OTP చెప్పిన పాపానికి రూ.6.98 లక్షలు గోవిందా, మోసాలను అరికట్టండిలా ?

ఈ రోజుల్లో కూడా ప్రజలు ఇంత అమాయకంగా ఉన్నారా..అన్నీ చెప్పేస్తారా అనేదానికి సాక్ష్యం ఈ ఘటన. ఓ మహిళ అమాయకత్వంతో ఆన్‌లైన్ మోసగాడికి 28 సార్లు ఓటీపీ చెప్పి ఏకంగా ఏడు లక్షల రూపాయలు కోల్పోయింది.

|

ఈ రోజుల్లో కూడా ప్రజలు ఇంత అమాయకంగా ఉన్నారా..అన్నీ చెప్పేస్తారా అనేదానికి సాక్ష్యం ఈ ఘటన. ఓ మహిళ అమాయకత్వంతో ఆన్‌లైన్ మోసగాడికి 28 సార్లు ఓటీపీ చెప్పి ఏకంగా ఏడు లక్షల రూపాయలు కోల్పోయింది. అన్నిసార్లు ఓటీపీ ఎలా చెప్పావన్న పోలీసుల ప్రశ్నకు అలా చెప్పకూడదన్న విషయం తనకు తెలియదని బిక్కమొహం వేసింది. నేవీముంబైలోని ధారావి గ్రామానికి చెందిన గృహిణి (40)కి ఫోన్ చేసిన ఓ ఆన్‌లైన్ మోసగాడు తనను తాను ఎస్‌బీఐ మేనేజర్‌గా పరిచయం చేసుకున్నాడు. మీ ఏటీఎం కార్డు పనిచేయడం లేదని, అది తిరిగి పనిచేయాలంటే ఏటీఎం కార్డు వివరాలు, మొబైల్‌కు వచ్చే వన్ టైమ్ పాస్ వర్డ్ (ఓటీపీ) చెప్పాల్సి ఉంటుందని పేర్కొన్నాడు.

Xiaomi Mi 8తో పోటీపడుతున్న టాప్ హైఎండ్ స్మార్ట్‌ఫోన్లు !Xiaomi Mi 8తో పోటీపడుతున్న టాప్ హైఎండ్ స్మార్ట్‌ఫోన్లు !

ఫోన్ చేసిన ప్రతిసారీ ఓటీపీ..

ఫోన్ చేసిన ప్రతిసారీ ఓటీపీ..

అతడు చెప్పినట్టే చేసిన ఆమె అమాయకత్వంతో అతడు ఫోన్ చేసిన ప్రతిసారీ ఓటీపీ చెప్పేసింది. ఇలా మొత్తం 28 సార్లు ఫోన్ చేసి ఓటీపీ చెప్పించుకున్న మోసగాడు ఆమె బ్యాంకు ఖాతా నుంచి రూ.6.98 లక్షలు కాజేశాడు.

రూ.6.98 లక్షలు మాయం

రూ.6.98 లక్షలు మాయం

పాస్‌బుక్‌లో వివరాలు నమోదు చేసేందుకు ఇటీవల బ్యాంకుకు వెళ్లిన ఆమె ఖాతా నుంచి రూ.6.98 లక్షలు మాయమైన విషయం తెలిసి లబోదిబోమంది. ఆ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆన్‌లైన్ మోసాలపై ఆమెకు అవగాహన లేదన్న విషయాన్ని తెలుసుకున్నారు.

పోలీసులు దర్యాప్తు..

పోలీసులు దర్యాప్తు..

తన భర్త కువైట్‌లో ఉంటాడని చెప్పిన ఆమె, కుమారుడి చదువు కోసం ఇటీవలే రూ.10 లక్షల ఎడ్యుకేషనల్ లోన్ తీసుకున్నట్టు తెలిపింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు ‘ఆక్సిజన్' వ్యాలెట్‌కు రూ.4 వేలు, ముంబైలోని ఓ ‘ఫోన్ పే' వ్యాలెట్‌కు రూ.49,999 పంపినట్టు గుర్తించారు.

ఆన్ లైన్ మోసాలు

ఆన్ లైన్ మోసాలు

ఆన్ లైన్ మోసాలు ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. మరి అవి ఎలా జరుగుతాయి వాటి నుంచి రక్షణ పొందడం ఎలా అనే విషయాలు చాామందికి అర్థమయినా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. మోసం జరిగిన తరువాత అలర్టయి లబోదిబోమంటుంటారు. ఇలాంటి వారు ముందే జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ప్రాధమిక సమాచార చౌర్యం

ప్రాధమిక సమాచార చౌర్యం

మీ ప్రాధమిక సమాచార చౌర్యం వల్ల అంతగా నష్టం లేకపోయినప్పటికీ మోసాలకు ఇదే తొలి అడుగుగా మారిపోతోంది. ప్రాధమిక సమాచారం ద్వారా సమాచారాన్ని దొంగిలించి బ్యాంకు ఖాతాల్లో డబ్బును మాయం చేస్తున్నారు. ఈ ఘటనలు ఈ మధ్య చాలానే జరుగుతున్నాయి. ఈ విషయంలో అందరూ జాగ్రత్తగా ఉండాలి..

సిమ్ కార్డ్

సిమ్ కార్డ్

మీరు మీ బ్యాంకు లావాదేవీలకు నంబర్ ఇస్తుంటారు. ఈ సిమ్ పోయినా లేక దొంగిలించినా దాని ద్వారా హ్యాక్లరు చాలా సులువుగా మీ అకౌంట్లో నుండి డబ్బులు లాగేస్తారు. కాబట్టి మీరు సిమ్ పోగోట్టుకున్నా లేక దాన్ని ఎవరైనా దొంగిలించినా వెంటనే బ్లాక్ చేయించుకోవడం ఉత్తమం. లేకుంటే అదే నంబర్ మీద వేరే సిమ్ తీసుకోండి.

 మాల్ వేర్

మాల్ వేర్

మనం వాడే డివైజ్ నుండి రకరకాల యాప్ లు అలాగే వీడియోలు, ఆడియోలు డౌన్లోడ్ చేస్తుంటాం. వీటివల్ల మన ఫోన్లోకి తెలియకుండానే మాల్ వేర్ వచ్చి అటాక్ చేస్తుంది. ఈ మాల్ వేర్ ద్వారా మన ఫోన్లో ఉన్న బ్యాంకు సమాచారం వారి చేతుల్లోకి వెళ్లే అవకాశం ఉంది. ఇలాంటి వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

అపరిచితుల నుండి కాల్స్ వచ్చినప్పుడు

అపరిచితుల నుండి కాల్స్ వచ్చినప్పుడు

ఏదైమేనా అపరిచితుల నుండి కాల్స్ వచ్చినప్పుడు మీ వివరాలు చెప్పమన్నప్పుడు కొంచెం ఆలోచించి చెప్పడం మంచిది. సాధారణంగా బ్యాంకులు మీ వివరాలను ఎప్పుడూ ఫోన్ ద్వారా అడగవు. కాబట్టి మీకు కాల్స్ వచ్చినప్పుడు వివరాలు చెప్పమన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి.

Best Mobiles in India

English summary
Navi Mumbai woman loses ₹6.98 lakh by sharing OTP 28 times More news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X