Home
News

2 నెలలు పడుకోండి, 13 లక్షలు ఎత్తుకుపోండి

మీకు బాగా నిద్రపోయే అలవాటు ఉందా, రోజులో ఎక్కువ భాగం నిద్రకే కేటాయిస్తున్నారా.. మీకు నిద్రపోతే మరో లోకం తెలియదా.. అయితే మీరు దానిలో సమర్థులయితే పదమూడు లక్షల రూపాయలను గెలుచుకోవచ్చు. మీరు 2 నెల‌ల పాటు ని

మీకు బాగా నిద్రపోయే అలవాటు ఉందా, రోజులో ఎక్కువ భాగం నిద్రకే కేటాయిస్తున్నారా.. మీకు నిద్రపోతే మరో లోకం తెలియదా.. అయితే మీరు దానిలో సమర్థులయితే పదమూడు లక్షల రూపాయలను గెలుచుకోవచ్చు.

2 నెలలు పడుకోండి, 13 లక్షలు ఎత్తుకుపోండి

మీరు 2 నెల‌ల పాటు నిరంత‌రాయంగా నిద్రిస్తూ దాన్ని ఎంజాయ్ చేయగలిగితే మీకు నాసా రూ.13 ల‌క్ష‌లు ఇస్తుంది. రెండు నెలల స‌మ‌యం పూర్త‌యితే ముందు చెప్పిన‌ట్లుగా మీకు రూ.13 ల‌క్ష‌లు ఇస్తారు. పూర్తి వివరాల్లోకెళితే..

నాసా, ఈఎస్ఏ సంస్థ‌లు

నాసా, ఈఎస్ఏ సంస్థ‌లు

యూఎస్ఏ టుడే పొందుపరిచన క‌థ‌నం ప్ర‌కారం నాసా, ఈఎస్ఏ సంస్థ‌లు త్వ‌ర‌లో ఓ ప్ర‌యోగం నిర్వ‌హించ‌నున్నాయి. అందులో పాల్గొనే వారు రెండు నెల‌ల పాటు నిద్రిస్తూనే ఉండాలి. వారు నిద్రించే రూమ్ అంతరిక్షాన్ని పోలి ఉంటుంది.

నాసా ప్ర‌యోగాలు

నాసా ప్ర‌యోగాలు

ఆ స్థితిలో వారిని ఆర్టిఫిషియ‌ల్ గ్రావిటీ చాంబ‌ర్ ను పోలిన ఓ గ‌దిలో ఉంచుతారు. అందులో అంత‌రిక్షంలో లాంటి వాతావ‌ర‌ణం ఉంటుంది. అంటే పూర్తిగా బ‌రువు ర‌హిత స్థితి అన్న‌మాట‌. ఆ స్థితిలో ఉన్న మాన‌వుల‌పై ఎలాంటి ప్ర‌తికూల ప్ర‌భావాలు ఉంటాయి, వాటిని ఎలా ఎదుర్కోవాలి..? అన్న అంశాల‌పై నాసా ప్ర‌యోగాలు చేయ‌నుంది.

మొత్తం 24 మంది వాలంటీర్లు

మొత్తం 24 మంది వాలంటీర్లు

నాసా చేస్తున్న ఈ ప్ర‌యోగానికి మొత్తం 24 మంది వాలంటీర్ల కోసం చూస్తున్నారు. వారిలో 12 మంది పురుషులు, 12 మంది స్త్రీలు అయి ఉండాలి. వారిని రెండు గ్రూపులుగా విభ‌జించి ఆర్టిఫిషియ‌ల్ గ్రావిటీ చాంబ‌ర్ ను పోలిన ఓ గ‌దిలో ఉంచుతారు.

2 నెలల వ‌ర‌కు

2 నెలల వ‌ర‌కు

అందులో ఒక గ్రూపు వారిని సెంట్రిఫ్యూజ్‌లో ఉంచి తిప్పుతారు. మ‌రొక గ్రూపు వారిని సాధారణ స్థితిలో ఉంచుతారు. అయితే ఆ స్థితుల్లో రెండు గ్రూపుల వారు నిద్రిస్తూనే ఉండాలి. 2 నెలల వ‌ర‌కు అలా నిద్రిస్తున్న సమయంలో సైంటిస్టులు తమ ప్ర‌యోగాలు చేస్తారు.

 రూ.13 ల‌క్ష‌ల‌కు పైగా

రూ.13 ల‌క్ష‌ల‌కు పైగా

ఈ రెండు నెలల స‌మ‌యం ముగిశాక వాలంటీర్ల‌కు 19వేల అమెరిక‌న్ డాల‌ర్ల‌ను ఇస్తారు. అంటే మ‌న క‌రెన్సీలో రూ.13 ల‌క్ష‌ల‌కు పైగానే ఉంటుంద‌న్న‌మాట‌.

సెప్టెంబ‌ర్ నుంచి డిసెంబ‌ర్ వ‌ర‌కు

సెప్టెంబ‌ర్ నుంచి డిసెంబ‌ర్ వ‌ర‌కు

ఇక ఈ ప్ర‌యోగం ఈ ఏడాది సెప్టెంబ‌ర్ నుంచి డిసెంబ‌ర్ వ‌ర‌కు జ‌ర‌గ‌నుండ‌గా ఇందులో పాల్గొనాల‌నుకునే వారు https://dlr-probandensuche.de/ వెబ్‌సైట్‌ను సంద‌ర్శించి అందులో పొందుపరిచిన వివరాలను చూడగలరు.

Best Mobiles in India

English summary
NASA Will Pay You Rs 13 Lakh To Sleep In Bed And Do Nothing For Two Months
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X