Home
News

ఫాస్టాగ్‌ KYC గడువును మరోసారి పొడిగించిన NHAI.. ఎలా అప్‌డేట్‌ చేయాలంటే..?

ఫాస్టాగ్‌ కేవైసీని పూర్తి చేసేందుకు మరోసారి గడువును పొడిగిస్తూ హైవేస్‌ ఆథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) నిర్ణయం తీసుకొంది. ఈ సంవత్సరం జనవరి 31 వరకు గతంలో గడువు విధించింది. అనంతరం దాన్ని ఫిబ్రవరి 29 వరకు గడువు పొడిగించింది. తాజాగా ఫాస్టాగ్‌ కేవేసీని అప్‌డేట్‌ చేసుకొనేందుకు మార్చి 31 వరకు గడువు విధించింది.

ఈ గడువు అనంతరం ఫాస్టాగ్‌ కేవైసీ (Fastag KYC Update) పూర్తిచేయని ఖాతాలను డియాక్టివేట్‌ సహా బ్లాక్‌ చేస్తామని తెలిపింది. ఖాతాలో నగదు ఉన్నా డియాక్టివేట్‌ చేస్తామని పేర్కొంది. పేటీఎం పేమెంట్స్‌ బ్యాంకులో నెలకొన్న సమస్యల కారణంగా ఈ గడువు పొడిగింపు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

NHAI extended fastag KYC deadline to March 31

కొందరు వినియోగదారులు ఒకటి కంటే ఎక్కువ ఫాస్టాగ్‌ ఖాతాలు కలిగి ఉన్నట్లు NHAI గుర్తించింది. దీనికి చెక్‌ పెట్టేందుకు వన్‌ వెహికల్‌ - వన్‌ ఫాస్టాగ్‌ను (One Vehicle - One Fastag) అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో భాగంగా రిజర్వ్‌ బ్యాంకు మార్గదర్శకాలను అనుగుణంగా ఫాస్టా్‌గ్‌ ఖాతాల కేవైసీని అప్‌డేట్‌ చేయాలని పేర్కొంది.

ఫాస్టాగ్‌ KYCను అప్‌డేట్‌ చేసేందుకు.. (NHAI extended fastag KYC deadline) వాహనదారుడి గుర్తింపు కార్డు, వాహన రిజిస్ట్రేషన్‌ సర్టిఫికేట్‌ (RC), పాస్‌పోర్ట్‌ సైజు ఫోటో, చిరునామాకు సంబంధించిన పత్రాలు అందుబాటులో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇందులోని వివరాలను అప్‌డేట్‌ సమయంలో నమోదు చేయాల్సి ఉంటుంది.

ఫాస్టాగ్‌ను ఎలా అప్‌డేట్‌ చేయాలి.
స్టెప్‌ 1 : జాతీయ రహదారుల సంస్థకు చెందిన IHMCL సంస్థ వెబ్‌సైట్‌లో లాగిన్‌ కావాలి. అందులో మై ప్రోఫైల్‌ పైన క్లిక్‌ చేయాలి.
స్టెప్‌ 2 : అందులో KYC దగ్గర క్లిక్‌ చేయాలి.
స్టెప్‌ 3 : KYC సెక్షన్‌లోని కస్టమర్‌ టైప్‌ను సెలెక్ట్ చేసి ఆప్షన్‌లోకి వెళ్లండి.
స్టెప్‌ 4 : అక్కడ అడిగిన వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది.

స్టెప్‌ 5 : అనంతరం వెబ్‌సైట్‌లో నిబంధనలకు అనుగుణంగా పాస్‌ఫోర్ట్‌ సైజు ఫోటోను అప్‌లోడ్‌ చేయండి.
స్టెప్‌ 6 : అనంతరం అడ్రస్‌ను నమోదుచేసి, అప్పటి వరకు మీరు నమోదు చేసిన వివరాలను తనిఖీ చేసుకోండి.
స్టెప్‌ 7: వివరాల తనిఖీ అనంతరం సమర్పించు (Submit) పైన క్లిక్‌ చేయాల్సి ఉంటుంది.

జాతీయ రహదారులపై టోల్‌ గేట్లను ఏర్పాటుచేసి.. టోల్‌ రుసుంను కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తోంది. కొన్ని సంవత్సరాలపాటు నేరుగానే చెల్లింపులు నిర్వహించింది. అనంతరం ఈ ప్రక్రియలో కీలక మార్పులు చేస్తూ 2016లో కేంద్ర ప్రభుత్వం దేశంలోని కొన్ని టోల్‌ ప్లాజాల వద్ద FASTAG వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. 2021లో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు వాహనాలకు తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకొంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
NHAI extended fastag KYC deadline to March 31
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X