుగా దూసుకు వచ్చి ఢీకొడుతుందని ఉన్న సంగతి తెలిసిందే. అయితే, "వాస్తవానికి ఈ విపత్తు 2003 మే నెలలోనే వస్తుందని అంచనా వేశారు. అప్పుడేమీ రాకపోయేసరికి అది కాస్తా ప్రాచీన మాయన్ కేలండర్‌లో ఒక చక్రం ముగిసే 2012 డిసెంబర్ 21వ తేదీకి ముడివేసి.. ఆ రోజుతో ప్రపంచం అంతరించి పోతుందని అనుకుంటున్నారు'' అని నాసా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

అసలు మాయన్ కేలండర్ ఈ డిసెంబర్‌తో ముగిసి పోవడం లేదని వీరు చెబుతున్నారు. "ఒక ఏడాదికి సంబంధించి మన కేలండర్ డిసెంబర్ 31తో ముగుస్తుంది. మళ్లీ కొత్త సంవత్సర కేలండర్ జనవరి 1 నుంచి మొదలవుతుంది. అలాగే మాయన్ కేలండర్ కూడా 2012 డిసెంబర్ 21 తర్వాత మళ్లీ తిరిగి ప్రారంభమవుతుంది'' అంటూ నాసా శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు. వాస్తవానికి ఏదైనా గ్రహం భూమిని సమీపించి ఢీకొట్టేది ఉంటే దాన్ని శాస్త్రవేత్తలు దశాబ్దం ముందే పసిగట్టగలరు. మరి ఈ డిసెంబర్ 21న ఏదైనా గ్రహం మన భూమిని ఢీకొనే పరిస్థితే ఉంటే దాన్ని ఇప్పుడు మనం కళ్లతో ప్రత్యక్షంగా తిలకించవచ్చని నాసా శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot