ఫేస్‌బుక్, గూగుల్ ప్లస్‌ల ఆసూయ యుద్దం మొదలైంది

Posted By: Staff

ఫేస్‌బుక్, గూగుల్ ప్లస్‌ల ఆసూయ యుద్దం మొదలైంది

న్యూయార్క్: ఆరు సంవత్సరాలు అలుపెరగని సుదీర్ద ప్రయాణం. ఈ ఆరు సంవత్సరాల నుండి కూడా నెంబర్ వన్ స్దానమే. ఇంతకీ ఎవరా ఈ నెంబర్ వన్ స్దానాన్ని కోనసాగిస్తున్న వారు ఎవరా అని అనుకుంటున్నారా.. ఫేస్‌బుక్ అండి. ఆరు సంవత్సరాల పాటు ఏక ఛత్రాధి పత్యాన్ని ఏలినటువంటి ఫేస్‌బుక్‌కి గూగుల్ ప్లస్ రూపంలో ఓ కాంపిటేటర్ వచ్చింది. దీంతో సోషల్ నెట్ వర్క్ మార్కెట్లో ఈ రెండింటి మద్య గట్టి పోటీ ఏర్పడింది.

ఈ పోటీ ఎలా తయారైంది అంటే గూగుల్ ప్లస్‌లో ఉన్న వ్యక్తిని ఫేస్‌బుక్ యూజర్స్ ఫాలో అవ్వకుండా బ్యాన్ చేసేంతగా. దీంతో వెబ్ డవలర్ మైఖెల్ లీ జాన్సన్ ఫేస్‌బుక్లో పెట్టినటువంటి గూగుల్ ప్లస్ యాడ్‌పై ఫేస్‌బుక్ అలా చేయడంతో అతను మండిపడ్డాడు. అంతేకాకుండా తన గూగుల్ ప్లస్ ఎకౌంట్ ఈ విషయాన్ని ప్రస్తావించాడు. అంతేకాకుండా ఫేస్‌బుక్ నుండి మెసేజ్‌ని పోందిన విషయం కూడా ప్రస్తావించాడు. ఫేస్‌బుక్ నుండి వచ్చినటువంటి మెసేజ్‌లో ఉన్న సమాచారం ఏమిటంటే ఫేస్‌బుక్ ఎడ్వర్టైజింగ్ నిబంధలను అతిక్రమించినందుకు గాను ఫేస్‌బుక్లో ఉన్న మీ గూగుల్ ప్లస్ యాడ్‌ని తీసివేయడం జరుగుతుందని ఉంది.

దీనితోపాటు మీరు ఫేస్‌బుక్ నిబంధలను అతిక్రిమించినందుకుగాను మీ ఫేస్‌బుక్ ఎకౌంట్‌ని కూడా అనర్హూడిగి చేస్తున్నాం అని అన్నారు. ఎటువంటి పరిస్దితుతలలోను మీ ఎకౌంట్‌కి సంబంధించిన యాడ్స్‌ని కూడా ప్రదర్శింపబడ జేయడం కుదరదు. మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఫేస్‌బుక్ ఎడ్వర్టైజింగ్ గైడ్ లైన్స్‌ని తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాం అని తెలియజేశారు. ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్న గూగుల్ ప్లస్‌కి సంబందించి ఎటువంటి యాడ్స్‌ని కూడా ఫేస్‌బుక్ తన పేజీలలో రానివ్వకుండా జాగ్రత్త పడుతుందంటే ఈ రెండింటి మద్య ఎంతు పోటీ ఉందో మనకు తెలిసిపోతుంది.

ఇక గూగుల్ ప్లస్‌‍ విడుదల చేసిన రెండు వారాలకే 10 మిలియన్ యూజర్ల సంఖ్యకు చేరిన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే గూగుల్ ప్లస్ ఇన్విటేషన్‌ని ఎలా పోందాలో అనేదాని గురించి ట్విట్టర్, ఫేస్‌బుక్‌లలో చర్చలు జరుగుతున్నాయి. ఇది ఇలా ఉంటే సాప్ట్ వేర్ గెయింట్ మైక్రోసాప్ట్ కూడా చాటుగా ఓ సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్‌ని త్వరలో మన ముందుకు తీసుకు రావడానికి అన్ని ఏర్పాట్లు చేస్తుందని సమాచారం. మైక్రో సాప్ట్ ప్రవేశపెట్టనున్న ఆ సోషల్ నెట్ వర్క్ సైట్ పేరు 'తులాలిప్'. దీనిని బట్టి చూస్తుంటే ఈ యుద్దం ఇప్పటిలో ముగిసేటట్లు లేదు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot